Showing posts with label Master EK. Show all posts
Showing posts with label Master EK. Show all posts

Friday, 13 June 2014

శ్రీ పాకలపాటి గురువుగారి జన్మదినోత్సవము

గురుబంధువులందరికీ శ్రీ పాకలపాటి గురువుగారి జన్మదినోత్సవ హార్దిక శుభాకాంక్షలు (13 June 2014)

About Pakalapati Guruvu garu - In the words of Bharadwaja Master garu:

పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు, వారు వ్రాసిన "నేను దర్శించిన మహాత్ములు - శ్రీ పాకలపాటి గురువుగారు" అను పుస్తకాన్ని, మాస్టర్ CVV గారి గురు పూజల సందర్భంలో, వారి పాద సాన్నిధ్యంనందు ఆవిష్కరణ చేయవలసిందిగా శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారికి పంపినప్పుడు, వారు ఆ పుస్తకాన్ని శ్రీ పాకలపాటి గురువు గారి చరణములకు అంకితం చేసి, పుస్తకావిష్కరణ చేసిన సందర్భంలో వారు చేసిన అనుగ్రహ భాషణము:



శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు పతంజలి యోగసూత్రములలో "తత్సన్నిధౌ వైరత్యాగః" అనే సూత్రానికి వివరణనిస్తూ శ్రీ పాకలపాటి గురువుగారినిగూర్చి ప్రస్తావించిన సందర్భము లోనిది - small clip:


"నేను దర్శించిన మహాత్ములు - శ్రీ పాకలపాటి గురువుగారు" -- By our Bharadwaja Master garu

Information regarding Kalyan (Hindi version) or Kalyana-Kalpataru (English version) Spiritual monthly Magazine run by Gita Press, Gorakhpur.
You can download one issue and go through it to see the kind of articles they publish. In Sri Pakalapati guruvu gari charitra, there is a mention of the articles from this magazine.
జూన్-2013 సాయిబాబా మాస పత్రికలో, వెంకటరామపురంలోగల శ్రీ పాకలపాటి గురువుగారి ఆశ్రమముననందు, భక్తుల అనుభవములను, "నాటికీ - నేటికీ అదే కరుణ, అదే కృప" అన్నపేరుతో ప్రచురింపబడిన వ్యాసము:

Sairam,
Subrahmanyam.

Sunday, 2 February 2014

Bharatiya Bala Siksha - Books for Teaching Kids

చిన్న పిల్లలకు చక్కటి విద్యను అందించి వారిని సరి అయిన మార్గంలో తీర్చిదిద్దుట కొఱకు, కులపతి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి (మాస్టర్ ఇ.కె. గారి) పర్యవేక్షణలో "భారతీయ బాలశిక్ష" అను పేర నాలుగు భాగములగా పుస్తక రచన చేయబడినది.  ఈ పుస్తకములు కులపతి బుక్ ట్రస్ట్ ద్వారా లభ్యమగుచున్నవి.

 
 
ఈ పుస్తకములు కావలిసినవారు క్రింది చిరునామాకు లేదా ఫోన్ నంబరుకు సంప్రదించగలరు:
The World Teacher Trust
45-40-36/1, Akkayya palem
Visakhapatnam, 530 016, A.P., India
phone: +91-8912-565291
అవకాసము ఉన్నవారు  ఈ పుస్తకాలను నేరుగా హైదరాబాదులోని కోఠిలో ఉన్న "స్పిరిట్యుయల్ బుక్ సెంటర్" వద్దనుండి కూడా పొందవచ్చును. ఈ బుక్‌షాప్ కోఠి బస్‌స్టాప్‌కి చాలా దగ్గరగా (ఉమెన్స్ కాలేజీ దగ్గరలో) ఉన్నది (Exact Address: Near Viswa hindu parishat, vijaya building, koti junction). ఈ బుక్ సెంటర్ ఫోన్ నంబర్: 040-66775661
. Before going there, you may call them to make sure of the availability of those books and the shop timings. Each of these volumes costs around Rs. 60/-.


చివరిగా ఆ పుస్తకముల మొదటిలో వ్రాయబడిన పరిచయ వాక్యములను ఇచ్చట పొందుపరచుచున్నాను:

పరిచయము:

మనది భారతీయ సంప్రదాయము. ఇది అనుష్ఠానమునకు సంబందించినది. దీనిని సక్రమముగా గ్రహించి పాటించుట వలన వ్యక్తిగతమైన పురోభివృద్ధితో పాటు సమాజమున సామరస్యము, దేశ సౌభాగ్యము వర్ధిల్లుచుండును. దీనిని మన ప్రాచీన భారతీయులు నిరూపించిరనుట చారిత్రిక సత్యము.

మన భారతీయ సాంప్రదాయము ననుసరించి తల్లిదండ్రులే బిడ్డలకు మొదటి గురువులు. వారికి విద్యార్థి దశలో ఉపాధ్యాయులు గురువులు. కనుక విద్యార్థులలో వికాసమును కలిగించుటతోపాటు సదాచారమును, మన సాంప్రదాయపు విలువలను శాస్త్రీయమైన పద్ధతిలో నేర్పవలసిన బాధ్యత వీరిపై నున్నది. ఈ ప్రయోజనమును ఉద్దేశించియే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ వరల్డ్ టీచర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు 'కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులచే' భారతీయ బాలశిక్షా ప్రణాళిక సంకల్పించబడినది. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, ప్రాచీన శాస్త్రములలో నిక్షిప్తము చేయబడిన అద్భుతమైన విజ్ఞానము, భారతీయ బాలశిక్ష ఒక్కొక్క పుస్తకములో ప్రార్ధన, ప్రశ్నలు - జవాబులు, చక్కని పాటలు, నీతి పద్యముల రూపమున 30 పాఠములుగా కూర్పు చేయబడినవి. ఇంతవరకు నాలుగు భాగములు వెలువడినవి. ఇవి రాష్ట్రమున గల అనేకమైన ప్రైవేట్ విద్యా సంస్థలలో స్వీకరింపబడినవి. అట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖలలో కూడా విశేషముగా ఆదరింపబడినవి. లక్షల ప్రతులు ప్రభుత్వ శాఖలకు విక్రయింపబడినవి. జగద్గురుపీఠం సంబంధితమైన బాలభాను విద్యాలయాలలో ఈ బాలశిక్ష ప్రత్యేకముగా నేర్పబడుచున్నది. అట్లే మన సాంప్రదాయము ప్రాతిపదికగా నిర్వహింపబడుచున్న అనేక విద్యాలయములలో కూడా ఈ భారతీయ బాలశిక్షలను పాఠ్యాంశములుగా నేర్పుట కూడా జరుగుచున్నది. వేసవి సెలవులలో ఈ బాలశిక్ష విద్యార్థినీ విద్యార్థులకు బోధించు సంప్రదాయము ఏర్పడినది.

ప్రాచీన భారతీయ వృక్షశాస్త్రము, భూగోళ, ఖగోళ శాస్త్రములు మరియు కొన్ని చారిత్రిక సత్యములు నవీన శాస్త్రమున ఇంకను కనుగొనబడలేదనుట వాస్తవము. వానిని సరళముగా అందించుటయే ఇందలి విశేషము.

మానవ ధర్మము మతాతీతమైనది. కనుక దానిని ఆచరించుట వలన అన్ని మతములను గౌరవించు మంచితనము అప్రయత్నముగా సిద్ధించును. అట్లే విశ్వప్రేమ మార్గమున నడచుట వలన అన్ని జాతుల వారిని ఆదరించుట అలవడును. ఇట్టి అద్భుతమైన విషయములను విద్యార్థినీ విద్యార్థులు అభ్యసించుట వలన వారు సత్పౌరులై జాతి శ్రేయస్సుకు తోడ్పడగలరని త్రికరణశుద్ధిగా మేము విశ్వసించి ఈ ప్రణాళికను సవినయముగా సమర్పించుచున్నాము. విశేషముగా ఈ ప్రణాళిక ఆదరింపబడుచున్నదనుటకు ఈ నవమ ముద్రణమే చక్కని తార్కాణము.

Sunday, 28 April 2013

సుఖపడుట ఎలా?

సుఖపడుట ఎలా? (గురుపూజల సందర్భముగా మాస్టర్ ఇ.కె. గారు అనుగ్రహించిన ఒక ఉపన్యాసమునుండి తీసుకొనబడిన చిన్న భాగం)

"ఓం శాంతిః శాంతిః శాంతిః"
"శాంతి" అన్న శబ్దానికి, "మనస్సు శాంతిగానుండు గాక, ఆత్మ శాంతిగానుండు గాక, చిత్తము శాంతిగానుండు గాక!" అని అర్ధం. ఎప్పుడు అలా ఉంటుంది అంటే, "చుట్టుప్రక్కల వాళ్ళంతా, ఇంట్లో వాళ్ళంతా, బంధువులంతా, భార్య పిల్లలు అందరూ, ఆఫీసులో అందరూ ఉండనిస్తే శాంతిగా ఉంటుంది" అని అనిపిస్తుంది, కరుడుగట్టిన అజ్ఞానికి! అది కాకుండా "శాంతిగా ఉండటం" అంటే "మనం శాంతిగా ఉండటం" గానీ "వాళ్ళు ఉండనివ్వడం" కాదు అనే రహస్యం తెలిసినటువంటివాడికి, "శాంతిగా ఉండటం" తప్ప "అశాంతిగా ఉండటం" ఎన్నడూ ఉండదు. ఈ స్థితినుండి ఆ స్థితికి మనం రావాలి.

మనం శాంతిగా ఉండటానికి ఎన్నో విఘ్నాలు కనిపిస్తాయి, అజ్ఞానికి! "విఘ్నాలు" అంటూ నువ్వు సృష్టించుకున్నవి మినహా బయట ఎక్కడా లేవు అనే సంగతి తెలుస్తుంది. "పరిస్థితులు బాగుంటే..." అన్నటువంటి వాడికి, ప్రపంచంలో, వాడుగానీ, ఇంకొకడుగానీ, వాడి పరిస్థితులను ఎన్నడూ బాగు చెయ్యలేరు. ఇంతవరకూ సృష్టిలో ఎవ్వడూ బాగుచెయ్యలేదు. పరిస్థితులు బాగుండడం కాకుండా, తాను బాగుంటే, పరిస్థితులు తనచేత వెలిగింపబడతాయనేటువంటి రహస్యం తెలిసేదాకా జీవితం చీకటి కోణమే; వెలుగుబాట ఎన్ని దీపాలు పెట్టినా ఉండదు.

"సుఖపడేది ఎలాగ?" అని కోరిన దరిద్రుడికి సుఖం ఉండదు. "సుఖంగా ఉండడం" అనేది తెలిసినవాడికి మిగిలినవన్నీ సుఖం ఇస్తాయి. "సుఖంగా ఉండడం" అనేది ఇంకొక కండిషనుకు లొంగినదైతే, అది సుఖం అనేటువంటి పేరుకు తగినటువంటిది కాదు. సెకండ్-రేట్ థింగ్ అవుతుంది. సుఖము అద్వితీయము, పరబ్రహ్మ స్వరూపము గనుక, దానిని పరిస్థితులు పెట్టి కొనుక్కోవడానికి ప్రయత్నించేటువంటి పిచ్చివాడికి లొంగేటువంటిది కాదు. బలహీనునికి లొంగేటువంటిది కాదు.

సుఖంగా ఉండటం అనేది - లోపల మనస్సులో, హృదయములో, ఆత్మలో, ఇంద్రియాలలో ప్రారంభమవుతుంది. అక్కడనుండి క్రమంగా శరీరానికి, పరిసరాలకి, ప్రాంతానికి; తన దినచర్య వలన తన భార్యా పిల్లలు "సుఖపడుట" నేర్చుకొనుట, వాళ్ళ వలన తాను సుఖపడుట నేర్చు
కొనుట, వాళ్ళ వాతావరణం వలన ఎవరైనా అతిథులు, వారి ఇంటికి వచినవాళ్ళు కూడా సుఖపడుట నేర్చుకొనుట, అట్లాంటి కుటుంబములు ఒక వెయ్యి కుటుంబములు, ఇలాంటి చోట గురువులయొక్క చరణారవిందముల వద్దకు చేరినట్లయితే, సుఖపడుటలో వెనుకబడి ఉన్న జాతులు ఎవరన్నా ఉన్నట్లయితే, ఒకరినుంచి ఒకరు సుఖపడుట నేర్చుకుని, అందరూ సుఖములో ఉండుట జరుగుతుంది. వెనుకబడిన జాతులు ముందుకు రావడం కాదు చెయ్యాల్సింది, ముందుకు వస్తే, కొందరు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది!  కానీ అందరూ సుఖములో ఉండుట అనే నిజమైన సెక్యులర్ స్టేట్ మనకు కావాలి. అలాంటి శాంతి మనకు కలుగు గాక.

Sunday, 2 September 2012

About Master EK garu

Here are the videos of Master EK gari Son: Sri Ekkirala Anantha Krishna garu, telling about Master EK garu.


In these videos, Sri Anantha Krishna garu beautifully explained about the life of Master EK garu, and about various things that Master garu taught through practice.

Hope you won't miss enjoying this nectar!

Saturday, 12 May 2012

Master CVV Aradhana


Today (12th May) is the Aradhana of Master CVV

(Prayer given by Master EK)
May the light in me be the light before me.
May I learn to see it in all.
May the sound I utter reveal the light in me.
May I listen to it while others speak.

May the silence in and around me present itself.
The silence which we break every moment
may it fill the darkness of noise we do
and convert it into the light of our background.

Let virtue be the strength of my intelligence.
Let realization be my attainment.
Let my purpose shape into the purpose of our Earth.
Let my plan be an epitome of the Divine Plan.

May we speak the silence without breaking it.
May we live in the awareness of the background.
May we transact Light in terms of joy.
May we be worthy to find place in the Eternal Kingdom OM.

Namaskarams Master EK
Namaskarams Master CVV

Wednesday, 7 March 2012

Child-like Nature

Master EK గారు, భక్తి ఉన్నవాడి లక్షణాలు గురించి చెబుతూ, మిగతా చాలా లక్షణాలతో పాటుగా వారు చెప్పిన ఒక లక్షణము: "భక్తి కలిగిన వాళ్ళు వయస్సుచేత పెద్దవాళ్ళు అయినప్పటికీ, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు పిల్లలు చేస్తున్న సరదాతో, ఉత్సాహంతో, సంతోషంతో ఉంటాయి. అలా అని, పిల్లలు చేస్తున్నటువంటి పాడు పనులు వాళ్ళు చెయ్యరు. చైల్డిష్ (childish) కాదు, చైల్డ్-లైక్ (child-like)గా ఉంటారు." పిల్లల మనస్తత్వానికి, చాలామంది పెద్దల మనస్తత్వానికిగల తేడాను, జి. కె. చెస్టర్‌సన్ అనే ఒక ఇంగ్లీషు హాస్య రచయిత వ్రాసిన ఒక కధలోనుండి 4 ఉదాహరణలు తీసుకుని, కృష్ణమాచార్యులుగారు వివరించారు.

ఆ ఆర్టికల్ పేరు: "On Running after One's Hat"; దానిని ఈ క్రింది లింకు వద్ద చదువవచ్చును:
http://www.catholic-forum.com/saints/gkc16004.htm

కృష్ణమాచార్యులగారి మాటలలోనే చెస్టర్‌సన్‌గారి ఆర్టికల్‌లోనుండి రెండు ఉదాహరణలనుమాత్రం ఇక్కడ చూద్దాము:

(1) మనం వేరే ఊరుకి వెడుతున్నామనుకోండి. రైలు ఎప్పుడు వస్తుందో ఫోన్ చేసి కనుక్కుని, ఇంకో ఐదు నిముషాలలో వచ్చేస్తుందని చెప్పాకనే మనం స్టేషనుకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత, రైలు 5 నిముషాలలో రావడం లేదు, 150 నిముషాలలో వస్తుంది అన్నాడనుకోండి! ఇండియాలో అలాంటివి జరగడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు కదా! అయినప్పుడు, మన కుటుంబంలో ఉన్న ఐదారుగురం స్టేషన్లో కూర్చున్నాము. మామూలుగా ఎలా కూర్చుంటాం? శవ జాగరణ చేస్తున్నట్లు కూర్చుంటాం. "రైలు ఆలస్యమైతే ప్రయాణికుల మొహాలు", "శవం దగ్గర రాత్రి తెల్లవార్లు కూర్చుంటున్న వాళ్ళ మొహాలు", ఫొటోలు తీస్తే, రెండూ ఒక్కలాగే ఉంటాయి . ఆ కుటుంబంలోనే, ఏడేళ్ళ కుర్రవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఈ 150 నిముషాలు ఏం చేస్తూ ఉన్నాడు? స్టేషన్లో అటు నడుస్తాడు, ఇటు నడుస్తాడు. ఇంకా, "సిగ్నలిస్తునారు...., అదిగో అదిగో అక్కడ ఎర్ర లైటు వెలిగింది...., ఇపుడు పచ్చ లైటు వెలిగింది..... రైలు వచ్చేస్తోంది కూఊఊఊక్ " అని అరుస్తూ, గెంతుతో ఉంటాడు . అంటే, పెద్దవాళ్ళేమో ఈ 150 నిముషాలు ఏడుస్తూ వెయిట్ (wait) చేస్తున్నారు; ఆ పిల్లవాడేమో నవ్వుతూ వెయిట్ చేస్తున్నాడు. అంతేకదా తేడా! వెయిట్ చెయ్యడం ఎలాగూ తప్పదు. అలాంటప్పుడు ఏడుస్తూ వెయిట్ చెయ్యడం ఎందుకని?  ఆ మొహాలు అలా చావగొట్టిన గాడిదలల్లే పెట్టి కూర్చోవడం ఎందుకని? ఈ పాయింట్ తట్టడానికి మనకి చాలా టైం పడుతుంది. ఫిజికల్‌గా వీడూ వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళూ వెయిట్ చేస్తున్నారుకానీ; కానీ పిల్లవాడు మెంటల్‌గా వెయిట్ చెయ్యడం లేదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంతే తేడా. ఇప్పుడు నేను చెప్పిన కధ "On Running after One's Hat" అన్న ఒక ఆర్టికల్‌లో, జి. కె. చెస్టర్‌సన్ అనే (బెర్నాడ్‌షాతో సాటి అయిన) ఒక మంచి హాస్య రచయిత వ్రాసాడు. వాళ్ళకి తడతాయి ఇలాంటివి, ఎలా తడతాయోగానీ! సీరియస్ మైండెడ్‌గా ఉండి, బైబిల్ చదువుకునేవాడు, వేదాలు చదువుకునేవాడు, ఉపనిషత్తులు చదువుకునేవాడు: వీళ్ళకి ఏమీ తట్టి చావవు, ఆ చదువుకుంటున్న పదాలు నాలుగు తప్ప! వాళ్ళకి తడతాయి ఎక్కడలేని డైమన్షన్సూను (దృష్టి కోణాలు).

(2) చెస్టర్‌సన్‌గారి స్నేహితుడు ఒక అతను, అతని కళ్ళజోడు, తాళంచెవులు మొదలైనవి ఒక డ్రాయరులో (సొరుగులో) పెట్టుకునేవాడు.  ఆఫీసుకు వెళ్ళేముందు ఆ వస్తువులు తీసుకోడానికి  ఆ డ్రాయరు లాగితే అది ఎంతకూ వచ్చేదికాదు, అది బాగా పాత డ్రాయరు.  ఆఫీస్ టైము అయిపోతోంది, ఇది రాదు, రోజూ కోపము, ఏడుపు వస్తుంది, బి.పి. పెరుగుతుంది. తర్వాత ఏదో గందరగోళమై, అటూ ఇటూ లాగటమై అది తియ్యడం అవుతుంది. రోజూ ఇంత పని అవుతోందని ఈ చెస్టర్‌సన్‌గారితో చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, "డ్రాయర్ రాదు, దాన్ని లాగుతున్నాము అనేటువంటి దుర్భుద్ధితో నువ్వు లాగుతున్నావుగనుక, నువ్వు దానిని వంకరగా లాగుతున్నావు, అందువల్ల అది రావడంలేదు. క్లబ్బులోకి వెళ్ళి ఆటలు ఆడుతునప్పుడు, ఒక తాడును అవతల వాళ్ళు ఒక ప్రక్క, నువ్వు ఇంకో ప్రక్క పట్టుకుని లాగుతున్నప్పుడు,  మీ ఇంట్లో డ్రాయర్  లాగుతున్నట్లు ఇలా ఏడుస్తోనే లాగుతావా?  అక్కడ నవ్వుతో సరదాగా ఉత్సాహంగా లాగుతావుకదా; అలాగే ఇక్కడ కూడా సరదాగా లాగు! అప్పుడు అదే వస్తుంది" అని చెప్పారు.

Thursday, 1 March 2012

Surya Satakam


మయూర శర్మ విరచితమైన "సూర్య శతకము" గురించి మొట్టమొదటిగా మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి ఒక ప్రవచనంలో విన్నాను. కాబట్టి, దీనిని గూర్చి ముందుగా వారి మాటలలోనే ఇక్కడ ప్రస్తావించుకుందాము:

"సూర్య శతకాన్ని మయూర శర్మ అనే ఒక మహాకవి వ్రాసారు. అందులోని శ్లోకాలు ఉక్కుపిండాల్లా ఉంటాయి. వాటి యొక్క అర్ధము, కవిత్వము అన్నీకూడా అట్లానే ఉంటాయి.  ఆయన ఈ శతకాన్ని ఒకానొక చిత్రమైన సందర్భంలో వ్రాసారని ప్రతీతి, జన-శృతి. ఆయన చిన్నతనంలో, 5-6 సంవత్సరాల వయస్సులో ఉండంగా చదువుకోవడంకోసమని కాశీ, నవద్వీపం మొదలైన చోట్లకి వెళ్ళిపోయాడు. 12 సం|| అట్లా చదువుకుని, ఆ తర్వాత, 18-20 సం|| వయస్సులో ఇంటికి తిరిగివచ్చాడు. వచ్చేటప్పడికి, నడి వయస్సులో ఉన్న ఒక అందమైన స్త్రీ బావి దగ్గర ఒక చిన్న వస్త్రం కట్టుకుని కూర్చుని బట్టల పిండుకుంటోంది. అప్పుడు అక్కడ నుంచుని ఆవిడమీద 8 శ్లోకాలు చెప్పాడు. అప్పుడు ఆమె, "నేను సంసార స్త్రీని. నేను ఇక్కడకు పనిమీద వచ్చిన దానిని. నన్ను చూసి శృంగార గర్భితంగా ఈ కవిత్వం చెప్పావు గనుక, నువ్వు కుష్ఠు రోగివి అవుతావు" అని వెళ్ళిపోయింది! తీరా ఈయన ఇంటికి వెళ్ళేటప్పడికి, ఆవిడ ఇతని అత్తగారు. జన-శృతిలో ఈ కధ ఉన్నది. తాను చేసిన పనికి అతను చాలా పరితాపం పొందాడు. 2-3 సం|| అయ్యేటప్పడికి అతను కుష్ఠు వ్యాధి పీడితుడయిపోయాడు. ఎన్నో శాస్త్రములు చదువుకుని ఉన్నాడు, కానీ ఏం లాభం? పాపం ఆ వ్యాధితో అలా ఎన్నో చోట్లకు తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా, కొంతకాలానికి, ఒక మహానుభావుడు కనిపించి, అతనిని ఒక దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి, సౌర అక్షరం ఒకటి ఇచ్చి, "నువ్వు నీ కవిత్వాన్ని ఏం చెయ్యడంవల్ల అయితే నీకు ఈ దుస్థితి వచ్చిందో, దేనిని దుర్వినియోగం చెయ్యడంవల్ల నీకు ఈ దుస్థితి వచ్చిందో, ఆ కవిత్వాన్నే సద్వినియోగంజేసి, సూర్యుడిమీద ఒక శతకం చెప్పు. అది ప్రపంచానికి పనికి వస్తుంది. దానివల్ల నీకున్నూ వ్యాధి నివారణ అవుతుంది" అని చెప్పారు. అతడు అప్పుడు ఆ సందర్భంలో చెప్పింది ఈ సుర్య శతకం అంటారు."
[అరసవిల్లిలోని (హర్షవిల్లి) సూర్య దేవాలయంలో విశ్వకర్మచే నిర్మితమైన సూర్యదేవుని విగ్రహం]


 ఇందులోని శ్లోకాలు వినడానికి చాలా మనోహరంగానూ, గంబీరమైన భావంతోనూ నిండి ఉంటాయి.

ఆ శ్లోకాలన్నింటినీ ఈ క్రింది లింకు వద్ద వినవచ్చును:
http://mio.to/yyrP

ఈ శతకం తెలుగు-లిపిలో ఈ క్రింది లింకువద్ద కలదు:
http://www.eemaata.com/em/library/suryasatakam/253.html

బ్రహ్మశ్రీ పోతూరి సీతారామాంజనేయులు గారు సూర్య శతకమునకు:  అన్వయ-ప్రతిపదార్ధ-భావార్ధ-వివరణ సహితముగా తెలుగులో చక్కటి గ్రంధాన్ని వ్రాసారు. ఆ పుస్తకము గుర్చి వ్రాయబడ్డ ఒక సమీక్షను ఈ క్రింది లింకు వద్ద చదువగలరు:
http://pustakam.net/?p=7075

మీరుకూడా పైన తెల్పిన పుస్తకాన్ని మరింతగా అస్వాదించాలనుకుంటే,, ఈ క్రింది లింకునుండి ఆన్-లైన్లో (క్రెడిట్ కార్డుతో) ఆర్డర్ చెయ్యవచ్చును:
http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=6535


పై పుస్తకములోనుండి, మచ్చుకకు ఒక్క శ్లోకానికి మాత్రం వివరణ ఇక్కడ చూద్దాము; మిగతా శ్లోకాలుకూడా అస్వాదించదలుచుకుంటే, మీరుకూడా పుస్తకం తెప్పించుకునేవరకూ నీరీక్షించవలసినదే!!!

గర్భేష్వంభోరుహాణాం-శిఖరిషు చ శితా-గ్రేషు తుల్యం పతంతః
ప్రారంభే వాసరస్య-వ్యుపరతిసమయే-చైకరూపాస్తథైవ
నిష్పర్యాయం ప్రవృత్తా-స్త్రిభువనభవన-ప్రాంగణే పాంతు యుష్మా
నూష్మాణం సంతతాధ్వ-శ్రమజమివ భృశం-బిభృతో బ్రధ్నపాదాః (3)

ప్రతిపదార్ధము:
అంభోరుహాణాం = పద్మముల
గర్భేషు = నడిమి భాగములందును
శిత-అగ్రేషు = వాడియైన (సన్నని) కొనలు కలవి అగు
శిఖరిషు-చ = పర్వతములయందును (మీదను)
తుల్యం = సమానముగా
పతంతః = పడుచున్నవియు
తథా-ఏవ = ఆవిధముగానే
వాసరస్య = పగటి
ప్రారంభే = ప్రారంభమునందును
వ్యుపరతి-సమయే-చ = ముగింపు (సాయంకాల) సమయమునందును
ఏక-రూపాః = ఒకే (సమాన) రూపము కలవియు
త్రిభువన-భవన-ప్రాంగణే = లోకత్రయము అనెడి భవనపు ముంగిట
నిష్పర్యాయం =  ఒకదాని తరువాత మరియొక ప్రదేసమునందుగా గాక; ఒకేమారుగా
పృవృత్తాః = ప్రవర్త్తిల్లు (ప్రసరించు)చుండునవియు
సంతత-అధ్వ-శ్రమ-జం = ఎడతెగని (క) మార్గ (మున నడుచుటచే కలిగిన) శ్రమకలిగిన దానినేమో అనునట్ట్లు; తోచుచుండు
ఉష్మాణం = వేడిమిని
బిభ్రతః = భ(ధ)రించుచున్నవియు అగు
బ్రధ్న-పాదాః = సూర్యుని కిరణములు
యుష్మాన్ = మిమ్ములను
పాంతు = రక్షించును గాక!

భావార్ధము:
బ్రధ్న పాదములు (బ్రధ్నుడు అను ఒక పురుషుని పాదములు - సూర్యుని కిరణములు) మిగుల విలక్షణమగు స్వభావము కలవి. లోకమున కొందరి పాదములు మెత్తని ప్రదేశములందు పడినట్లు ముండ్లతో రాళ్ళతో నిండిన ప్రదేశములందు పడవు; రవి పాదములు (కిరణములు) అట్లు గాక, సుకుమారమగు పద్మముల అంతర్భాగములందునూ, వాడియగు మొనలు కలిగిన కఠినములగు పర్వతాగ్రములందునూ సమానముగనే పడును (ప్రసరించును) [తనతో కౄరముగా ప్రవర్తించే వారి యెడల, మరియు సున్నితంగా ప్రవర్తించేవారి యెడల కూడా,  ఒకేవిధంగా ప్రవర్తించే సద్గుణము సూర్యునియందు ఉన్నది అనికూడా దీని అర్ధం అయ్యివుండవచ్చునేమోనని అనిపిస్తోంది!] లోకమున సాధారణముగా చాలామంది పాదములు జీవితారంభమున సుకుమారములుగనూ సుందరములుగను ఉండిననూ, వార్ధక్యమున తమ సౌకుమార్య సౌందర్యములను కోల్పోవును. రవి పాదములు పగటి ఆరంభమునను (ఉదయ కాలమునను), అవసాన సమయమునను (సాయంకాలమునను) ఒకే విధముగా ఉండును. [ఏదైనా ఒక పని చేస్తున్నపుడు, ఆ పనిని మొదలు పెట్టినప్పుడు ఎంతటి ఉత్సాహంతో ఉన్నాడో, చిట్ట చివరికి వచ్చేటప్పడికికూడా అదే ఉత్సాహంతో చెయ్యగలిగి ఉండడము అనే అర్ధంకూడా ఇక్కడ ఉండవచ్చునేమో!]  రవి పాదములు భువన త్రయము అను భవనపు ప్రాంగణమునందు (ముంగిలియందంతటనూ) ఒకేమారు పడును (ప్రసరించును). ఎవరికైననూ పాదములు మిరంతరమూ నడచుటవలన శ్రమచేత వెచ్చదనము నొందియుండును. రవి పాదములు అట్టి నిరంతర గమనముచే కలిగిన నిరంతర శ్రమచే అనునట్లు వెచ్చగా నుండును. అట్టి బ్రధ్న (రవి) పాదములు మిమ్ము రక్షించుగాక!

Friday, 13 January 2012

Master Gurdjieff-2


Here are some of the quotes of Master Gurdjieff (I came to know about this Master from the speeches of Master EK). May we contemplate & dip deep into the sayings of great Masters, and be bestowed with a better understanding...

(1) Conscious faith is freedom. Emotional faith is slavery. Mechanical faith is foolishness.

(2) Remember your "self" always and everywhere.

(3) By teaching others, you will learn yourself.

(4) Patience is the mother of will.

(5) The highest aim and sense of human life is the striving to attain the welfare of one's neighbor... and, that this is possible only exclusively by the conscious renunciation of one's own.

(6) Remember, you come here having already understood the necessity of struggling with yourself — only with yourself. Therefore, thank everyone who gives you the opportunity.

(7) The worse the conditions of life, the more productive the work, always, provided, you remember the work.

(8) One of the best means for arousing the wish to work on your "self" is to realize that you may die at any moment. But first you must learn how to keep it in mind.

(9) Here we (Masters?) can only direct and create conditions, but not help.

(10) People cannot perceive reality in their current states because they do not possess consciousness but rather live in a state of a hypnotic "waking sleep."

(11) Free will is the function of the Master within us. Our 'will' is supremacy of one desire over another.

Thursday, 12 January 2012

Master Gurdjieff


కులపతి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులుగారు, తైత్తరీయ ఉపనిషత్తుపై (ఆనందవల్లిపై) చేసిన తమ ప్రవచనంలో, ఒక సందర్భంలో, గుర్జీఫ్ (1877-1949) అనే మహనీయునిగూర్చి చెప్పి, వారు చెప్పిన ఒక సూక్తికి చక్కటి వివరణను సోదాహరణంగా ఇచ్చారు. మాస్టర్ గుర్జీఫ్ గురించి కృష్ణమాచార్యులుగారు తెల్పిన విషయాలు వారి మాటలలోనే ఇక చదివి ఆనందిద్దాము !

ఎదటివాడు మనకు ఎప్పుడు అపకారం చెయ్యగలడంటే... గుర్జీఫ్ (Gurdjieff) అనే ఒక మాస్టర్ (ఆయననే కజేషియన్ (Caucasian) మాస్టర్ అని కూడా అంటారు) చాలా అద్భుతంగా చెప్పాడు: "Your enemies can harm you ONLY WHEN you have the immorality to care for them" అన్నాడు. అంటే, "వాళ్ళను గురించి నువ్వు భయపడేంత అవినీతి, దానికి కావలిసినంత కక్కుర్తి, నీలో ఉన్నరోజునే, వాడు నిన్నేమైనా చెయ్యగలడు." ఆయన వాక్యాలలో చాలా పరమ సత్యాలు ఉన్నవి.  నికల్సన్ (Nicoll?)  మొదలైన మహానుభావులైన శిష్యులు, ఆయన ఒక్కొక్క వాక్యానికి,  15-25 పేజీల వ్యాఖ్యానాలను, "కామెంటరీస్" అన్న పేరుతో volumes (పుస్తకాలు) వ్రాసారు;  జాగ్రత్తగా చదువుకోవాలి.


గుర్జీఫ్ అనేటువంటివాడు చాలా పెద్ద గురువుగారు. ఆయన శిష్యులు ఇప్పుడు పారిస్లో ఒక గ్రూప్ ఉన్నారు. అక్కడకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరినీ కలుస్తూ ఉంటాను (కృష్ణమాచార్యులుగారు చెబుతున్నారు); వాళ్ళందరూ చాలా ఉత్తములైనటువంటివారు. ఆశ్చర్యకరమైన విషయాలు గుర్జీఫ్ ఇంకా చాలా చెప్పారు: "Everyone, while speaking of others, speaks of HIMSELF" అనే ఒక వాక్యం ఇచ్చారు గుర్జీఫ్. అంటే, "ప్రతివాడూ ఇతరుల గురించి మాట్లాడుతున్నవన్నీ, తనగురించే!" ఇదొక పరమ సత్యం.


ఇట్లాంటివన్నీ, మరీ దబ్బనం పెట్టి గుండెకాయ మీద పొడిచినట్టు ఉంటాయి; అసలు చదువుకోకుండా ఉంటే బాగుంటుందనిపిస్తుంది మనకు! ఆయన జీవించి ఉన్నప్పుడుకూడా శిష్యులను అలాగే చెండుకు తిన్నాడు! కెన్నెత్ వాకర్ (Kenneth Walker) అనే ఒక సైకాలజిస్ట్ ఆయన శిష్యుడు; వాణ్ణి, 10  సంవత్సరాల శిష్యరికం ఐన తర్వాత, "నా దగ్గర ఉండడానికి పనికిరావు, నువ్వు తుచ్చుడివి, వెళ్ళిపో" అని వెళ్ళగొట్టాడు.  కొన్ని సంవత్సరాలు ఐన తర్వాత సడన్‌గా ఒక రోజు అతనికి కబురు పంపించాడు. "ఎలా ఉన్నావు? బాగున్నావా? నీకు జరగవలిసినటువంటి కొంత ట్రైనింగ్లో  నా దగ్గర ఉండకూడదు. అందుచేత నిన్ను దూరంగా పంపించేసాను. ఆ ట్రైనింగు పూర్తి అయ్యింది. అందుచేత నిన్ను చూడాలనిపించి పిలుస్తున్నాను,"  అని కబురు పంపించాడు. వాడు నిజమే అనుకుని, వచ్చి దర్శించుకున్నాడు. ఆతర్వాత, అదేరోజు సాయత్రం ఆయన (గుర్జీఫ్) శరీరం విడిచిపెట్టేసాడు. అలాంటివాడు ఈ గుర్జీఫ్ అనేటువంటి ఆయన. పై రెండు వాక్యాలుకూడా ఆయన చెప్పినటువంటివే.

కనుక, పరిస్తితులవలన మనకు భయము ఎప్పుడు కలుగుతుంది అంటే, "పరిస్తితులతో నీకు ఉన్న కక్కుర్తిని బట్టి నాయనా!" అన్నాడు. మా నాన్నగారు (శ్రీ ఎక్కిరాల అనంతాచార్యులుగారు) గుంటూరులో ఇంటర్-మీడియెట్ చదువుకుంటున్న రోజులలో సంగతి ఇది: ఒక సాధువుగారు ఆ ఊర్లో ఒకరి ఇంటిలోకి వచ్చి చేరి, అలా జపం చేసుకుంటో ఉన్నారు. ఒక రోజు ఆయన, ఆ ఇంట్లో వాళ్ళని పూజకోసం ఒక చిన్నంఎత్తు బంగారం ఇవ్వమని అడిగారు. జపం అయ్యిపోయాక, ఆ ఇంట్లో వాళ్ళకి రెండు చిన్నాల బంగారం తిరిగి ఇచ్చాడు. అప్పుడు ఆ ఇంటి ఆయన భార్య తన భర్తతో, "ఏమండీ, మరి కొంచం బంగారం ఇద్దాం" అంది. అసలు విషయం ఇక్కడ ఉంటుంది; అంటే వాడు మన నెత్తిన మేకు కొట్టడానికి, మేకున్నూ మరియు సుత్తె కూడా మనమే ఇస్తాం. అవి అవతలవాడి దగ్గర ఏమీ ఉండవు. ఇలా ఒక ఇరవై రోజులు గడిచేటప్పడికి, ఆ సాధువుగారు వాళ్ళచేతే ఓ కుండ తెప్పించి, వాళ్ళనేమి అడిగాడంటే, "మీ ఇంట్లో ఉన్న నగలన్నీ పట్రండి, మీరే అవి ఆ కుండలో పెట్టి మూత పెట్టండి. ఏడు రోజులపాటు ఈ కుండకి రాత్రింబగళ్ళు మూత తియ్యకుండా పూజ చేయ్యాలి. అది పూర్తయ్యేవరకూ మధ్యలో మూత తియ్యకూడదు. అప్పుడు ఆ కుండలో ఉన్న బంగారానికి రెండు రెట్లు వస్తుంది. మరి ఆ దీక్ష మొదలు పెడదామా?" అని అడిగాడు. అప్పుడు ఆ ఇంటావిడ, "మా చెల్లెలిని కూడా పిలిపిస్తాను అన్నది." ఆ సాధువుగారు, "సరే ఐతే, అలాగే పిలిపించండి" అన్నాడు. ఆవిడని పిలిపించారు. "మా అక్కయ్యను కూడా పిలిపిస్తానండి" అన్నది. ఆవిడని కూడా పిలించారు. ఇట్లాగ, 18 కుటుంబాలు (మహాభారతం 18 పర్వాలు అన్నట్లుగా!) దీనికి ఒప్పుకున్నారు, నమ్మారు, వచ్చి వాళ్ళ బంగారాలన్నీ ఆ కుండలో పెట్టారు. మిగతా కుటుంబాలవాళ్ళని ఇంకా కొంతమందిని పిలిచారుగానీ, వాళ్ళు మాకు అఖ్ఖరలేదు అన్నారు.

దీక్ష మొదలైంది; రెండు రోజులు ఐన తర్వాత, మూడవ రోజు ఇంక ఆ గురువుగారు కనిపించలేదు. దీక్షలో బంగారం పెడుతో ఆయన ఏంచెప్పాడు అంటే, "ఏడు రోజుల లోపులో గనుక మూత తీసినట్లైతే, ఈ కుండలో ఉన్న బంగారం మొత్తమంతా రాజరాజేశ్వరీ అమ్మవారి వద్దకు వెళ్ళిపోతుంది" అని చెప్పాడు. అందుకని, భయంతో ఏడుస్తో, ఏడు రోజులూ, మూత తియ్యకుండా అలానే ఉంచారు. ఏడు రోజులు ఐన తర్వాత మూత తీసి చూసేటప్పడికి, ఇంకేముంది, ఘటాకాశం ఫఠాకాశం అని శంకరాచార్యులవారు చెప్పింది అక్కడ సాక్షాత్కరించింది!


"చూసారా, సాధువుగారు ఎలా చేసారో?" అన్నారు. సాధువుగారు చెయ్యలేదు. ఒకవేళ సాధువుగారే గనుక కర్త అయ్యివుంటే, అందరినీ చేసి ఉండేవాడు కదా! మనలో ఉన్న అసాధు-లక్షణమే కర్త. "మన కక్కుర్తి వల్లనే ఎదటివాడు మన నెత్తిన మేకు కొడతాడు" అని పైన గుర్జీఫ్ చెప్పింది అందుకని మనం తెలుసుకోవాలి. ఎప్పుడూకూడా అక్షరాలా అదొక్కటే సత్యం. ప్రపంచంలో ఎవ్వడూ ఎవ్వడికీ అన్యాయం చెయ్యగలిగినటువంటి స్థితిగానీ, అవకాసంగానీ లేకుండా ప్రకృతి మేకులు బిగించి ఉంచింది. మనకి మనమే మన కక్కుర్తి వలన మేకులు తయారుచేసి ఎదటివాడికి ఇస్తాము!

Tuesday, 2 August 2011

Master EK Janma Dinotsavamu

Namaskrams Master EK

Today is the Janma Dinotsavamu of Master Ekkirala Krishnamacharyulu garu. Master EK garu was born on August 11, 1926 (Sravana Sukla Tritiya as per "Chitra paksha aynamsa").

May He bless us all on this auspicious occasion.

On this auspicious occasion, may we 'dip deep' into the following invocation given by Master EK:

May the light in me be the light before me.
May I learn to see it in all.
May the sound I utter reveal the light in me.
May I listen to it while others speak.

May the silence in and around me present itself.
The silence which we break every moment.
May it fill the darkness of noise we do.
and convert it into the light of our background.

Let virtue be the strength of my intelligence.
Let realization be my attainment.
Let my purpose shape into the purpose of our Earth.
Let my plan be an epitome of the Divine Plan.

May we speak the silence without breaking it.
May we live in the awareness of the background.
May we transact Light in terms of joy.
May we be worthy to find place in the Eternal Kingdom OM.

 
Sairam,
Subrahmanyam.

Sunday, 24 January 2010

Live Telecast of SriSailam Yoga Classes: Master EK trust

I am glad to inform you that there is a daily live cast in the internet, of Yoga Classes taking place in Srisailam.
Here is the link to live telecast:
http://masterek.org/Livestream.aspx

These classes are conducted as a part of Service Activities of Master EK (Ekkirala Krishnamacharya garu) Trust.
These classes are taught by Sriman Ekkirala Ananta Krishna garu & Sriman M Punanaiah Sastry garu.
The classes are from 17th January to 5th February, from morning 6 AM to evening 7 pm.
Sorry to inform you so late, I also came to know about this only recently.

Here is the daily Schedule


Program Name
Speaker/Artist
Time
Prayer
Sriman E Ananta Krishna
6:00AM to 7:00AM
Vedadhyanam
Sriman E Ananta Krishna
9:00AM to 10:00AM
Spiritual Astrology
Sriman M Punnaih Sastry
10:15AM to 11:30AM
Homoeo Philosophy
Sriman E Ananta Krishna
11:30AM to 1:00PM
Homoeopathic Materia medica
Sriman E Ananta Krishna
3:00PM to 4:15PM
yoga sutras of Patanjali
Sriman M Punniah sastry
4:30PM to 5:30PM
Prayer followed by chanting
Sriman E Ananta Krishna
6:00PM to 7:00PM



 

Monday, 19 October 2009

Prayer given by Master EK

On completion of 50 years of life, Master Ekkirala Krishnamacharya's (known as Master EK) followers organized a Golden Jubilee celebrations. A unique souvenir was brought out on the life and works of Master E.K. On that occasion his followers ardently asked the Master to give out an invocation for their use. The Master closed himself in his chamber at Radhamadavam for 10 minutes and brought out with his own hand an invocation for the benefit of the aspirants. The invocation is as under:
May the Light in me Be the Light before me.
May I learn to see it in all.
May the sound I utter reveal the Light in me.
May I listen to it while other speak.
May the Silence in and around me Present itself.
The Silence which we break every moment.
May it fill the darkness of noise we do.
and convert it into the Light of our Background.
Let virtue be the strength of my intelligence.
Let realization be my attainment.
Let my purpose shape into the purpose of our Earth.
Let my plan be an epitome of The Divine Plan.
May we speak the Silence without breaking in it.
May we live in the awareness of the Background.
May we transact Light in terms of Joy.
May we be worthy to find place in the Eternal Kingdom OM.