Wednesday, 25 January 2012

Humor+Teaching-4




ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామా పేరిట రూ. 2 మనియార్డరు పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలచి, శ్యామా ఆ కాసులు మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. ఆరు మాసాల తర్వాత, శ్యామా ఇంట దొంగలుపడి సర్వం దోచుకుపోయారు. అతడు బాబాతో మొర పెట్టుకుంటే ఆయన నవ్వుతూ, "నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి రూ. 2 పోయి 6 మాసాలైంది. నేనెవరికి చెప్పుకోను!" అన్నారు. "అంతచిన్న తప్పుకు, ఇంత పెద్ద శిక్షా?" అన్నాడు శ్యామా. "నీలాంటి ఉద్యోగికి అదెంతో, నాలాంటి ఫకీరుకి రూ. 2 అంతే" అన్నారు సాయి. ఈ లీలకు భరద్వాజ మాస్టారుగారు వ్రాసిన కామెంట్: "కర్మ సూత్రమెంత సూక్ష్మమో!" 

Many devotees from far and wide would write letters to Sai Baba of Shirdi. Shama was the one who read the letters aloud to Him and wrote a reply according to Sai Baba’s narration. Well, letters where not the only thing that were sent to Sai Baba through post. Many devotees would send money through post to Saibaba. Shama used to collect this money from the post office and hand it over to Sai Baba. Once it happened that a devotee had sent two Ruppes via post. Shama collected the money, on his way back somehow his intentions where changed. He did not return the money to Sai, instead he hide it over the door of huge room adjacent to Dwarkamai, where Ratha was accommodated, in a cervice of wall. One night there was a theft in Shama’s home. He was robbed of Rs. 250/-, quite a significant amount for a man like him in those days. Search was made for the lost money, police were reported, in vain. The thief or the money were not to be discovered. The depressed and angry Shama went straight to his Deva, and said, “Deva there was a theft in my house and two hundred and fifty Rupees, were stolen. Do you feel good about it? Poor man like me lost so much money. Deva, whom can I tell the tale of woe but You?" Sai Baba, who was calmly listening to the woes replied, “Arre Shamyaa, what is the matter? Because there was a theft, and you lost your money, you came to me with your complaint. But when My two Rupees were stolen, to whom should I complain?” Shama quick to understand the pointer of Sai Baba replied, “Arre Deva, so You caused this robbery to happen. You are great, because Your two rupees were stolen You caused two hundred and fifty rupees to be stolen from a poor man like me. What kind of punishment is this? I lost two hundred and fifty rupees, while You lost only two rupees. What kind of justice is this?”

Sai Baba replied, “The value of two hundred and fifty rupees for a poor man like you, has the same value of two rupees for a Fakir like Me.”
The comment added by Sri Bharadwaja Master garu for this leela is: "How subtle is the law of Karma!" 


Sources:
http://www.saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx
http://forum.spiritualindia.org/

Sunday, 22 January 2012

27th Jan - Tajuddin Baba Jayanti

Sri Tajuddin Baba

Dargah of Sri Tajuddin Baba

27th January (Friday): Birthday of Sri Hazarath Tajuddin Baba.
The book: "Life and teachings of Hazarath Tajuddin Baba," in English, written by Sri Bharadwaja Master garu, can be read online from here

27 జనవరి: (శుక్రవారము): శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబాగారి జన్మ దినోత్సవము.
వారిని గురించి శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వ్రాసిన ఒక చిన్న వ్యాసాన్ని, ఈ నెల సాయిబాబా పత్రికలో ఇక్కడ చదువగలరు.

Friday, 13 January 2012

Master Gurdjieff-2


Here are some of the quotes of Master Gurdjieff (I came to know about this Master from the speeches of Master EK). May we contemplate & dip deep into the sayings of great Masters, and be bestowed with a better understanding...

(1) Conscious faith is freedom. Emotional faith is slavery. Mechanical faith is foolishness.

(2) Remember your "self" always and everywhere.

(3) By teaching others, you will learn yourself.

(4) Patience is the mother of will.

(5) The highest aim and sense of human life is the striving to attain the welfare of one's neighbor... and, that this is possible only exclusively by the conscious renunciation of one's own.

(6) Remember, you come here having already understood the necessity of struggling with yourself — only with yourself. Therefore, thank everyone who gives you the opportunity.

(7) The worse the conditions of life, the more productive the work, always, provided, you remember the work.

(8) One of the best means for arousing the wish to work on your "self" is to realize that you may die at any moment. But first you must learn how to keep it in mind.

(9) Here we (Masters?) can only direct and create conditions, but not help.

(10) People cannot perceive reality in their current states because they do not possess consciousness but rather live in a state of a hypnotic "waking sleep."

(11) Free will is the function of the Master within us. Our 'will' is supremacy of one desire over another.

Thursday, 12 January 2012

Master Gurdjieff


కులపతి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులుగారు, తైత్తరీయ ఉపనిషత్తుపై (ఆనందవల్లిపై) చేసిన తమ ప్రవచనంలో, ఒక సందర్భంలో, గుర్జీఫ్ (1877-1949) అనే మహనీయునిగూర్చి చెప్పి, వారు చెప్పిన ఒక సూక్తికి చక్కటి వివరణను సోదాహరణంగా ఇచ్చారు. మాస్టర్ గుర్జీఫ్ గురించి కృష్ణమాచార్యులుగారు తెల్పిన విషయాలు వారి మాటలలోనే ఇక చదివి ఆనందిద్దాము !

ఎదటివాడు మనకు ఎప్పుడు అపకారం చెయ్యగలడంటే... గుర్జీఫ్ (Gurdjieff) అనే ఒక మాస్టర్ (ఆయననే కజేషియన్ (Caucasian) మాస్టర్ అని కూడా అంటారు) చాలా అద్భుతంగా చెప్పాడు: "Your enemies can harm you ONLY WHEN you have the immorality to care for them" అన్నాడు. అంటే, "వాళ్ళను గురించి నువ్వు భయపడేంత అవినీతి, దానికి కావలిసినంత కక్కుర్తి, నీలో ఉన్నరోజునే, వాడు నిన్నేమైనా చెయ్యగలడు." ఆయన వాక్యాలలో చాలా పరమ సత్యాలు ఉన్నవి.  నికల్సన్ (Nicoll?)  మొదలైన మహానుభావులైన శిష్యులు, ఆయన ఒక్కొక్క వాక్యానికి,  15-25 పేజీల వ్యాఖ్యానాలను, "కామెంటరీస్" అన్న పేరుతో volumes (పుస్తకాలు) వ్రాసారు;  జాగ్రత్తగా చదువుకోవాలి.


గుర్జీఫ్ అనేటువంటివాడు చాలా పెద్ద గురువుగారు. ఆయన శిష్యులు ఇప్పుడు పారిస్లో ఒక గ్రూప్ ఉన్నారు. అక్కడకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరినీ కలుస్తూ ఉంటాను (కృష్ణమాచార్యులుగారు చెబుతున్నారు); వాళ్ళందరూ చాలా ఉత్తములైనటువంటివారు. ఆశ్చర్యకరమైన విషయాలు గుర్జీఫ్ ఇంకా చాలా చెప్పారు: "Everyone, while speaking of others, speaks of HIMSELF" అనే ఒక వాక్యం ఇచ్చారు గుర్జీఫ్. అంటే, "ప్రతివాడూ ఇతరుల గురించి మాట్లాడుతున్నవన్నీ, తనగురించే!" ఇదొక పరమ సత్యం.


ఇట్లాంటివన్నీ, మరీ దబ్బనం పెట్టి గుండెకాయ మీద పొడిచినట్టు ఉంటాయి; అసలు చదువుకోకుండా ఉంటే బాగుంటుందనిపిస్తుంది మనకు! ఆయన జీవించి ఉన్నప్పుడుకూడా శిష్యులను అలాగే చెండుకు తిన్నాడు! కెన్నెత్ వాకర్ (Kenneth Walker) అనే ఒక సైకాలజిస్ట్ ఆయన శిష్యుడు; వాణ్ణి, 10  సంవత్సరాల శిష్యరికం ఐన తర్వాత, "నా దగ్గర ఉండడానికి పనికిరావు, నువ్వు తుచ్చుడివి, వెళ్ళిపో" అని వెళ్ళగొట్టాడు.  కొన్ని సంవత్సరాలు ఐన తర్వాత సడన్‌గా ఒక రోజు అతనికి కబురు పంపించాడు. "ఎలా ఉన్నావు? బాగున్నావా? నీకు జరగవలిసినటువంటి కొంత ట్రైనింగ్లో  నా దగ్గర ఉండకూడదు. అందుచేత నిన్ను దూరంగా పంపించేసాను. ఆ ట్రైనింగు పూర్తి అయ్యింది. అందుచేత నిన్ను చూడాలనిపించి పిలుస్తున్నాను,"  అని కబురు పంపించాడు. వాడు నిజమే అనుకుని, వచ్చి దర్శించుకున్నాడు. ఆతర్వాత, అదేరోజు సాయత్రం ఆయన (గుర్జీఫ్) శరీరం విడిచిపెట్టేసాడు. అలాంటివాడు ఈ గుర్జీఫ్ అనేటువంటి ఆయన. పై రెండు వాక్యాలుకూడా ఆయన చెప్పినటువంటివే.

కనుక, పరిస్తితులవలన మనకు భయము ఎప్పుడు కలుగుతుంది అంటే, "పరిస్తితులతో నీకు ఉన్న కక్కుర్తిని బట్టి నాయనా!" అన్నాడు. మా నాన్నగారు (శ్రీ ఎక్కిరాల అనంతాచార్యులుగారు) గుంటూరులో ఇంటర్-మీడియెట్ చదువుకుంటున్న రోజులలో సంగతి ఇది: ఒక సాధువుగారు ఆ ఊర్లో ఒకరి ఇంటిలోకి వచ్చి చేరి, అలా జపం చేసుకుంటో ఉన్నారు. ఒక రోజు ఆయన, ఆ ఇంట్లో వాళ్ళని పూజకోసం ఒక చిన్నంఎత్తు బంగారం ఇవ్వమని అడిగారు. జపం అయ్యిపోయాక, ఆ ఇంట్లో వాళ్ళకి రెండు చిన్నాల బంగారం తిరిగి ఇచ్చాడు. అప్పుడు ఆ ఇంటి ఆయన భార్య తన భర్తతో, "ఏమండీ, మరి కొంచం బంగారం ఇద్దాం" అంది. అసలు విషయం ఇక్కడ ఉంటుంది; అంటే వాడు మన నెత్తిన మేకు కొట్టడానికి, మేకున్నూ మరియు సుత్తె కూడా మనమే ఇస్తాం. అవి అవతలవాడి దగ్గర ఏమీ ఉండవు. ఇలా ఒక ఇరవై రోజులు గడిచేటప్పడికి, ఆ సాధువుగారు వాళ్ళచేతే ఓ కుండ తెప్పించి, వాళ్ళనేమి అడిగాడంటే, "మీ ఇంట్లో ఉన్న నగలన్నీ పట్రండి, మీరే అవి ఆ కుండలో పెట్టి మూత పెట్టండి. ఏడు రోజులపాటు ఈ కుండకి రాత్రింబగళ్ళు మూత తియ్యకుండా పూజ చేయ్యాలి. అది పూర్తయ్యేవరకూ మధ్యలో మూత తియ్యకూడదు. అప్పుడు ఆ కుండలో ఉన్న బంగారానికి రెండు రెట్లు వస్తుంది. మరి ఆ దీక్ష మొదలు పెడదామా?" అని అడిగాడు. అప్పుడు ఆ ఇంటావిడ, "మా చెల్లెలిని కూడా పిలిపిస్తాను అన్నది." ఆ సాధువుగారు, "సరే ఐతే, అలాగే పిలిపించండి" అన్నాడు. ఆవిడని పిలిపించారు. "మా అక్కయ్యను కూడా పిలిపిస్తానండి" అన్నది. ఆవిడని కూడా పిలించారు. ఇట్లాగ, 18 కుటుంబాలు (మహాభారతం 18 పర్వాలు అన్నట్లుగా!) దీనికి ఒప్పుకున్నారు, నమ్మారు, వచ్చి వాళ్ళ బంగారాలన్నీ ఆ కుండలో పెట్టారు. మిగతా కుటుంబాలవాళ్ళని ఇంకా కొంతమందిని పిలిచారుగానీ, వాళ్ళు మాకు అఖ్ఖరలేదు అన్నారు.

దీక్ష మొదలైంది; రెండు రోజులు ఐన తర్వాత, మూడవ రోజు ఇంక ఆ గురువుగారు కనిపించలేదు. దీక్షలో బంగారం పెడుతో ఆయన ఏంచెప్పాడు అంటే, "ఏడు రోజుల లోపులో గనుక మూత తీసినట్లైతే, ఈ కుండలో ఉన్న బంగారం మొత్తమంతా రాజరాజేశ్వరీ అమ్మవారి వద్దకు వెళ్ళిపోతుంది" అని చెప్పాడు. అందుకని, భయంతో ఏడుస్తో, ఏడు రోజులూ, మూత తియ్యకుండా అలానే ఉంచారు. ఏడు రోజులు ఐన తర్వాత మూత తీసి చూసేటప్పడికి, ఇంకేముంది, ఘటాకాశం ఫఠాకాశం అని శంకరాచార్యులవారు చెప్పింది అక్కడ సాక్షాత్కరించింది!


"చూసారా, సాధువుగారు ఎలా చేసారో?" అన్నారు. సాధువుగారు చెయ్యలేదు. ఒకవేళ సాధువుగారే గనుక కర్త అయ్యివుంటే, అందరినీ చేసి ఉండేవాడు కదా! మనలో ఉన్న అసాధు-లక్షణమే కర్త. "మన కక్కుర్తి వల్లనే ఎదటివాడు మన నెత్తిన మేకు కొడతాడు" అని పైన గుర్జీఫ్ చెప్పింది అందుకని మనం తెలుసుకోవాలి. ఎప్పుడూకూడా అక్షరాలా అదొక్కటే సత్యం. ప్రపంచంలో ఎవ్వడూ ఎవ్వడికీ అన్యాయం చెయ్యగలిగినటువంటి స్థితిగానీ, అవకాసంగానీ లేకుండా ప్రకృతి మేకులు బిగించి ఉంచింది. మనకి మనమే మన కక్కుర్తి వలన మేకులు తయారుచేసి ఎదటివాడికి ఇస్తాము!

Friday, 6 January 2012

Tukaram Abhang-4

దేహ దేవాచే మందిర్...

అభంగా మరియు (ఇంచుమిచుగా) భావం:

దేహ దేవాచే మందిర్, ఆత ఆత్మా పరమేశ్వర్
(దేహం దేవుని మందిరం, అందు ఆత్మస్వరూపుడై ఉన్నది సాక్షాత్తు పరమేశ్వరుడే)

జశీ ఉసాత హో సాఖర్, తసా దేహాత హో ఈశ్వర్
(చెరుకు - దాని తియ్యదనం ఎలానో, అలానే దేహము - ఈశ్వరుడు)

జసే దుగ్ధామధ్యే లోణీ, తసా దేహీ చక్రపాణీ
(పాలల్లో వెన్న ఏ రీతిన ఉంటుందో, అలానే శరీరంలో చక్రపాణి ఉన్నాడు)

దేవ్ దేహాత్ దేహాత్, కా హో జాతా దేవళాత్
(దేహంలోని దేవుని మరచి, దేవాలయాలకు పరుగెత్తడమెందుకు?)

తుకా సాంగే మూఢ జనా, దేహి దేవ కా పహానా
(ఇది తెలియని వారికి తుకారాం చెబుతున్నాడు:
దైవం నీలోనే ఉండగా, వేరే ఎక్కడో వెతుకుతావెందుకు?)

Sunday, 1 January 2012

Tukaram Abhang-3

New Year BEST Wishes to All


అభంగా:
జేథే జాతో తేథే తూ మాఝా సాంగాతీ |
చాలవిసీ హాతీ ధరూనియా ||

చాలో వాటే ఆమ్హీ తుఝాచి ఆధార్ |
చాలవిసీ భార్ సవే మాఝా ||

బోలో జాతా బరళ కరిశీ తే నీట |
నేలీ లాజ ధీట కేలో దేవా ||

తుకా మ్హణే ఆతా ఖేళతో కౌతుకే |
జాలే తుఝే సుఖ్ అంతర్బాహీ ||
భావం (ఇంచుమిచుగా):
నేను ఎక్కడకు వెళ్ళినా నీవు నాతోనే వున్నావు
ఈ జీవితంలో నువ్వే నన్ను నడిపిస్తున్నావు

నీ ఆధారంతోనే ఈ జీవిత ప్రయాణం చేస్తున్నాను
నువ్వే నా బరువు బాధ్యతలన్నింటినీ మోస్తున్నావు

నా అర్ధం లేని పలుకులకు పరమార్ధాన్ని ప్రసాదించేది నువ్వే
నా లజ్జను తొలగించి ధైర్యాన్ని ప్రసాదించేదీ నువ్వే దేవా

ఇప్పుడు కేవలం నీ అనుగ్రహమునందే క్రీడిస్తున్నానని తుకారాం చెబుతున్నాడు
బహిరంతరములు రెండింటియందునూ నీవు నాకు సుఖాన్ని ప్రసాదించావు