మన సనాతన ధర్మంలో, వైదిక సాంప్రదాయంలో వివాహం చాల ప్రధానమైన అంశము. కానీ, మనలాంటి చాలామందికి, వివాహ సమయంలో చెసే చాలా క్రతువుల వైశిష్ట్యం తెలియదు (ఉదాహరణకు: స్నాతకం, గౌరీ పూజ, తలంబ్రాలు, జీలకర్ర-బెల్లం పెట్టడం, అప్పగింతలు మొదలైనవి...). వివాహం చేసుకునేవాళ్ళు మరియు వివాహం చేసే పెద్దలు వాటి అర్ధము మరియు ప్రాముఖ్యత తెలుసుకోవడంవల్ల మరింత ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలము.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, వివాహం గురించి చేసిన ప్రవచనాలను ఈక్రింది లింకు నుండి వినవచ్చును:
అంతే కాక, పై ప్రవచనములలో ఈమధ్య కాలంలో జరుగుతున్న వివాహాలలో మనకు తెలియక పోయడం వల్లగానీ, లేదా నిర్లక్ష్యం వల్లగానీ చేస్తున్న ప్రమాదకరమైన పొరపాట్లను, ఆ తప్పులవల్ల కలిగే పరిణామాలను యెంతో సవివరంగా తెలియచేసారు.
పై ప్రవచనములనుండి మనము కూడా ప్రయోజనమును పొందెదము గాక.
స్వస్తి.
No comments:
Post a Comment