Sunday 25 October 2009

ఎంతవరకు ఎందుకొరకు...


Here is another classic inspirational song from Sirivennala Sitarama Sastry garu:

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనే బదులు వుందే గుర్తు పట్టే గుండె నడుగు

ప్రపంచం నీలో వున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనే బదులు వుందే గుర్తు పట్టే గుండె నడుగు

కనపడే ఎన్నెన్ని కెరటాలు, కలగలిపి సముద్రం అంటారు
అడగరే ఒకొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటె ఎవరూ

సరిగ చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటూ
అది నీ ఊపిరిలో లేదా గాలి
వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్ని కలిపితే నువ్వే కాదా

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇస్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే

ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మతిలి మదికి బాష్యం
పుట్టుక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ

No comments: