త్యాగరాజు గారు పదమూడు సంవత్సరాలు వయసు నుండే అనేక కీర్తనలను వ్రాసి స్వరపరిచారు. ఆయన గురువుగారు శ్రీ సొంఠి వెంకటరమణయ్య గారు త్యాగయ్య గారి ప్రతిభకు ఎంతగానో సంతోషించి, ఆయన గొప్పతనం గురించి తంజావూరు మహారాజుకి చెప్పగా, ఆ రాజుగారు అనేక ధన కనక వస్తు వాహనాది రాజ లాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించారు. కానీ త్యాగరాజుగారు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే "నిధి చాల సుఖమా..." అనే ఈక్రింది చక్కటి కీర్తన:
ప. నిధి చాల సుఖమా రాముని
సన్నిధి సేవ సుఖమా నిజముగ పల్కు మనసా
అ. దధి నవనీత క్షీరములు రుచియో
దాశరథి ధ్యాన భజన సుధా రసము రుచియో (ని)
చ. దమ శమమను గంగా స్నానము సుఖమా
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా
మమత బంధన యుత నర స్తుతి సుఖమా
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా (ని)
భావం:
ఓ మనసా, నిజంగా చెప్పు:
ఈపాటను నాగయ్య గారు తీసిన త్యాగయ్య సినిమాలో చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఆ పాటను క్రింది లింకులో చూడగలరు.
References:
http://thyagaraja-vaibhavam.blogspot.com/2008/09/thyagaraja-kriti-nidhi-chala-sukhama.html
http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81
ప. నిధి చాల సుఖమా రాముని
సన్నిధి సేవ సుఖమా నిజముగ పల్కు మనసా
అ. దధి నవనీత క్షీరములు రుచియో
దాశరథి ధ్యాన భజన సుధా రసము రుచియో (ని)
చ. దమ శమమను గంగా స్నానము సుఖమా
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా
మమత బంధన యుత నర స్తుతి సుఖమా
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా (ని)
భావం:
ఓ మనసా, నిజంగా చెప్పు:
- రాముని యొక్క సన్నిధిలోనుండి ఆయన సేవ చేసుకోవడం సుఖమా? లేక భౌతికమైన ఐశ్య్వర్యాలను అనుభవించడం సుఖమా?
- పెరుగు, అప్పుడే తీసిన వెన్న, పాలు మొ|| పదార్దములు రుచియా? లేక శ్రీరాముని ధ్యాన భజనములు అనెడి అమృత-రసము రుచియా?
- శమము, దమము (శాంతి/పవిత్రత, ఇంద్రియ నిగ్రహము) అనెడి గంగా స్నానము సుఖమా? లేక చెడు విషయములు అనెడి మురికితో నిండిన బావినీటి స్నానం సుఖమా?
- అహంకార మమకారాలు అనే బంధాలలో చిక్కుకుని వున్న సామాన్య మానవులను స్తుతించడం సుఖమా? లేక, ఓ మనసా, ఈ త్యాగరాజుచే స్తుతింపబడుతున్న శ్రీరాముని కీర్తన చేయడం సుఖమా?
ఈపాటను నాగయ్య గారు తీసిన త్యాగయ్య సినిమాలో చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఆ పాటను క్రింది లింకులో చూడగలరు.
References:
http://thyagaraja-vaibhavam.blogspot.com/2008/09/thyagaraja-kriti-nidhi-chala-sukhama.html
http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81
No comments:
Post a Comment