Tuesday, 11 October 2011

Quiz-1

క్విజ్-1
This image is from: http://www.saibharadwaja.org/


ఈ క్రింది ప్రశ్నలకు సంక్షిప్తమైన సమాధానాలు వ్రాసుకోండి (2 లేక 3 వాక్యాలకు మించకూడదు!, brief and to-the-point answers!)
సమాధానాలు వ్రాయడం పుర్తి అయిన తర్వాత, క్రింద ఇచ్చిన లింకు వద్ద వున్న శ్రీ భరద్వాజ మాష్టారుగారి ఉపన్యాసం విని, మీ సమాధానాలను కరక్ట్ చేసుకోండి.
 ఈ క్రింద ఇవ్వబడ్డ ప్రశ్నలన్నింటికీ మాష్టారుగారి ఆ ఒక్క ఉపన్యాసంలోనే డైరెక్ట్ గా ఆన్సర్స్ ఉన్నాయి!

ఈ క్విజ్లో మొత్తం 14 ప్రశ్నలు వుంటాయి.
ఫ్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయింపబడ్డాయి 
చివరి రెండు ప్రశ్నలకు మాత్రం (13, 14 వ ప్రశ్నలు) ఒక్కొక్క దానికి మూడేసి మార్కులు
కాబట్టి, మొత్తం 30 మార్కులకు ప్రశ్నాపత్రం.
చివరగా, మీరు యెన్ని మార్కులు స్కోర్ చేసారో లెక్క చూసుకోవడం మర్చిపోకండి

ALL THE BEST!!!
ఇక ప్రారంభిద్దామా?

(1) "ఆధ్యాత్మిక జీవితము", "లౌకిక జీవితము" ఈ రెండింటిలో యేది ఎక్కువ ముఖ్యమైనది? ఎందువల్ల?

(2) భార్య, భర్త, పిల్లలు, సంసారము మొదలైన ఈ లౌకికమైన బరువు బాధ్యతలనుండి తప్పించుకుని, ఆధ్యాత్మిక అనుభవాలను, అనందాన్ని పొందగలగడానికి షార్ట్-కట్ ఎమైనా వుందా? ఉంటే, అది ఏమిటి?

(3) అసలు, ఆధ్యాత్మిక జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?

(4) అటువంటి  ఆధ్యాత్మికత కుదరాలంటే మనం ఏమి చెయ్యాలి? ఆధ్యాత్మికత మనకు కొంతైనా వంట పట్టిందో లేదో తెలుసుకోగలగడానికి సూచన / నిదర్శనము ఏమిటి?

(5) "దేవతలు", "రాక్షసులు", "ఋషులు" ఈ ముగ్గురూ కూడా తపస్సు చేసి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది, వరాలను పొందిన కధలను మనం పురాణాలలో వింటాము.  ఐతే, ఆ వరాలద్వారా, చిట్ట చివరకు ఆ ముగ్గురిలో ఎవరెవరు ఏమేమి సాధించారు? ఎందువల్ల అలా జరిగింది?

(6) ఎవరికైనా జీవితంలో కష్టాలు తీవ్రంగా వుండి, ఇక వాటిని భరించడం తమ వల్ల కాదు అని అనిపించినప్పుడు, వారు అత్మహత్య చేసుకంటే అది తప్పా, రైటా? ఎందువల్ల? వారు ఆత్మహత్య ద్వారా, తమను తాము కష్టపెట్టుకుంటున్నారేగానీ మరే ఇతర జీవికీ కష్టం కలిగించడం లేదు కదా?

(7) ప్రేమకు, మమకారానికి భేదం ఏమిటి?

(8) ప్రేమ లేకుండా మమకారం మాత్రమే ఉంటే ఏమవుతుంది?

(9) మమకారం కాకుండా ప్రేమ ఉన్నప్పుడు యేమి జరుగుతుంది? ఒక ఉదాహరణ ఇవ్వండి?

(10) సకల ధర్మాలు తెలిసినవాడు, పరమ భక్తుడు ఐన భీష్ముడిని, శ్రీకృష్ణుడు అర్జునుని ద్వారా చంపించవలసి రావడానికి భీష్ముడు చేసిన అంత పెద్ద దోషం ఏమిటి?

(11) ధర్మం అంటే ఏమిటి? (ఏది ధర్మమో మనకు ఎలా తెలుస్తుంది?)

(12) ధర్మంగా ఉండడం ఎందుకు? అలా ఉండకపొతే ఏమవుతుందో ఒక ఉదాహరణ ఇవ్వండి?

మాష్టారు గారి "లౌకిక జీవితము - ఆధ్యాత్మికత" ఉపన్యాసం సరిగా గుర్తు లేకపోతే, ఆ ఉపన్యాసం ఇప్పుడు ఇంకోసారి విని, ఆ తర్వాత, ఈ క్రింది రెండు ప్రశ్నలను చదివి, సమాధానాలను వ్రాయడానికి ప్రయత్నించండి!!! ఆ ఉపన్యాసానికి లింకు క్రింద ఇవ్వబడినది.
 
(13) "ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష నడుస్తుంది" అన్నదానికి, మాష్టారుగారు, వార్తాలాపం అన్న గ్రంథంలోనుండి ఒక ఉదాహరణ, తమ జీవితంలోనుండి మరో రెండు సంఘటనలను ఉదాహరణగా చెప్పారు. ఆ మూడు సంఘటనలను క్లుప్తంగా మూడు వాక్యాలలో చెప్పండి?

(14) "ధర్మశాస్త్రం గురించి ఇంత కష్టపడి ఇప్పటివరకు మనం చర్చించినదాని సారం అంతా సాయినాథుని చరిత్రలో వస్తుంది", అని చెప్పి, మాష్టారుగారు ఆ సారాన్ని మూడు వాక్యాలలో చెప్పారు. ఆ సారం ఏమిటి?

"లౌకిక జీవితము - పరమార్థికత" అన్న ఉపన్యాసాన్ని వినడానికి ఈ క్రింది లింకు మీద క్లిక్ చెయ్యండి:
http://saibharadwaja.org/audiovideos/telugu/06.%20Loukika%20Jeevithamu%20-%20Parmarthika.mp3

ఓకవేళ ఆ ఉపన్యాసంలో యెక్కడైనా  ఆడియో క్లియర్ గా లేకపొతే, ఈ క్రింది లింకువద్ద వున్న PDF పుస్తకంలో చదువుకోండి:
http://saimastersevatrust.org/Books/Loukika.pdf

No comments: