Sunday 30 January 2011

గోవింద నామాలు

గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురు దేవో మహేశ్వర:
గురుసాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

శ్రీ వెంకటేశ్వర స్వామి 108 నామాలను, చిన్న పిల్లలు కుడా ఎంతో సులువుగా రోజూ చదువుకోగలిగే విధంగా, తేలికగా అర్ధమయ్యే చిన్న చిన్న పదాలలో, చక్కని పాట రూపంలో ఎంత అందంగా మనకు పెద్దలు అందించారో కదా!

ఇక్కడ ఆ నామాలను టైపు చెయ్యడంలో ఎక్కడైనా తప్పులు ఉంటే దయచేసి తెలుపగలరు.

గోవింద నామాలు
1) శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
నిత్య నిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
 
2) పురాణ పురుష గోవిందా పుండరికాక్షా గోవిందా
నందనందనా గోవిందా నవనీత చోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

3) దుష్టసంహార గోవిందా దురిత నివారణ గోవిందా
 శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

4) గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

5) మత్స్య కూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా
వరాహా మూర్తి గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా భౌధ్ధ కల్కిధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

6) వేణుగాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రిత పరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

7) అనాధ రక్షక గోవిందా ఆపద్భాందవ గోవిందా
 శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

8) పాప వినాశక గోవిందా పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీ నాయక గోవిందా దినకర తేజ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

9) పద్మావతీ  ప్రియ గోవిందా ప్రసన్నమూర్తి గోవిందా
అభయహస్త గోవిందా అక్షయ వరదా గోవిందా
శంఖచక్రధర గోవిందా శారంగ గదాధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

10) విరజాతీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా
సాలగ్రామరూప గోవిందా సహస్రనామా గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

11) కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గరుడ వాహన గోవిందా గజరాజ రక్షక గోవిందా
వానర సేవిత గోవిందా వారధి బంధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

12) ఏడు కొండల వాడ గోవిందా ఏక స్వరూప గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

13) వజ్ర కవచ ధర గోవిందా వైజయంతి మాల గోవిందా
వడ్డికాసుల వాడ గోవిందా వసుదేవ తనయ గోవిందా
బిల్వ పత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

14) స్త్రీపుంరూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మాండ రూపా గోవిందా భక్త రక్షకా గోవిందా
నిత్య కల్యాణ గోవిందా నీరజనాభా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

15) హతీ రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్సాక్షి రూప గోవిందా
అభిషేక ప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

16) రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా
స్వయం ప్రకాశ గోవిందా ఆశ్రిత పక్ష గోవిందా
నిత్య శుభప్రద గోవిందా నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

17) ఆనంద రూప గోవిందా ఆద్యంత రహితా గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇభరాజరక్షకా గోవిందా
పరమ దయాళు గోవిందా పద్మనాభ హరి గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

18) తిరుమలవాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శ్రీ శేష శయన గోవిందా శేషాద్రి నిలయా గోవిందా
శ్రీ  శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

No comments: