Tuesday, 2 December 2014

Important Dates in December-2014

Jai Sai Master.

Tue Dec 2, 2014
  • Sri Manikya Prabhu 149th Punya-tithi

Sat Dec 6, 2014
  • Datta Jayanti
  • Manikya Prabhu 197th Jayanti

Sat Dec 13, 2014
  • Sri Sarada Mata Jayanti by tithi (22 Dec 1853, pramaadi naama samvatsara maargasira bahula saptami)

Tue Dec 16, 2014
  • Sri Chandolu Sastry gari Punya-tithi (Sri Tadepalli Raghava Narayana Sastry garu, 10 Dec 1990, pramoduta naama samvatsara maargasira bahula navami)

Thu Dec 25, 2014
  • Christmas

Tue Dec 30, 2014
  • Sri Ramana Maharshi Jayanti by date (30 Dec 1879)

Here is the corresponding link:
https://www.google.com/calendar/embed?src=t74c6rh6bcn1b1u61gl477b3d8%40group.calendar.google.com
You may click on the "Agenda" tab of the above calendar-page for a convenient view.


Jai Sai Master.

Wednesday, 29 October 2014

Upcoming Important Dates

Jai Sai Master.

Thu Oct 30, 2014
  • Sri Ekkirala Bharadwaja Master gari Jayanti, both by date & tithi (30 Oct 1938, Bahudhaanya Naama Samvatsara Kaarthika Suddha Saptami)

Thu Nov 6, 2014
  • Sri Nampally Baba gari Aradhana by date
  • Sri Guru Nanak Jayanti
  • Kaartika Pournima

Fri Nov 28, 2014
  • Sri Subrahmanya Shashti

Sat Nov 29, 2014
  • Sri Sudhendra Babu gari Aradhana by date
  • Sri Dhuniwala Dada gari Aradhana (Approx. date - 29 Nov 1930)


Here is the corresponding link:
https://www.google.com/calendar/embed?src=t74c6rh6bcn1b1u61gl477b3d8%40group.calendar.google.com
You may click on the "Agenda" tab of the above calendar-page for a convenient view.

Jai Sai Master.

Tuesday, 2 September 2014

Wednesday, 13 August 2014

Important Dates in August-2014

Jai Sai Master.

Mon Aug 4, 2014
  • Master CVV Jayanti by date

Fri Aug 8, 2014
  • Aradhana of Swami Nityananda of Ganeshpuri by date (August 8, 1961)

Mon Aug 11, 2014
  • Master EK's Jayanti by date (11th August 1926, Wednesday, 5-30PM; Kshaya nama samvatsaram, Sravana Sukla Tritiya)

Fri Aug 15, 2014
  • Sri Aurobindo Jayanti (15 August 1872)
  • Sri Vasudevananda Saraswati Swami 160th Jayanti by tithi (13 August 1854, 4-4.30 pm, Sunday, Ananda nama samvatsara Krishna Panchami)
  • Independence Day

Sat Aug 16, 2014
  • Sri Ramakrishna Paramahamsa Aradhana (16 August 1886)
  • The day of Resurrection of Saibaba of Shirdi

Sun Aug 17, 2014
  • Krishnastami
  • Tajuddin Baba Aradhana by date (17 Aug 1925)

Thu Aug 21, 2014
  • Sri Siddharudha Swami Aradhana (21 Aug 1929)

Sun Aug 24, 2014
  • Aradhana of Bhagavan Sri Venkaiah Swami of Golagamudi

Fri Aug 29, 2014
  • Sripada Srivallabha Swami Jayanti
  • Sri Gajanan Maharaj of Shegaon Aradhana
  • Vinayaka Chaviti


Here is the corresponding link:
https://www.google.com/calendar/embed?src=t74c6rh6bcn1b1u61gl477b3d8%40group.calendar.google.com
You may click on the "Agenda" tab of the above calendar-page for a convenient view.

Jai Sai Master.

Friday, 13 June 2014

శ్రీ పాకలపాటి గురువుగారి జన్మదినోత్సవము

గురుబంధువులందరికీ శ్రీ పాకలపాటి గురువుగారి జన్మదినోత్సవ హార్దిక శుభాకాంక్షలు (13 June 2014)

About Pakalapati Guruvu garu - In the words of Bharadwaja Master garu:

పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు, వారు వ్రాసిన "నేను దర్శించిన మహాత్ములు - శ్రీ పాకలపాటి గురువుగారు" అను పుస్తకాన్ని, మాస్టర్ CVV గారి గురు పూజల సందర్భంలో, వారి పాద సాన్నిధ్యంనందు ఆవిష్కరణ చేయవలసిందిగా శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారికి పంపినప్పుడు, వారు ఆ పుస్తకాన్ని శ్రీ పాకలపాటి గురువు గారి చరణములకు అంకితం చేసి, పుస్తకావిష్కరణ చేసిన సందర్భంలో వారు చేసిన అనుగ్రహ భాషణము:



శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు పతంజలి యోగసూత్రములలో "తత్సన్నిధౌ వైరత్యాగః" అనే సూత్రానికి వివరణనిస్తూ శ్రీ పాకలపాటి గురువుగారినిగూర్చి ప్రస్తావించిన సందర్భము లోనిది - small clip:


"నేను దర్శించిన మహాత్ములు - శ్రీ పాకలపాటి గురువుగారు" -- By our Bharadwaja Master garu

Information regarding Kalyan (Hindi version) or Kalyana-Kalpataru (English version) Spiritual monthly Magazine run by Gita Press, Gorakhpur.
You can download one issue and go through it to see the kind of articles they publish. In Sri Pakalapati guruvu gari charitra, there is a mention of the articles from this magazine.
జూన్-2013 సాయిబాబా మాస పత్రికలో, వెంకటరామపురంలోగల శ్రీ పాకలపాటి గురువుగారి ఆశ్రమముననందు, భక్తుల అనుభవములను, "నాటికీ - నేటికీ అదే కరుణ, అదే కృప" అన్నపేరుతో ప్రచురింపబడిన వ్యాసము:

Sairam,
Subrahmanyam.

Saturday, 10 May 2014

నెమలి - నీలకంఠుడు - శివానందలహరి


క్రితం శనివారం (3 మే 2014) అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ఫ్రాంక్లిన్ జూపార్క్‌ కి ఉదయమే బయలుదేరి వెళ్ళాము. భగవంతుడి దయవలన ఆ రోజు వాతావరణంకూడా (చాలా రోజుల తర్వాత) బాగుంది. జూపార్క్ మరీ పెద్దది కాదుగానీ - పరవాలేదు; ఒక గొరిల్లాల కుటుంబము, ఓ ముసలి-సింహము, ఓ మామూలు పులి, జన్యు లోపాలవలన తెల్లగా ఉన్న మరో పులి, చెట్లమీద నివసించే కంగారు, వేగంగా దూకుతూ పరుగెత్తగల మరో కంగారు, జడల ఒంటె - ఇలా మచ్చుకకి ఒక్కొక్క జంతువు చప్పున ఉన్నాయి. అలానే చాలా రకాల పక్షులుకూడా ఉన్నాయి.

ఉదయంనుండి నిదానంగా జూపార్క్ అంతా చూచి ఇక ఇంటికి బయలుదేరదాము అనుకునేటప్పడికి సాయంసంధ్యా సమయం (సుమారుగా 5 గం||) అయ్యింది. అప్పుడప్పుడే ఆకాశంలో మబ్బులు పడుతున్నాయి. మేము బయటకు వెళ్ళడానికి మెయిన్-గేట్ దగ్గరకి వస్తుంటే ఇంతలో ఒక నెమళ్ళ గుంపు ఎదురైంది :-)  ఆ నెమళ్ళను మేము చుస్తూ ఉండగానే అందులోని ఒక మగ నెమలి పురి విప్పింది. నెమలి పురి విప్పి, సొగసుగా అడుగులు వేస్తూ తిరుగుతూ ఉండగా ప్రత్యక్షంగా చూడడం నాకు ఇదే మొదటిసారి!

ఇక అసలు చెప్పదలుచుకున్న విషయానికి వద్దాము... పైన చెప్పిన సన్నివేశం, శివానందలహరిలో శంకరాచార్యులవారు, "నీలకంఠుడైన" పరమశివుని - "నీలకంఠయైన" నెమలితో పోల్చుతూ వ్రాసిన మనోహరమైన రెండు శ్లోకాలను మనసారా స్మరించుకుని ఆనందించేలా చేసింది. ఆ రెండు శ్లోకాలను ఇక ఇప్పుడు మీరుకూడా చదివి, వాటిని మానసికంగా అస్వాదించి ఆనందించడమే ఆలస్యం :-)
మొదటి శ్లోకం:


ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీ నతాஉ
నుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యో గీయతే
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటన్తం ముదా
వేదాన్తోపవనే విహార రసికం తం నీలకంఠం భజే (53)

నెమలికి తలపై శిఖ (చుంచు) ఉన్నట్లుగానే, ఈశ్వరుడు ఆకాశాన్నే తన శిఖగా (ముడి వేయబడిన జటాజూటముగా) కలిగియున్నాడు.

నెమలికి సర్పము ఆహారము కాబట్టి, సర్పాన్ని నెమలికి ఆభరణముగా భావన చెయ్యవచ్చును; నెమలికి సర్పము ఆభరణమైనట్లుగానే, పరమశివుడు సమస్త సర్పములకు ప్రభువైన వాసుకుని తన మెడలో ఆభరణముగా (కలాపముగా) ధరించియున్నాడు. (నెమలి మెరిసే పింఛములను ఆభరణములుగా కలిగియున్నట్లే, శివుడు నాగ మణుల కాంతులతో ప్రకాశించే వాసుకిని తన మెడలో ఆభరణముగా ధరించియున్నాడన్న మరొక అర్ధంకూడా ఇక్కడ అన్వయించుకోవచ్చును.)

పరమేశ్వరుడు తనను ఆశ్రయించినవారిని అనుగ్రహించి, వారికి ప్రణవమును (ఓంకారమును) ఉపదేశించుచున్నప్పుడు అగు శబ్దములు - ఆనందముతో నెమలి అరుచుచున్నప్పుడు వినిపించు "కేకీ" ధ్వనులవలే ఉన్నవి. 

నల్లనివి (శ్యామాం), పర్వతములవలన పుట్టినవి (శైల సముద్భములు) అయిన మేఘముల ప్రకాశమును చూచి, నెమలి ఆనందముతో పురివిప్పి నృత్యం చేస్తుంది. అలానే, పరమేశ్వరుడు - శ్యామల వర్ణము కలిగినది, శైల పుత్రి (హిమవంతుని కుమార్తె) అయిన పార్వతీదేవిని చూచి ఆనందముతో నృత్యం చేయును. అటు మేఘానికి, ఇటు పార్వతీదేవికి ఇద్దరికీ అన్వయమయ్యే "శ్యామాం", "శైల సముద్భవాం" అనే విశేషణాలను వాడడం శంకరాచార్యులవారి రచనా చమత్కృతి!


ఇక రెండవ శ్లోకం:


సన్ధ్యాఘర్మ దినాత్యయో హరికరాఘాత ప్రభూతానక
ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చంచలా
భక్తానాం పరితోష బాష్ప వితతి వృష్టిర్మయూరీ శివా
యస్మిన్నుజ్వల తాణ్డవం విజయతే తం నీలకణ్ఠం భజే (54)

చల్లని పిల్లగాలులు వీస్తున్న వేళలో, నల్లని కారు మేఘాలు గర్జిస్తుండగా, ఆకాశంలో మెరుపులు మెరుస్తుంటే, వర్షపు చిరు జల్లులు కురుస్తున్న సమయంలో - మగ నెమలి తన ఎదురుగానున్న ఆడ నెమలిని చూచి పరవశంతో నృత్యం చేస్తుంది. అలానే, ఇక ఇప్పుడు శంకరాచార్యులవారు పరమశివుడు చేసే ఆనంద తాండవాన్ని ఈ శ్లోకంలో మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు:

"అది సాయం సంధ్యా సమయం. పగటిపూట ఉన్న వేడి గాళుపులు తగ్గి, చల్లని గాలులు వీస్తున్నాయి. శ్రీ మహావిష్ణువుతో సహా సమస్త దేవతులు, మహా భక్తులు కైలాసంలోని పరమశివుని సన్నిధికి చేరుకున్నారు. విష్ణువు మృదంగము వాయించసాగాడు; అప్పుడు విష్ణువుయొక్క చేతినుండి ఉత్పన్నమైన ధ్వని మేఘగర్జన (ఉరుము) వలే ఉన్నది. అచ్చట సంభ్రమముతో వీక్షించుచున్న దేవతా సమూహముల చూపులన్నీ కలిసి ఒక మెరుపుతీగవలే ఉన్నది. భక్తుల నేత్రములనుండి వర్షించుచున్న ఆనంద భాష్పములు - వర్షపు జల్లులవలే ఉన్నవి. అప్పుడు, ఆడ నెమలిని పోలిన పార్వతీ దేవిని చూచి, పరవశముతో ఉజ్జ్వలమైన ఆనంద తాండవము చేయుచున్న ఆ నీలకంఠుని నేను భజించుచున్నాను" అని పై శ్లోకముయొక్క భావము.

కొస మెరుపు: ఆ తర్వాత రోజు (ఆదివారం) వరకూ తెలియనేలేదు - మేము జూకి వెళ్ళి, పురి విప్పిన నెమలిని చూచి, శ్రీ శంకరాచార్యులవారు వ్రాసిన శివానందలహరిలోని శ్లోకాలను స్మరించుకునే అవకాసం కలిగిన రోజు - వైశాఖ శుక్ల పంచమి అని. అంటే ఆరోజు శ్రీ శంకర భగవత్పాదుల జన్మదినము!!!



Sunday, 2 February 2014

Bharatiya Bala Siksha - Books for Teaching Kids

చిన్న పిల్లలకు చక్కటి విద్యను అందించి వారిని సరి అయిన మార్గంలో తీర్చిదిద్దుట కొఱకు, కులపతి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి (మాస్టర్ ఇ.కె. గారి) పర్యవేక్షణలో "భారతీయ బాలశిక్ష" అను పేర నాలుగు భాగములగా పుస్తక రచన చేయబడినది.  ఈ పుస్తకములు కులపతి బుక్ ట్రస్ట్ ద్వారా లభ్యమగుచున్నవి.

 
 
ఈ పుస్తకములు కావలిసినవారు క్రింది చిరునామాకు లేదా ఫోన్ నంబరుకు సంప్రదించగలరు:
The World Teacher Trust
45-40-36/1, Akkayya palem
Visakhapatnam, 530 016, A.P., India
phone: +91-8912-565291
అవకాసము ఉన్నవారు  ఈ పుస్తకాలను నేరుగా హైదరాబాదులోని కోఠిలో ఉన్న "స్పిరిట్యుయల్ బుక్ సెంటర్" వద్దనుండి కూడా పొందవచ్చును. ఈ బుక్‌షాప్ కోఠి బస్‌స్టాప్‌కి చాలా దగ్గరగా (ఉమెన్స్ కాలేజీ దగ్గరలో) ఉన్నది (Exact Address: Near Viswa hindu parishat, vijaya building, koti junction). ఈ బుక్ సెంటర్ ఫోన్ నంబర్: 040-66775661
. Before going there, you may call them to make sure of the availability of those books and the shop timings. Each of these volumes costs around Rs. 60/-.


చివరిగా ఆ పుస్తకముల మొదటిలో వ్రాయబడిన పరిచయ వాక్యములను ఇచ్చట పొందుపరచుచున్నాను:

పరిచయము:

మనది భారతీయ సంప్రదాయము. ఇది అనుష్ఠానమునకు సంబందించినది. దీనిని సక్రమముగా గ్రహించి పాటించుట వలన వ్యక్తిగతమైన పురోభివృద్ధితో పాటు సమాజమున సామరస్యము, దేశ సౌభాగ్యము వర్ధిల్లుచుండును. దీనిని మన ప్రాచీన భారతీయులు నిరూపించిరనుట చారిత్రిక సత్యము.

మన భారతీయ సాంప్రదాయము ననుసరించి తల్లిదండ్రులే బిడ్డలకు మొదటి గురువులు. వారికి విద్యార్థి దశలో ఉపాధ్యాయులు గురువులు. కనుక విద్యార్థులలో వికాసమును కలిగించుటతోపాటు సదాచారమును, మన సాంప్రదాయపు విలువలను శాస్త్రీయమైన పద్ధతిలో నేర్పవలసిన బాధ్యత వీరిపై నున్నది. ఈ ప్రయోజనమును ఉద్దేశించియే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ వరల్డ్ టీచర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు 'కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులచే' భారతీయ బాలశిక్షా ప్రణాళిక సంకల్పించబడినది. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, ప్రాచీన శాస్త్రములలో నిక్షిప్తము చేయబడిన అద్భుతమైన విజ్ఞానము, భారతీయ బాలశిక్ష ఒక్కొక్క పుస్తకములో ప్రార్ధన, ప్రశ్నలు - జవాబులు, చక్కని పాటలు, నీతి పద్యముల రూపమున 30 పాఠములుగా కూర్పు చేయబడినవి. ఇంతవరకు నాలుగు భాగములు వెలువడినవి. ఇవి రాష్ట్రమున గల అనేకమైన ప్రైవేట్ విద్యా సంస్థలలో స్వీకరింపబడినవి. అట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖలలో కూడా విశేషముగా ఆదరింపబడినవి. లక్షల ప్రతులు ప్రభుత్వ శాఖలకు విక్రయింపబడినవి. జగద్గురుపీఠం సంబంధితమైన బాలభాను విద్యాలయాలలో ఈ బాలశిక్ష ప్రత్యేకముగా నేర్పబడుచున్నది. అట్లే మన సాంప్రదాయము ప్రాతిపదికగా నిర్వహింపబడుచున్న అనేక విద్యాలయములలో కూడా ఈ భారతీయ బాలశిక్షలను పాఠ్యాంశములుగా నేర్పుట కూడా జరుగుచున్నది. వేసవి సెలవులలో ఈ బాలశిక్ష విద్యార్థినీ విద్యార్థులకు బోధించు సంప్రదాయము ఏర్పడినది.

ప్రాచీన భారతీయ వృక్షశాస్త్రము, భూగోళ, ఖగోళ శాస్త్రములు మరియు కొన్ని చారిత్రిక సత్యములు నవీన శాస్త్రమున ఇంకను కనుగొనబడలేదనుట వాస్తవము. వానిని సరళముగా అందించుటయే ఇందలి విశేషము.

మానవ ధర్మము మతాతీతమైనది. కనుక దానిని ఆచరించుట వలన అన్ని మతములను గౌరవించు మంచితనము అప్రయత్నముగా సిద్ధించును. అట్లే విశ్వప్రేమ మార్గమున నడచుట వలన అన్ని జాతుల వారిని ఆదరించుట అలవడును. ఇట్టి అద్భుతమైన విషయములను విద్యార్థినీ విద్యార్థులు అభ్యసించుట వలన వారు సత్పౌరులై జాతి శ్రేయస్సుకు తోడ్పడగలరని త్రికరణశుద్ధిగా మేము విశ్వసించి ఈ ప్రణాళికను సవినయముగా సమర్పించుచున్నాము. విశేషముగా ఈ ప్రణాళిక ఆదరింపబడుచున్నదనుటకు ఈ నవమ ముద్రణమే చక్కని తార్కాణము.

Tuesday, 25 June 2013

శ్రీ పాకలపాటి గురువుగారి ఆశ్రమంలో భక్తుల అనుభవాలు

ఈ నెల (జూన్) సాయిబాబా మాస పత్రికలో, వెంకటరామపురంలోగల శ్రీ పాకలపాటి గురువుగారి ఆశ్రమముననందు, భక్తుల అనుభవములను, "నాటికీ - నేటికీ అదే కరుణ, అదే కృప" అన్న వ్యాసములో ప్రచురించారు.  తప్పక చదువగలరు. ఈ నెల పత్రికను ఈ క్రింది లింకువద్ద ఆన్-లైన్లో చదువుకొనవచ్చును:


సాయిరాం.

Sunday, 28 April 2013

సుఖపడుట ఎలా?

సుఖపడుట ఎలా? (గురుపూజల సందర్భముగా మాస్టర్ ఇ.కె. గారు అనుగ్రహించిన ఒక ఉపన్యాసమునుండి తీసుకొనబడిన చిన్న భాగం)

"ఓం శాంతిః శాంతిః శాంతిః"
"శాంతి" అన్న శబ్దానికి, "మనస్సు శాంతిగానుండు గాక, ఆత్మ శాంతిగానుండు గాక, చిత్తము శాంతిగానుండు గాక!" అని అర్ధం. ఎప్పుడు అలా ఉంటుంది అంటే, "చుట్టుప్రక్కల వాళ్ళంతా, ఇంట్లో వాళ్ళంతా, బంధువులంతా, భార్య పిల్లలు అందరూ, ఆఫీసులో అందరూ ఉండనిస్తే శాంతిగా ఉంటుంది" అని అనిపిస్తుంది, కరుడుగట్టిన అజ్ఞానికి! అది కాకుండా "శాంతిగా ఉండటం" అంటే "మనం శాంతిగా ఉండటం" గానీ "వాళ్ళు ఉండనివ్వడం" కాదు అనే రహస్యం తెలిసినటువంటివాడికి, "శాంతిగా ఉండటం" తప్ప "అశాంతిగా ఉండటం" ఎన్నడూ ఉండదు. ఈ స్థితినుండి ఆ స్థితికి మనం రావాలి.

మనం శాంతిగా ఉండటానికి ఎన్నో విఘ్నాలు కనిపిస్తాయి, అజ్ఞానికి! "విఘ్నాలు" అంటూ నువ్వు సృష్టించుకున్నవి మినహా బయట ఎక్కడా లేవు అనే సంగతి తెలుస్తుంది. "పరిస్థితులు బాగుంటే..." అన్నటువంటి వాడికి, ప్రపంచంలో, వాడుగానీ, ఇంకొకడుగానీ, వాడి పరిస్థితులను ఎన్నడూ బాగు చెయ్యలేరు. ఇంతవరకూ సృష్టిలో ఎవ్వడూ బాగుచెయ్యలేదు. పరిస్థితులు బాగుండడం కాకుండా, తాను బాగుంటే, పరిస్థితులు తనచేత వెలిగింపబడతాయనేటువంటి రహస్యం తెలిసేదాకా జీవితం చీకటి కోణమే; వెలుగుబాట ఎన్ని దీపాలు పెట్టినా ఉండదు.

"సుఖపడేది ఎలాగ?" అని కోరిన దరిద్రుడికి సుఖం ఉండదు. "సుఖంగా ఉండడం" అనేది తెలిసినవాడికి మిగిలినవన్నీ సుఖం ఇస్తాయి. "సుఖంగా ఉండడం" అనేది ఇంకొక కండిషనుకు లొంగినదైతే, అది సుఖం అనేటువంటి పేరుకు తగినటువంటిది కాదు. సెకండ్-రేట్ థింగ్ అవుతుంది. సుఖము అద్వితీయము, పరబ్రహ్మ స్వరూపము గనుక, దానిని పరిస్థితులు పెట్టి కొనుక్కోవడానికి ప్రయత్నించేటువంటి పిచ్చివాడికి లొంగేటువంటిది కాదు. బలహీనునికి లొంగేటువంటిది కాదు.

సుఖంగా ఉండటం అనేది - లోపల మనస్సులో, హృదయములో, ఆత్మలో, ఇంద్రియాలలో ప్రారంభమవుతుంది. అక్కడనుండి క్రమంగా శరీరానికి, పరిసరాలకి, ప్రాంతానికి; తన దినచర్య వలన తన భార్యా పిల్లలు "సుఖపడుట" నేర్చుకొనుట, వాళ్ళ వలన తాను సుఖపడుట నేర్చు
కొనుట, వాళ్ళ వాతావరణం వలన ఎవరైనా అతిథులు, వారి ఇంటికి వచినవాళ్ళు కూడా సుఖపడుట నేర్చుకొనుట, అట్లాంటి కుటుంబములు ఒక వెయ్యి కుటుంబములు, ఇలాంటి చోట గురువులయొక్క చరణారవిందముల వద్దకు చేరినట్లయితే, సుఖపడుటలో వెనుకబడి ఉన్న జాతులు ఎవరన్నా ఉన్నట్లయితే, ఒకరినుంచి ఒకరు సుఖపడుట నేర్చుకుని, అందరూ సుఖములో ఉండుట జరుగుతుంది. వెనుకబడిన జాతులు ముందుకు రావడం కాదు చెయ్యాల్సింది, ముందుకు వస్తే, కొందరు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది!  కానీ అందరూ సుఖములో ఉండుట అనే నిజమైన సెక్యులర్ స్టేట్ మనకు కావాలి. అలాంటి శాంతి మనకు కలుగు గాక.

Sunday, 24 March 2013

శివ మానస పూజ


ఈశ్వరుని (లేదా ఇష్ట దైవాన్ని లేదా సద్గురువుని) నిత్యమూ, నిరంతరముగా మాననసికంగా పూజించుకోవడానికి వీలుగా శ్రీ శంకరాచార్యులవారు, కేవలము ఐదు శ్లోకాలతో కూడిన "శివ మానస పూజ" అనే స్తోత్రాన్ని మనకు ప్రసాదించారు. ఈ స్తోత్రానికి ఇంగ్లీషులో అర్ధం ఈ లింకు వద్ద కలదు. ఈ స్తోత్రము తెలుగు-లిపిలో ఈ లింకు వద్ద కలదు. పై రిఫరెన్సులు ఆధారంగా, ఆ శ్లోకాలకు నేను తెలుగులో వ్రాసుకున్న భావాలు ఎవరికైనా ఉపయోగపడతాయేమోనని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||

దయా నిధివైన ఓ దేవా! ఓ పశుపతీ! నీ కొరకు నేను నా మనస్సునందు రత్నములతో కూడిన ఒక ఆసనమును కల్పించుకున్నాను. నీకు స్నానము చేయించుటకు - హిమాలయములందలి మంచు కరుగగా ఏర్పడిన నీటిని, నీవు ధరించుటకు - దివ్యమైన వస్త్రములను, నిన్ను అలంకరించుటకు - పలు రకములైన రత్నాభరణములను, నీకు పూయడానికి - కస్తూరి చందనములను, నీ మెడలో వేయుటకు - సంపెంగలు, మారేడు దళములు, అనేక పుష్పములతో  కట్టిన పూల మాలలను, ధూపమును, మరియు దీపమును నీకు మానసికముగా సమర్పించుకొనుచున్నాను. నీవు వీటిని స్వీకరించ వలసినది.

సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||

ఓ ప్రభూ! నవరత్నములతో పొదగబడిన బంగారు పాత్రలలో - నెయ్యి వేసిన పాయసమును, ఐదు రకములైన భక్ష్యములను, పాలు, పెరుగు, అరటిపండ్లు, పానకము, వండిన కూరగాయలు, పచ్చ కర్పూరము కలిపిన రుచికరమైన జలములను, మరియు తాంబూలమును నీకు మానసికముగా భక్తితో సమర్పించుకొనుచున్నాను. ఓ ప్రభూ! నీవు వీటిని స్వీకరించ వలసినది. 

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||

ఓ ప్రభూ! నీకు ఆచ్చాదనగా ఛత్రమును (గొడుగును), నీకు వీచుటకై రెండు చామరములను, శుద్ధమైన అద్దమును, వీణ, భేరీ, మృదంగాదులతో కూడిన నృత్య గీతములను, సాష్టాంగ ప్రణామములను,  మరియు పలు విధములైన స్తుతులను - వీటినన్నింటినీ, సంకల్పమాత్రముగా నీకు భక్తితో సమర్పించుకొనుచున్నాను. ఓ ప్రభూ! ఈ నా పూజను నీవు స్వీకరించవలసినది.

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||

ఓ శంభో, నా ఆత్మయే నీవు; నాలో బుద్ధిగా పనిచేయున్నది సాక్షాత్తూ గిరిజాదేవియే (పార్వతీ దేవి); నాలోని పంచ ప్రాణములే మీ సహచరులు (గణములు); నా ఈ శరీరమే మీ గృహము; ఈ శరీరముద్వారా నేను అనుభవించెడి విషయ భోగములన్నియూ నేను మీకు ఆచరించుచున్నట్టి పూజయే; నా నిద్రే సమాధి స్థితి; నా పాదములద్వారా నేను చేస్తున్న సంచారమంతా మీకు నేను చేస్తున్న ప్రదక్షిణలే; నే పలుకుచున్న మాటలన్నీ మీ స్తోత్రములే; నేను చేయుచున్నట్టి కర్మలన్నీ, ఓ శంభో, మీయొక్క ఆరాధనయే!

కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||

నా కర చరణములు, వాక్కు, శరీరములతో చేసిన కర్మలలోగానీ, నా కన్నులు, చెవులుతోగానీ, మానసికంగాగానీ, తెలిసిగానీ, తెలియకగానీ, నే చేసిన అపరాధములు అన్నింటినీ, కరుణా సముద్రుడవైన ఓ మహాదేవ శంభో,  నీవు దయతో క్షమించుము.
 

Monday, 31 December 2012

New Year Greetings

గురు బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Saturday, 22 December 2012

Datta Kshetra Samdarsanam

I came across the videos of Datta Kshetras. These videos are made by the devotees of Sri Vasudevananda Saraswati Swami (Sri Vasudevananda Saraswati Tembe Swami Maharaj Bhakta Parivar). Here is the link to the play-list:



I like these videos very much; I think they prepared these videos by strictly adhering to the Guru Charitra; they covered various aspects like: how to reach to those kshetras, what are the things to visit there, timings, special occasions, corresponding stories from Guru Charitra, beautiful and absorbing Bhajans & stotras written by Sri Tembe Swami, Narahari etc. Although the commentary is in Marathi, it won't be that difficult to guess (more or less!) as they have used pictorial illustrations and also because most of us are familiar with those leelas in Guru Charitra...

Mentioning below the Kshetras that they covered (in the same order), some brief incomplete notes for quick reference, and also links to description of those places given by Master garu in "శ్రీ దత్తావతార మహత్యం" book:

1. Mahurgad (in Maharastra)
 Datta Swami janma sthalam (Atri Maharshi Ashramam, Anasuya Mata Mandiram, Narada Maharshi Mandiram, Renuka Mata Mandiram, Sri Ganesha Mandiram, Datta Swami Mandiram on Datta Sikharam)


2. Girnar (in Gujarat)
 (Mountains where Datta Swami did penance, datta padukas, accessible only during specified months)


3. Pithapuram (in Andhra Pradesh)
(Birth place of Sripada Swami, Swami stayed there for 16 years) link-1, link-2


4. Kuruvapur (in Karnataka)
(Sripada Swami stayed there physically for many years, did penance there and శ్రీపాదస్వామియొక్క అనేక లీలలు ప్రకటమైన ప్రదేశం. It's also the place where Sri Tembe Swami did penance) link


5. Karanja (in Maharastra)
(Birth place of Sri Narasimha Saraswati Swami, stayed there for 8 years) link


6. Audumbar (in Maharastra, near Bhilavadi)
(Sri Nrisimha Saraswati Swami did penance here, Swami's nirguna padukas are there, Swami stayed there for an year)


7. Narsobavadi, Amarapuram (in Maharastra)
(Krishna-Pancha Ganga Sangam, Swami stayed there for 12 years, samadhis of Sri Ramachandra yogi, Sri Narayana Swami Maharaj, Sri Krishnananda Swami, Sri Gopala Swami, Sri Mouna Swami, Sri Brahmananda Swami) link


8. Gandharvapuram, Gangapur (in Maharastra)
(Bhima-Amaraja Sangam, Asta tirtha, nirguna padaka mandiram, Swami's resting place, Ash hill, Sangameswara Mandiram, Oudumbar vriksham, Kalleswara Mandiram, Madhyahna bhiksha, Pallaki Seva, 3 Aratis, Madhukaram, Evening Puja, Swami stayed there for 23 years) link


9. Mangav (in Maharastra)
(Birth place of Sri Vasudevananda Swami) link-1, link-2


10. Gurdeswar (in Gujarat)
(Samadhi Mandiram of Sri Tembe Swami)


Friday, 21 December 2012

Even This Will Pass Away!

A simple poem/story encapsulating profound message worth contemplating... 

Even This Will Pass Away

Once in Persia reigned a king,
Who upon his signet ring,
Graved a maxim true and wise,
Which, when held before his eyes,
Gave him counsel at a glance,
Fit for every change and chance,
Solemn words, and these were they:
"EVEN THIS WILL PASS AWAY."

Trains of camel through the sand
Brought him gems from Samarcand;
Fleets of galleys through the seas
Brought him pearls to match with these,
But he counted little gain,
Treasures of the mine or main;
"What is wealth?" the king would say,
"EVEN THIS WILL PASS AWAY."

In the revels of his court,
At the zenith of the sport,
When the palms of all his guests
Burned with clapping at his jests,
He, amid his figs and wine,
Cried, "O loving friends of mine.
Pleasures come but not to stay,
EVEN THIS WILL PASS AWAY."

Lady, fairest ever seen
Was the bride he crowned as queen,
Pillowed on the marriage-bed
Whispering to his soul, he said,
"Though no bridegroom ever pressed
Fairer bosom to his breast,
Mortal flesh must come to clay!
EVEN THIS WILL PASS AWAY."

Fighting on a furious field,
Once a javelin pierced his shield,
Soldiers with a loud lament
Bore him bleeding to his tent,
Groaning from his tortured side,
"Pain is hard to bear;" he cried,
"But with patience, day by day,
EVEN THIS WILL PASS AWAY.”

Towering in a public square
Twenty cubits in this air,
Rose his statue carved in stone.
Then the king disguised, unknown,
Stood before his sculptured name.
Musing meekly, "what is fame?"
"Fame is but a slow decay!
EVEN THIS WILL PASS AWAY."

Struck with palsy, sore and old,
Waiting at the gates of gold,
Spake he with his dying breath
"Life is done, but what is Death?"
Then in answer to the king
Fell a sunbeam on his ring;
Showing by a heavenly ray.
"EVEN THIS WILL PASS AWAY."

—Theodore Tilton
(1867).

Tuesday, 18 December 2012

పదేళ్ళ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో?

ఇప్పుడు  చేయవలిసిన పనిని హాయిగా చెయ్యడం మానేసి, భవిష్యత్తులో నేను ఏ ఉద్యోగంలోకి మారితే బాగుటుంది? ఏ సిటీలో స్థిరపడితే బెటర్‌గా ఉంటుంది? అప్పటికి నా ఆరోగ్యం ఎలా ఉంటుందో? అని, ఇలాంటి long-term విషయాల గురించి ఇప్పటినుంచీ బుర్ర వేడెక్కి పోయి, పొగలొచ్చేసేలా తీవ్రంగా ఆలోచిస్తూ, నిరంతర మేథోమథనం చేస్తూ, కనపడ్డ ప్రతీవాడి బుర్రా కూడా తినేసేవారికోసమని ఓ చక్కటి పాట :-)
(Disclaimer: ఈ మాటలు జోక్‌గా అంటున్నవేగానీ ఎవరినీ ఉద్దేశించి అంటున్నవి కాదు, ముఖ్యంగా ఈ పోస్టు చదువుతున్నావాళ్ళని ఉద్దేశించి అంటున్నవి అస్సలు కాదు :-) )

ఈ పాట అర్ధం గురించి మరీ సీరియస్‌గా ఆలోచించకుండా, కొంచం సరదాగా వినండి :-)  చాలా హాస్యంగా ఉంది. Hope you too enjoy this song!

పాట వ్రాసినవారు: శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు. సంగీతంకూడా (by మిక్కీ) పాటకు చక్కగా కుదిరినట్లుంది.
ఈ పాటను ఇక్కడ వినగలరు.
 
పల్లవి:
ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం? అని కలవరపడడం - కొందరి తరహా!
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని - కొందరి సలహా!

ఏదో తలవడం, వేరే జరగడం, సర్లే అనడమే - వేదాంతం!
దేన్నో వెతకడం, ఎన్నో అడగడం - ఎపుడూ తెమలని రాద్దాంతం!

ఏం చేద్దాం? అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం?
ఏం చూద్దాం? మునుముందేముందో తెలియని చిత్రం
ఏం అందాం? మననెవరడిగారని ఏమని అంటాం?
ఏం విందాం? తర తరికిట తక తక ధూం ధూం తక ధూం

ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం? అని కలవరపడడం - కొందరి తరహా!
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని - కొందరి సలహా! 

చరణం 1:
ఫాలో-పదుగురి బాట, బోలో-నలుగురి మాట
లోలో-కలవరపాట? దాంతో-గడవదు పూట
ఇటా? అటా? అని ప్రతొక్క దారిని నిలేసి అడగకు సహోదరా
ఇదే ఇదే అని ప్రమాణపూర్తిగ తెగేసి చెప్పేదెలాగరా?

ఇది గ్రహించినారా మహాజనం? ప్రయాస పడి ఏం ప్రయోజనం
సిమెంటు భూతల సహార దారిది నిలవడం కుదరదే కదలరా

ఏం చేద్దాం? అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం?
ఏం చూద్దాం? మునుముందేముందో తెలియని చిత్రం
ఏం అందాం? మననెవరడిగారని ఏమని అంటాం?
ఏం విందాం? తర తరికిట తక తక ధూం ధూం తక ధూం 

చరణం 2:
ఎన్నో పనులను చేస్తాం, ఏవో పరుగులు తీస్తాం
మ్‌మ్‌హ్ సతమతమవుతాం, ఓహో బతుకిదే అంటాం
అడంగు తెలియని ప్రయాణమె యుగ యుగాలుగా మన అయోమయం
వెనక్కు తిరగని ప్రవాహమె యే తుఫాను తరిమిన ప్రతీక్షణం

ఇది పుటుక్కు జర జర డుబుక్కుమే అడక్కు అది ఒక రహస్యమె
ఫలాన బదులని తెలీని ప్రశ్నలు అడగడం అలగడం తగదుగా

ఏం చేద్దాం? అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం?
ఏం చూద్దాం? మునుముందేముందో తెలియని చిత్రం
ఏం అందాం? మననెవరడిగారని ఏమని అంటాం?
ఏం విందాం? తర తరికిట తక తక ధూం ధూం తక ధూం

ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం? అని కలవరపడడం - కొందరి తరహా!
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని - కొందరి సలహా!

Tuesday, 18 September 2012

Sripada Swami, Gajanan Maharaj

19th Sep. 2012, Wednesday (Bhadrapada Sukla Chaturdhi):
    Vinayaka Chaviti,
Sripada Srivallbha Swami Jayanti

20th Sep. 2012, Thursady (Bhadrapada Sukla Panchami):
 Sri Gajanan Maharaj Aradhana
Advanced Wishes to All Guru Bandhus!
 

Wednesday, 12 September 2012

Mother Ganga

This could be probably THE BEST comprehensive amazing documentary ever made about Mother Ganga:


I am sure you will enjoy this thoroughly, and will definitely feel the lack of enough adjectives to describe the video!

Sri Chandolu Sastry garu

భరద్వాజ మాస్టారుగారు - చందోలు శాస్త్రిగారు
(Image taken from: www.saimasterforums.org)

The following photos are shared/uploaded by Sri Potluri Srinivas garu.

(Image taken from: http://www.facebook.com/Brahmasri.Chaganti.Koteswara.Rao.garu)

(Image taken from: http://www.facebook.com/Brahmasri.Chaganti.Koteswara.Rao.garu)

(Image taken from: http://www.facebook.com/Brahmasri.Chaganti.Koteswara.Rao.garu)


 బ్రహ్మశ్రీ చందోలు రాఘవనారాయణశాస్త్రిగారు (చందోలు శాస్త్రిగారు) యొక్క జీవిత చరిత్రను సంక్షిప్తముగా శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ఈ క్రింది ప్రవచనములో తప్పక వినగలరు:



శ్రీ రాఘవనారాయణశాస్త్రిగారు బాపట్లలో చేసిన ప్రవచనములు, "నాకుతోచిన మాట" అనే పేరుతో పుస్తకముగా ప్రచురింపబడ్డాయి (25 ప్రవచనములు).
ఈ పుస్తకము ఆన్‌లైన్లో ఈ క్రింది లింకువద్ద కలదు:

http://www.kamakoti.org/telugu/31/chapters.htm
http://www.kamakoti.org/telugu/31/starting%20page.htm

ఒకవేళ ఆ website లోని తెలుగు-ఫాంట్ సరిగా display అవ్వకపోతే, ఈ క్రింది లింకువద్దగల ఫాంట్ download చేసుకుని, install చేసాక, మరలా వెబ్-పేజీని రీలోడ్ చెయ్యండి:
http://www.kamakoti.org/telugu/TLWHM0NT.TTF

ఈ సంకలనమును శ్రీ రాఘవనారాయణశాస్త్రిగారే ఎడిట్ చేసారు. వారి జీవితమునకు సంబంధించిన కొన్ని వివరములను ఇందులో చదువవచ్చును. అలానే ఈ ప్రవచనములలో రామాయణ, భారతములు మరియు పురాణములు ఆధారంగా ధర్మ సూక్ష్మములనుగూర్చి, శంకారాచార్య కృతమైన "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము" నకు వివరణ, అలానే ధర్మాచరణకు సంబంధించిన వివిధ విషయాలనుగూర్చి వివరించారు.


BTW: I come across a paper-cutting of the article that appeared in the newspaper when Sastri garu left His body:
link1
link2