ఇంట్లో చిన్నపిల్లలెవరైనా చెప్పిన మాట వినకుండా గొడవ చేస్తొంటే, పెద్దవాళ్ళు విసుగొచ్చి, "తిక్క శంకరయ్య" అని తిడుతో ఉంటారు. అంటే అలా గొడవపెడుతున్న పిల్లవాడు, వారికి, "తిక్కతో ఉన్న బాల శంకరుడిగా" దర్శనమిస్తున్నాడు అని అర్ధం! తిట్టేవాడు అలా భావయుక్తంగా గనుక తిట్టగలిగితే చక్కగా పుణ్యం, పురుషార్ధం రెండూ కలిసి వస్తాయి. అదేవిధంగా తిట్టించుకొనేవాడు కూడా అటువంటి భావం మీద గనుక మనసు నిలిపితే, దుఖానికి బదులు శాంతి ఆనందాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పటినుంచి ఒకర్నొకరు అలా భావయుక్తంగా తిట్టడం మరియు తిట్టించుకొనడం అభ్యాసం చేద్దాం. Sorry, I am just kidding 
ఇంతకీ నేను అసలు పోస్టు చేద్దామనుకున్నది శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు శివునిపై చేసిన నిందా-స్తుతి (సిరివెన్నెల సినిమాలోనిది), one of my favorite songs on Lord Siva. ఈ పాట చివరిలో, శివుడిని పాపం "తిక్క-శంకరుడి"గా సంభోదించడం చూచి, నాకు పైన వ్రాసిన అద్భుతమైన ఆలోచన వచ్చింది
I hope you have also enjoyed my idea ;-)
కార్తీక సోమవారపు శుభాకాంక్షలతో మీకోసం ఈ పాట:
కార్తీక సోమవారపు శుభాకాంక్షలతో మీకోసం ఈ పాట:
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది ||ఆది భిక్షువు||
ఏది కోరేది వాడినేది అడిగేది (2)
తీపి రాగాల ఆ కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది ॥తీపి రాగాల॥
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది (2)
నల్ల రంగునలమిన వాడినేది కోరేది ॥తీపి రాగాల॥
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది (2)
తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది ||తేనెలొలికే||
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది (2)
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది (2)
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మధుని మసి జేసినాడు
వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు
తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు
వాడినేది కోరేది
ముక్కంటి,ముక్కోపి
ముక్కంటి,ముక్కోపి
ముక్కంటి,ముక్కోపి తిక్క శంకరుడు ||ఆది భిక్షువు||
No comments:
Post a Comment
Enter your comment...