Sunday, 2 February 2014

Bharatiya Bala Siksha - Books for Teaching Kids

చిన్న పిల్లలకు చక్కటి విద్యను అందించి వారిని సరి అయిన మార్గంలో తీర్చిదిద్దుట కొఱకు, కులపతి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి (మాస్టర్ ఇ.కె. గారి) పర్యవేక్షణలో "భారతీయ బాలశిక్ష" అను పేర నాలుగు భాగములగా పుస్తక రచన చేయబడినది.  ఈ పుస్తకములు కులపతి బుక్ ట్రస్ట్ ద్వారా లభ్యమగుచున్నవి.

 
 
ఈ పుస్తకములు కావలిసినవారు క్రింది చిరునామాకు లేదా ఫోన్ నంబరుకు సంప్రదించగలరు:
The World Teacher Trust
45-40-36/1, Akkayya palem
Visakhapatnam, 530 016, A.P., India
phone: +91-8912-565291
అవకాసము ఉన్నవారు  ఈ పుస్తకాలను నేరుగా హైదరాబాదులోని కోఠిలో ఉన్న "స్పిరిట్యుయల్ బుక్ సెంటర్" వద్దనుండి కూడా పొందవచ్చును. ఈ బుక్‌షాప్ కోఠి బస్‌స్టాప్‌కి చాలా దగ్గరగా (ఉమెన్స్ కాలేజీ దగ్గరలో) ఉన్నది (Exact Address: Near Viswa hindu parishat, vijaya building, koti junction). ఈ బుక్ సెంటర్ ఫోన్ నంబర్: 040-66775661
. Before going there, you may call them to make sure of the availability of those books and the shop timings. Each of these volumes costs around Rs. 60/-.


చివరిగా ఆ పుస్తకముల మొదటిలో వ్రాయబడిన పరిచయ వాక్యములను ఇచ్చట పొందుపరచుచున్నాను:

పరిచయము:

మనది భారతీయ సంప్రదాయము. ఇది అనుష్ఠానమునకు సంబందించినది. దీనిని సక్రమముగా గ్రహించి పాటించుట వలన వ్యక్తిగతమైన పురోభివృద్ధితో పాటు సమాజమున సామరస్యము, దేశ సౌభాగ్యము వర్ధిల్లుచుండును. దీనిని మన ప్రాచీన భారతీయులు నిరూపించిరనుట చారిత్రిక సత్యము.

మన భారతీయ సాంప్రదాయము ననుసరించి తల్లిదండ్రులే బిడ్డలకు మొదటి గురువులు. వారికి విద్యార్థి దశలో ఉపాధ్యాయులు గురువులు. కనుక విద్యార్థులలో వికాసమును కలిగించుటతోపాటు సదాచారమును, మన సాంప్రదాయపు విలువలను శాస్త్రీయమైన పద్ధతిలో నేర్పవలసిన బాధ్యత వీరిపై నున్నది. ఈ ప్రయోజనమును ఉద్దేశించియే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ వరల్డ్ టీచర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు 'కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులచే' భారతీయ బాలశిక్షా ప్రణాళిక సంకల్పించబడినది. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, ప్రాచీన శాస్త్రములలో నిక్షిప్తము చేయబడిన అద్భుతమైన విజ్ఞానము, భారతీయ బాలశిక్ష ఒక్కొక్క పుస్తకములో ప్రార్ధన, ప్రశ్నలు - జవాబులు, చక్కని పాటలు, నీతి పద్యముల రూపమున 30 పాఠములుగా కూర్పు చేయబడినవి. ఇంతవరకు నాలుగు భాగములు వెలువడినవి. ఇవి రాష్ట్రమున గల అనేకమైన ప్రైవేట్ విద్యా సంస్థలలో స్వీకరింపబడినవి. అట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖలలో కూడా విశేషముగా ఆదరింపబడినవి. లక్షల ప్రతులు ప్రభుత్వ శాఖలకు విక్రయింపబడినవి. జగద్గురుపీఠం సంబంధితమైన బాలభాను విద్యాలయాలలో ఈ బాలశిక్ష ప్రత్యేకముగా నేర్పబడుచున్నది. అట్లే మన సాంప్రదాయము ప్రాతిపదికగా నిర్వహింపబడుచున్న అనేక విద్యాలయములలో కూడా ఈ భారతీయ బాలశిక్షలను పాఠ్యాంశములుగా నేర్పుట కూడా జరుగుచున్నది. వేసవి సెలవులలో ఈ బాలశిక్ష విద్యార్థినీ విద్యార్థులకు బోధించు సంప్రదాయము ఏర్పడినది.

ప్రాచీన భారతీయ వృక్షశాస్త్రము, భూగోళ, ఖగోళ శాస్త్రములు మరియు కొన్ని చారిత్రిక సత్యములు నవీన శాస్త్రమున ఇంకను కనుగొనబడలేదనుట వాస్తవము. వానిని సరళముగా అందించుటయే ఇందలి విశేషము.

మానవ ధర్మము మతాతీతమైనది. కనుక దానిని ఆచరించుట వలన అన్ని మతములను గౌరవించు మంచితనము అప్రయత్నముగా సిద్ధించును. అట్లే విశ్వప్రేమ మార్గమున నడచుట వలన అన్ని జాతుల వారిని ఆదరించుట అలవడును. ఇట్టి అద్భుతమైన విషయములను విద్యార్థినీ విద్యార్థులు అభ్యసించుట వలన వారు సత్పౌరులై జాతి శ్రేయస్సుకు తోడ్పడగలరని త్రికరణశుద్ధిగా మేము విశ్వసించి ఈ ప్రణాళికను సవినయముగా సమర్పించుచున్నాము. విశేషముగా ఈ ప్రణాళిక ఆదరింపబడుచున్నదనుటకు ఈ నవమ ముద్రణమే చక్కని తార్కాణము.

1 comment:

Ramakrishna said...

Thank you for details