Tuesday 20 October 2009

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి


Here is a marvelous  song written by Sri Sirivennela Sitarama Sastry Garu:


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ ఒదులుకోవద్దురా ఓరిమి ||ఎప్పుడూ||
విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయంరా  ||ఎప్పుడూ||

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న  గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి వుండి రవిని మింగు అసుర సంద్య ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గివుండ సాగరాన ఈదుకుంటు తూరుపింట తేలుతుందిరా
నిశా విలాసమెంతసేపురా? ఉషోదయాన్ని ఎవ్వడాపురా?
రగులుతున్న గుండెకూడ సుర్యగోళ మంటిదేనురా ||ఎప్పుడూ||

నొప్పిలేని నిమిషమేది? జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా ||నొప్పి||
నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీదికాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణా
దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది, ఇంతకన్న సైన్యముండునా?
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా
నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాసకే నిరాస పుట్టదా?
ఆయువంటు వున్నవరకు చావు కూడ నెగ్గలేక శవము పైనె గెలుపు చాటురా ||ఎప్పుడూ||

I was actually trying to roughly translate it to English. Meanwhile, I found a better translation in the internet
at: http://thoughtflights.blogspot.com/2008/11/genius-of-sirivennela-seetaramashastri.html
Here it is:

Never accept defeat, my friend,
never relinquish your patience,
never rest for a moment,
never forget your conviction,
then victory is certain, my friend!

The vast sky is small before a soaring fledgling's wing,
the great ocean is diminutive for the gill of a swimming parr.
Hiding in the west, the devilish twilight has never won by swallowing the sun, my friend,
the ungulped fire-ball swims across the ocean to float in the eastern threshold!
How long can the night make merry?
Who can forestall the sunrise?
The inflamed heart is a fiery sun, my friend!

Is there a moment bereft of pain between life or death at any step in our life?
A debilitated spirit cannot seize this moment.
Life is an incessant war;
our body, our life, our blood, our strength - is there a better legion to fight with?
Hope is your weapon, breath is your armament, the goal is your charioteer;
when we ceaselessly endeavor thus, wouldn't hopelessness itself be hopeless?
As long as life prevails within, the pusillanimous death can declare its victory only on a corpse!

Never accept defeat, my friend,
never relinquish your endurance,
never rest for a moment,
never forget your conviction,
then victory is certain, my friend!





No comments: