ఇప్పుడు చేయవలిసిన పనిని హాయిగా చెయ్యడం మానేసి, భవిష్యత్తులో నేను ఏ
ఉద్యోగంలోకి మారితే బాగుటుంది? ఏ సిటీలో స్థిరపడితే బెటర్‌గా ఉంటుంది?
అప్పటికి నా ఆరోగ్యం ఎలా ఉంటుందో? అని, ఇలాంటి long-term విషయాల గురించి
ఇప్పటినుంచీ బుర్ర వేడెక్కి పోయి, పొగలొచ్చేసేలా తీవ్రంగా ఆలోచిస్తూ, నిరంతర మేథోమథనం
చేస్తూ, కనపడ్డ ప్రతీవాడి బుర్రా కూడా తినేసేవారికోసమని ఓ చక్కటి పాట :-)
(Disclaimer: ఈ మాటలు జోక్‌గా అంటున్నవేగానీ ఎవరినీ ఉద్దేశించి అంటున్నవి కాదు, ముఖ్యంగా ఈ పోస్టు చదువుతున్నావాళ్ళని ఉద్దేశించి అంటున్నవి అస్సలు కాదు :-) )
ఈ పాట అర్ధం గురించి మరీ సీరియస్‌గా ఆలోచించకుండా, కొంచం సరదాగా వినండి :-) చాలా హాస్యంగా ఉంది. Hope you too enjoy this song!

పాట వ్రాసినవారు: శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు. సంగీతంకూడా (by మిక్కీ) పాటకు చక్కగా కుదిరినట్లుంది.
ఈ పాటను ఇక్కడ వినగలరు.
పల్లవి:
ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం? అని కలవరపడడం - కొందరి తరహా!
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని - కొందరి సలహా!
ఏదో తలవడం, వేరే జరగడం, సర్లే అనడమే - వేదాంతం!

దేన్నో వెతకడం, ఎన్నో అడగడం - ఎపుడూ తెమలని రాద్దాంతం!
ఏం చేద్దాం? అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం?

ఏం చూద్దాం? మునుముందేముందో తెలియని చిత్రం
ఏం అందాం? మననెవరడిగారని ఏమని అంటాం?
ఏం విందాం? తర తరికిట తక తక ధూం ధూం తక ధూం
ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు
ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం? అని కలవరపడడం - కొందరి తరహా!
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని - కొందరి సలహా!
చరణం 1:
చరణం 1:
ఫాలో-పదుగురి బాట, బోలో-నలుగురి మాట
లోలో-కలవరపాట? దాంతో-గడవదు పూట
ఇటా? అటా? అని ప్రతొక్క దారిని నిలేసి అడగకు సహోదరా
ఇదే ఇదే అని ప్రమాణపూర్తిగ తెగేసి చెప్పేదెలాగరా?
ఇది గ్రహించినారా మహాజనం? ప్రయాస పడి ఏం ప్రయోజనం

సిమెంటు భూతల సహార దారిది నిలవడం కుదరదే కదలరా
ఏం చేద్దాం? అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం?
ఏం చూద్దాం? మునుముందేముందో తెలియని చిత్రం
ఏం అందాం? మననెవరడిగారని ఏమని అంటాం?
ఏం విందాం? తర తరికిట తక తక ధూం ధూం తక ధూం
చరణం 2:
చరణం 2:
ఎన్నో పనులను చేస్తాం, ఏవో పరుగులు తీస్తాం
మ్‌మ్‌హ్ సతమతమవుతాం, ఓహో బతుకిదే అంటాం
అడంగు తెలియని ప్రయాణమె యుగ యుగాలుగా మన అయోమయం
వెనక్కు తిరగని ప్రవాహమె యే తుఫాను తరిమిన ప్రతీక్షణం
ఇది పుటుక్కు జర జర డుబుక్కుమే అడక్కు అది ఒక రహస్యమె

ఫలాన బదులని తెలీని ప్రశ్నలు అడగడం అలగడం తగదుగా
ఏం చేద్దాం? అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం?
ఏం చేద్దాం? అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం?
ఏం చూద్దాం? మునుముందేముందో తెలియని చిత్రం
ఏం అందాం? మననెవరడిగారని ఏమని అంటాం?
ఏం విందాం? తర తరికిట తక తక ధూం ధూం తక ధూం
ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం? అని కలవరపడడం - కొందరి తరహా!
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని - కొందరి సలహా!
No comments:
Post a Comment