Showing posts with label Ramadasu. Show all posts
Showing posts with label Ramadasu. Show all posts

Sunday, 8 November 2009

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి

రామదాసు సంకీర్తన



నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి |నను బ్రోవమని...|


నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మా |నను బ్రోవమని...|


ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి చొక్కియుండెడు వేళ |నను బ్రోవమని...|


అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్ర మేల్కొను వేళ నెలతరొ బోధించి |నను బ్రోవమని...|

Acknowledgments:
Thanks for the lyrics at:
http://www.engr.mun.ca/%7Eadluri/telugu/classical/musical/rit/ramadasu.html

పలుకే బంగారమాయెనా కోదండపాణి

రామదాసు సంకీర్తన




పలుకే బంగారమాయెనా కోదండపాణి, |పలుకే…|

పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలోఁ నీ నామస్మరణ మరవ చక్కనిసామి |పలుకే...|

ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు 
పంతము సేయ నే నెంతటి వాడను తండ్రి |పలుకే...

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాద
కరుణించు భద్రాచల వర రామదాస పోష |పలుకే...| 

Acknowledgments:
Thanks for the lyrics at:
http://www.engr.mun.ca/%7Eadluri/telugu/classical/musical/rit/ramadasu.html

Saturday, 7 November 2009

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

రామదాసు సంకీర్తన


తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు |త..|  

ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె యుండగ |త..|

మ్రుచ్చు సోమకుని మును జంపిన ఆ మత్స్య మూర్తి మన పక్షము నుండగ |త..|

భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మన వాడై యుండగ |త..|

దశ గ్రీవు మును దండించిన ఆ దశరథ రాముని దయ మన కుండగ |త..|

దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో యుండగ |త..|

రామదాసుని గాచెడి శ్రీమన్నారాయణు నెఱ నమ్మి యుండగ |త..|


Acknowledgments:
Thanks for the lyrics at:
http://www.engr.mun.ca/%7Eadluri/telugu/classical/musical/rit/ramadasu.html



Wednesday, 4 November 2009

ఏ తీరుగ నను దయ చుసెదవో

రామదాసు కీర్తన: ఏ తీరుగ నను దయ చుసెదవో  - Ramadasu Sankeertanas




ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా |ఏ తీరుగ...|

శ్రీ రఘు నందన సీతా రమణా శ్రితజన పోషక రామా కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా |ఏ తీరుగ...|
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారము సేయవె దైవ శిఖామణి రామా |ఏ తీరుగ...|
వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా దాసార్చిత మాకభయమొసంగవె దాశరథీ రఘు రామా |ఏ తీరుగ...|


Acknowledgments:
Thanks for the lyrics at:
http://www.engr.mun.ca/%7Eadluri/telugu/classical/musical/rit/ramadasu.html