Showing posts with label Teachings / stories. Show all posts
Showing posts with label Teachings / stories. Show all posts

Friday, 13 June 2014

శ్రీ పాకలపాటి గురువుగారి జన్మదినోత్సవము

గురుబంధువులందరికీ శ్రీ పాకలపాటి గురువుగారి జన్మదినోత్సవ హార్దిక శుభాకాంక్షలు (13 June 2014)

About Pakalapati Guruvu garu - In the words of Bharadwaja Master garu:

పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు, వారు వ్రాసిన "నేను దర్శించిన మహాత్ములు - శ్రీ పాకలపాటి గురువుగారు" అను పుస్తకాన్ని, మాస్టర్ CVV గారి గురు పూజల సందర్భంలో, వారి పాద సాన్నిధ్యంనందు ఆవిష్కరణ చేయవలసిందిగా శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారికి పంపినప్పుడు, వారు ఆ పుస్తకాన్ని శ్రీ పాకలపాటి గురువు గారి చరణములకు అంకితం చేసి, పుస్తకావిష్కరణ చేసిన సందర్భంలో వారు చేసిన అనుగ్రహ భాషణము:



శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు పతంజలి యోగసూత్రములలో "తత్సన్నిధౌ వైరత్యాగః" అనే సూత్రానికి వివరణనిస్తూ శ్రీ పాకలపాటి గురువుగారినిగూర్చి ప్రస్తావించిన సందర్భము లోనిది - small clip:


"నేను దర్శించిన మహాత్ములు - శ్రీ పాకలపాటి గురువుగారు" -- By our Bharadwaja Master garu

Information regarding Kalyan (Hindi version) or Kalyana-Kalpataru (English version) Spiritual monthly Magazine run by Gita Press, Gorakhpur.
You can download one issue and go through it to see the kind of articles they publish. In Sri Pakalapati guruvu gari charitra, there is a mention of the articles from this magazine.
జూన్-2013 సాయిబాబా మాస పత్రికలో, వెంకటరామపురంలోగల శ్రీ పాకలపాటి గురువుగారి ఆశ్రమముననందు, భక్తుల అనుభవములను, "నాటికీ - నేటికీ అదే కరుణ, అదే కృప" అన్నపేరుతో ప్రచురింపబడిన వ్యాసము:

Sairam,
Subrahmanyam.

Sunday, 2 February 2014

Bharatiya Bala Siksha - Books for Teaching Kids

చిన్న పిల్లలకు చక్కటి విద్యను అందించి వారిని సరి అయిన మార్గంలో తీర్చిదిద్దుట కొఱకు, కులపతి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి (మాస్టర్ ఇ.కె. గారి) పర్యవేక్షణలో "భారతీయ బాలశిక్ష" అను పేర నాలుగు భాగములగా పుస్తక రచన చేయబడినది.  ఈ పుస్తకములు కులపతి బుక్ ట్రస్ట్ ద్వారా లభ్యమగుచున్నవి.

 
 
ఈ పుస్తకములు కావలిసినవారు క్రింది చిరునామాకు లేదా ఫోన్ నంబరుకు సంప్రదించగలరు:
The World Teacher Trust
45-40-36/1, Akkayya palem
Visakhapatnam, 530 016, A.P., India
phone: +91-8912-565291
అవకాసము ఉన్నవారు  ఈ పుస్తకాలను నేరుగా హైదరాబాదులోని కోఠిలో ఉన్న "స్పిరిట్యుయల్ బుక్ సెంటర్" వద్దనుండి కూడా పొందవచ్చును. ఈ బుక్‌షాప్ కోఠి బస్‌స్టాప్‌కి చాలా దగ్గరగా (ఉమెన్స్ కాలేజీ దగ్గరలో) ఉన్నది (Exact Address: Near Viswa hindu parishat, vijaya building, koti junction). ఈ బుక్ సెంటర్ ఫోన్ నంబర్: 040-66775661
. Before going there, you may call them to make sure of the availability of those books and the shop timings. Each of these volumes costs around Rs. 60/-.


చివరిగా ఆ పుస్తకముల మొదటిలో వ్రాయబడిన పరిచయ వాక్యములను ఇచ్చట పొందుపరచుచున్నాను:

పరిచయము:

మనది భారతీయ సంప్రదాయము. ఇది అనుష్ఠానమునకు సంబందించినది. దీనిని సక్రమముగా గ్రహించి పాటించుట వలన వ్యక్తిగతమైన పురోభివృద్ధితో పాటు సమాజమున సామరస్యము, దేశ సౌభాగ్యము వర్ధిల్లుచుండును. దీనిని మన ప్రాచీన భారతీయులు నిరూపించిరనుట చారిత్రిక సత్యము.

మన భారతీయ సాంప్రదాయము ననుసరించి తల్లిదండ్రులే బిడ్డలకు మొదటి గురువులు. వారికి విద్యార్థి దశలో ఉపాధ్యాయులు గురువులు. కనుక విద్యార్థులలో వికాసమును కలిగించుటతోపాటు సదాచారమును, మన సాంప్రదాయపు విలువలను శాస్త్రీయమైన పద్ధతిలో నేర్పవలసిన బాధ్యత వీరిపై నున్నది. ఈ ప్రయోజనమును ఉద్దేశించియే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ వరల్డ్ టీచర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు 'కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులచే' భారతీయ బాలశిక్షా ప్రణాళిక సంకల్పించబడినది. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, ప్రాచీన శాస్త్రములలో నిక్షిప్తము చేయబడిన అద్భుతమైన విజ్ఞానము, భారతీయ బాలశిక్ష ఒక్కొక్క పుస్తకములో ప్రార్ధన, ప్రశ్నలు - జవాబులు, చక్కని పాటలు, నీతి పద్యముల రూపమున 30 పాఠములుగా కూర్పు చేయబడినవి. ఇంతవరకు నాలుగు భాగములు వెలువడినవి. ఇవి రాష్ట్రమున గల అనేకమైన ప్రైవేట్ విద్యా సంస్థలలో స్వీకరింపబడినవి. అట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖలలో కూడా విశేషముగా ఆదరింపబడినవి. లక్షల ప్రతులు ప్రభుత్వ శాఖలకు విక్రయింపబడినవి. జగద్గురుపీఠం సంబంధితమైన బాలభాను విద్యాలయాలలో ఈ బాలశిక్ష ప్రత్యేకముగా నేర్పబడుచున్నది. అట్లే మన సాంప్రదాయము ప్రాతిపదికగా నిర్వహింపబడుచున్న అనేక విద్యాలయములలో కూడా ఈ భారతీయ బాలశిక్షలను పాఠ్యాంశములుగా నేర్పుట కూడా జరుగుచున్నది. వేసవి సెలవులలో ఈ బాలశిక్ష విద్యార్థినీ విద్యార్థులకు బోధించు సంప్రదాయము ఏర్పడినది.

ప్రాచీన భారతీయ వృక్షశాస్త్రము, భూగోళ, ఖగోళ శాస్త్రములు మరియు కొన్ని చారిత్రిక సత్యములు నవీన శాస్త్రమున ఇంకను కనుగొనబడలేదనుట వాస్తవము. వానిని సరళముగా అందించుటయే ఇందలి విశేషము.

మానవ ధర్మము మతాతీతమైనది. కనుక దానిని ఆచరించుట వలన అన్ని మతములను గౌరవించు మంచితనము అప్రయత్నముగా సిద్ధించును. అట్లే విశ్వప్రేమ మార్గమున నడచుట వలన అన్ని జాతుల వారిని ఆదరించుట అలవడును. ఇట్టి అద్భుతమైన విషయములను విద్యార్థినీ విద్యార్థులు అభ్యసించుట వలన వారు సత్పౌరులై జాతి శ్రేయస్సుకు తోడ్పడగలరని త్రికరణశుద్ధిగా మేము విశ్వసించి ఈ ప్రణాళికను సవినయముగా సమర్పించుచున్నాము. విశేషముగా ఈ ప్రణాళిక ఆదరింపబడుచున్నదనుటకు ఈ నవమ ముద్రణమే చక్కని తార్కాణము.

Sunday, 28 April 2013

సుఖపడుట ఎలా?

సుఖపడుట ఎలా? (గురుపూజల సందర్భముగా మాస్టర్ ఇ.కె. గారు అనుగ్రహించిన ఒక ఉపన్యాసమునుండి తీసుకొనబడిన చిన్న భాగం)

"ఓం శాంతిః శాంతిః శాంతిః"
"శాంతి" అన్న శబ్దానికి, "మనస్సు శాంతిగానుండు గాక, ఆత్మ శాంతిగానుండు గాక, చిత్తము శాంతిగానుండు గాక!" అని అర్ధం. ఎప్పుడు అలా ఉంటుంది అంటే, "చుట్టుప్రక్కల వాళ్ళంతా, ఇంట్లో వాళ్ళంతా, బంధువులంతా, భార్య పిల్లలు అందరూ, ఆఫీసులో అందరూ ఉండనిస్తే శాంతిగా ఉంటుంది" అని అనిపిస్తుంది, కరుడుగట్టిన అజ్ఞానికి! అది కాకుండా "శాంతిగా ఉండటం" అంటే "మనం శాంతిగా ఉండటం" గానీ "వాళ్ళు ఉండనివ్వడం" కాదు అనే రహస్యం తెలిసినటువంటివాడికి, "శాంతిగా ఉండటం" తప్ప "అశాంతిగా ఉండటం" ఎన్నడూ ఉండదు. ఈ స్థితినుండి ఆ స్థితికి మనం రావాలి.

మనం శాంతిగా ఉండటానికి ఎన్నో విఘ్నాలు కనిపిస్తాయి, అజ్ఞానికి! "విఘ్నాలు" అంటూ నువ్వు సృష్టించుకున్నవి మినహా బయట ఎక్కడా లేవు అనే సంగతి తెలుస్తుంది. "పరిస్థితులు బాగుంటే..." అన్నటువంటి వాడికి, ప్రపంచంలో, వాడుగానీ, ఇంకొకడుగానీ, వాడి పరిస్థితులను ఎన్నడూ బాగు చెయ్యలేరు. ఇంతవరకూ సృష్టిలో ఎవ్వడూ బాగుచెయ్యలేదు. పరిస్థితులు బాగుండడం కాకుండా, తాను బాగుంటే, పరిస్థితులు తనచేత వెలిగింపబడతాయనేటువంటి రహస్యం తెలిసేదాకా జీవితం చీకటి కోణమే; వెలుగుబాట ఎన్ని దీపాలు పెట్టినా ఉండదు.

"సుఖపడేది ఎలాగ?" అని కోరిన దరిద్రుడికి సుఖం ఉండదు. "సుఖంగా ఉండడం" అనేది తెలిసినవాడికి మిగిలినవన్నీ సుఖం ఇస్తాయి. "సుఖంగా ఉండడం" అనేది ఇంకొక కండిషనుకు లొంగినదైతే, అది సుఖం అనేటువంటి పేరుకు తగినటువంటిది కాదు. సెకండ్-రేట్ థింగ్ అవుతుంది. సుఖము అద్వితీయము, పరబ్రహ్మ స్వరూపము గనుక, దానిని పరిస్థితులు పెట్టి కొనుక్కోవడానికి ప్రయత్నించేటువంటి పిచ్చివాడికి లొంగేటువంటిది కాదు. బలహీనునికి లొంగేటువంటిది కాదు.

సుఖంగా ఉండటం అనేది - లోపల మనస్సులో, హృదయములో, ఆత్మలో, ఇంద్రియాలలో ప్రారంభమవుతుంది. అక్కడనుండి క్రమంగా శరీరానికి, పరిసరాలకి, ప్రాంతానికి; తన దినచర్య వలన తన భార్యా పిల్లలు "సుఖపడుట" నేర్చుకొనుట, వాళ్ళ వలన తాను సుఖపడుట నేర్చు
కొనుట, వాళ్ళ వాతావరణం వలన ఎవరైనా అతిథులు, వారి ఇంటికి వచినవాళ్ళు కూడా సుఖపడుట నేర్చుకొనుట, అట్లాంటి కుటుంబములు ఒక వెయ్యి కుటుంబములు, ఇలాంటి చోట గురువులయొక్క చరణారవిందముల వద్దకు చేరినట్లయితే, సుఖపడుటలో వెనుకబడి ఉన్న జాతులు ఎవరన్నా ఉన్నట్లయితే, ఒకరినుంచి ఒకరు సుఖపడుట నేర్చుకుని, అందరూ సుఖములో ఉండుట జరుగుతుంది. వెనుకబడిన జాతులు ముందుకు రావడం కాదు చెయ్యాల్సింది, ముందుకు వస్తే, కొందరు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది!  కానీ అందరూ సుఖములో ఉండుట అనే నిజమైన సెక్యులర్ స్టేట్ మనకు కావాలి. అలాంటి శాంతి మనకు కలుగు గాక.

Friday, 21 December 2012

Even This Will Pass Away!

A simple poem/story encapsulating profound message worth contemplating... 

Even This Will Pass Away

Once in Persia reigned a king,
Who upon his signet ring,
Graved a maxim true and wise,
Which, when held before his eyes,
Gave him counsel at a glance,
Fit for every change and chance,
Solemn words, and these were they:
"EVEN THIS WILL PASS AWAY."

Trains of camel through the sand
Brought him gems from Samarcand;
Fleets of galleys through the seas
Brought him pearls to match with these,
But he counted little gain,
Treasures of the mine or main;
"What is wealth?" the king would say,
"EVEN THIS WILL PASS AWAY."

In the revels of his court,
At the zenith of the sport,
When the palms of all his guests
Burned with clapping at his jests,
He, amid his figs and wine,
Cried, "O loving friends of mine.
Pleasures come but not to stay,
EVEN THIS WILL PASS AWAY."

Lady, fairest ever seen
Was the bride he crowned as queen,
Pillowed on the marriage-bed
Whispering to his soul, he said,
"Though no bridegroom ever pressed
Fairer bosom to his breast,
Mortal flesh must come to clay!
EVEN THIS WILL PASS AWAY."

Fighting on a furious field,
Once a javelin pierced his shield,
Soldiers with a loud lament
Bore him bleeding to his tent,
Groaning from his tortured side,
"Pain is hard to bear;" he cried,
"But with patience, day by day,
EVEN THIS WILL PASS AWAY.”

Towering in a public square
Twenty cubits in this air,
Rose his statue carved in stone.
Then the king disguised, unknown,
Stood before his sculptured name.
Musing meekly, "what is fame?"
"Fame is but a slow decay!
EVEN THIS WILL PASS AWAY."

Struck with palsy, sore and old,
Waiting at the gates of gold,
Spake he with his dying breath
"Life is done, but what is Death?"
Then in answer to the king
Fell a sunbeam on his ring;
Showing by a heavenly ray.
"EVEN THIS WILL PASS AWAY."

—Theodore Tilton
(1867).

Sunday, 2 September 2012

About Master EK garu

Here are the videos of Master EK gari Son: Sri Ekkirala Anantha Krishna garu, telling about Master EK garu.


In these videos, Sri Anantha Krishna garu beautifully explained about the life of Master EK garu, and about various things that Master garu taught through practice.

Hope you won't miss enjoying this nectar!

Thursday, 1 March 2012

Surya Satakam


మయూర శర్మ విరచితమైన "సూర్య శతకము" గురించి మొట్టమొదటిగా మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి ఒక ప్రవచనంలో విన్నాను. కాబట్టి, దీనిని గూర్చి ముందుగా వారి మాటలలోనే ఇక్కడ ప్రస్తావించుకుందాము:

"సూర్య శతకాన్ని మయూర శర్మ అనే ఒక మహాకవి వ్రాసారు. అందులోని శ్లోకాలు ఉక్కుపిండాల్లా ఉంటాయి. వాటి యొక్క అర్ధము, కవిత్వము అన్నీకూడా అట్లానే ఉంటాయి.  ఆయన ఈ శతకాన్ని ఒకానొక చిత్రమైన సందర్భంలో వ్రాసారని ప్రతీతి, జన-శృతి. ఆయన చిన్నతనంలో, 5-6 సంవత్సరాల వయస్సులో ఉండంగా చదువుకోవడంకోసమని కాశీ, నవద్వీపం మొదలైన చోట్లకి వెళ్ళిపోయాడు. 12 సం|| అట్లా చదువుకుని, ఆ తర్వాత, 18-20 సం|| వయస్సులో ఇంటికి తిరిగివచ్చాడు. వచ్చేటప్పడికి, నడి వయస్సులో ఉన్న ఒక అందమైన స్త్రీ బావి దగ్గర ఒక చిన్న వస్త్రం కట్టుకుని కూర్చుని బట్టల పిండుకుంటోంది. అప్పుడు అక్కడ నుంచుని ఆవిడమీద 8 శ్లోకాలు చెప్పాడు. అప్పుడు ఆమె, "నేను సంసార స్త్రీని. నేను ఇక్కడకు పనిమీద వచ్చిన దానిని. నన్ను చూసి శృంగార గర్భితంగా ఈ కవిత్వం చెప్పావు గనుక, నువ్వు కుష్ఠు రోగివి అవుతావు" అని వెళ్ళిపోయింది! తీరా ఈయన ఇంటికి వెళ్ళేటప్పడికి, ఆవిడ ఇతని అత్తగారు. జన-శృతిలో ఈ కధ ఉన్నది. తాను చేసిన పనికి అతను చాలా పరితాపం పొందాడు. 2-3 సం|| అయ్యేటప్పడికి అతను కుష్ఠు వ్యాధి పీడితుడయిపోయాడు. ఎన్నో శాస్త్రములు చదువుకుని ఉన్నాడు, కానీ ఏం లాభం? పాపం ఆ వ్యాధితో అలా ఎన్నో చోట్లకు తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా, కొంతకాలానికి, ఒక మహానుభావుడు కనిపించి, అతనిని ఒక దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి, సౌర అక్షరం ఒకటి ఇచ్చి, "నువ్వు నీ కవిత్వాన్ని ఏం చెయ్యడంవల్ల అయితే నీకు ఈ దుస్థితి వచ్చిందో, దేనిని దుర్వినియోగం చెయ్యడంవల్ల నీకు ఈ దుస్థితి వచ్చిందో, ఆ కవిత్వాన్నే సద్వినియోగంజేసి, సూర్యుడిమీద ఒక శతకం చెప్పు. అది ప్రపంచానికి పనికి వస్తుంది. దానివల్ల నీకున్నూ వ్యాధి నివారణ అవుతుంది" అని చెప్పారు. అతడు అప్పుడు ఆ సందర్భంలో చెప్పింది ఈ సుర్య శతకం అంటారు."
[అరసవిల్లిలోని (హర్షవిల్లి) సూర్య దేవాలయంలో విశ్వకర్మచే నిర్మితమైన సూర్యదేవుని విగ్రహం]


 ఇందులోని శ్లోకాలు వినడానికి చాలా మనోహరంగానూ, గంబీరమైన భావంతోనూ నిండి ఉంటాయి.

ఆ శ్లోకాలన్నింటినీ ఈ క్రింది లింకు వద్ద వినవచ్చును:
http://mio.to/yyrP

ఈ శతకం తెలుగు-లిపిలో ఈ క్రింది లింకువద్ద కలదు:
http://www.eemaata.com/em/library/suryasatakam/253.html

బ్రహ్మశ్రీ పోతూరి సీతారామాంజనేయులు గారు సూర్య శతకమునకు:  అన్వయ-ప్రతిపదార్ధ-భావార్ధ-వివరణ సహితముగా తెలుగులో చక్కటి గ్రంధాన్ని వ్రాసారు. ఆ పుస్తకము గుర్చి వ్రాయబడ్డ ఒక సమీక్షను ఈ క్రింది లింకు వద్ద చదువగలరు:
http://pustakam.net/?p=7075

మీరుకూడా పైన తెల్పిన పుస్తకాన్ని మరింతగా అస్వాదించాలనుకుంటే,, ఈ క్రింది లింకునుండి ఆన్-లైన్లో (క్రెడిట్ కార్డుతో) ఆర్డర్ చెయ్యవచ్చును:
http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=6535


పై పుస్తకములోనుండి, మచ్చుకకు ఒక్క శ్లోకానికి మాత్రం వివరణ ఇక్కడ చూద్దాము; మిగతా శ్లోకాలుకూడా అస్వాదించదలుచుకుంటే, మీరుకూడా పుస్తకం తెప్పించుకునేవరకూ నీరీక్షించవలసినదే!!!

గర్భేష్వంభోరుహాణాం-శిఖరిషు చ శితా-గ్రేషు తుల్యం పతంతః
ప్రారంభే వాసరస్య-వ్యుపరతిసమయే-చైకరూపాస్తథైవ
నిష్పర్యాయం ప్రవృత్తా-స్త్రిభువనభవన-ప్రాంగణే పాంతు యుష్మా
నూష్మాణం సంతతాధ్వ-శ్రమజమివ భృశం-బిభృతో బ్రధ్నపాదాః (3)

ప్రతిపదార్ధము:
అంభోరుహాణాం = పద్మముల
గర్భేషు = నడిమి భాగములందును
శిత-అగ్రేషు = వాడియైన (సన్నని) కొనలు కలవి అగు
శిఖరిషు-చ = పర్వతములయందును (మీదను)
తుల్యం = సమానముగా
పతంతః = పడుచున్నవియు
తథా-ఏవ = ఆవిధముగానే
వాసరస్య = పగటి
ప్రారంభే = ప్రారంభమునందును
వ్యుపరతి-సమయే-చ = ముగింపు (సాయంకాల) సమయమునందును
ఏక-రూపాః = ఒకే (సమాన) రూపము కలవియు
త్రిభువన-భవన-ప్రాంగణే = లోకత్రయము అనెడి భవనపు ముంగిట
నిష్పర్యాయం =  ఒకదాని తరువాత మరియొక ప్రదేసమునందుగా గాక; ఒకేమారుగా
పృవృత్తాః = ప్రవర్త్తిల్లు (ప్రసరించు)చుండునవియు
సంతత-అధ్వ-శ్రమ-జం = ఎడతెగని (క) మార్గ (మున నడుచుటచే కలిగిన) శ్రమకలిగిన దానినేమో అనునట్ట్లు; తోచుచుండు
ఉష్మాణం = వేడిమిని
బిభ్రతః = భ(ధ)రించుచున్నవియు అగు
బ్రధ్న-పాదాః = సూర్యుని కిరణములు
యుష్మాన్ = మిమ్ములను
పాంతు = రక్షించును గాక!

భావార్ధము:
బ్రధ్న పాదములు (బ్రధ్నుడు అను ఒక పురుషుని పాదములు - సూర్యుని కిరణములు) మిగుల విలక్షణమగు స్వభావము కలవి. లోకమున కొందరి పాదములు మెత్తని ప్రదేశములందు పడినట్లు ముండ్లతో రాళ్ళతో నిండిన ప్రదేశములందు పడవు; రవి పాదములు (కిరణములు) అట్లు గాక, సుకుమారమగు పద్మముల అంతర్భాగములందునూ, వాడియగు మొనలు కలిగిన కఠినములగు పర్వతాగ్రములందునూ సమానముగనే పడును (ప్రసరించును) [తనతో కౄరముగా ప్రవర్తించే వారి యెడల, మరియు సున్నితంగా ప్రవర్తించేవారి యెడల కూడా,  ఒకేవిధంగా ప్రవర్తించే సద్గుణము సూర్యునియందు ఉన్నది అనికూడా దీని అర్ధం అయ్యివుండవచ్చునేమోనని అనిపిస్తోంది!] లోకమున సాధారణముగా చాలామంది పాదములు జీవితారంభమున సుకుమారములుగనూ సుందరములుగను ఉండిననూ, వార్ధక్యమున తమ సౌకుమార్య సౌందర్యములను కోల్పోవును. రవి పాదములు పగటి ఆరంభమునను (ఉదయ కాలమునను), అవసాన సమయమునను (సాయంకాలమునను) ఒకే విధముగా ఉండును. [ఏదైనా ఒక పని చేస్తున్నపుడు, ఆ పనిని మొదలు పెట్టినప్పుడు ఎంతటి ఉత్సాహంతో ఉన్నాడో, చిట్ట చివరికి వచ్చేటప్పడికికూడా అదే ఉత్సాహంతో చెయ్యగలిగి ఉండడము అనే అర్ధంకూడా ఇక్కడ ఉండవచ్చునేమో!]  రవి పాదములు భువన త్రయము అను భవనపు ప్రాంగణమునందు (ముంగిలియందంతటనూ) ఒకేమారు పడును (ప్రసరించును). ఎవరికైననూ పాదములు మిరంతరమూ నడచుటవలన శ్రమచేత వెచ్చదనము నొందియుండును. రవి పాదములు అట్టి నిరంతర గమనముచే కలిగిన నిరంతర శ్రమచే అనునట్లు వెచ్చగా నుండును. అట్టి బ్రధ్న (రవి) పాదములు మిమ్ము రక్షించుగాక!

Sunday, 5 February 2012

Humor+Teaching-7


ఆవేశమెన్నడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో! ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగారు. అతను తనవద్ద పైకం లేదన్నాడు. అయినా ప్రతి 10, 15 ని||లకు అతనిని తిరిగి తిరిగి అడిగారు. చివరికతడు విసిగిపోయి, "నా వద్ద డబ్బు లేదంటూంటే!" అని గొంతు చించుకున్నాడు. సాయి కొంటెగా నవ్వి, "లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు. అదీగాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు?" అన్నారు.

Sai once repeatedly asked a sadhu for dakshina of Rs.5/-. The latter said, in a temper, “You know that I have no money. Why do you ask me still?” Sai smiled sportively and said, “You may have nothing to give, but why lose your composure?” What a practical method of teaching!

Sources:
http://saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx?page=45
http://www.saibharadwaja.org/books/saibabathemaster/saibabathemanandthemaster.aspx

Saturday, 4 February 2012

Humor+Teaching-6


I guess, "Humor+Love" is a more appropriate title for this leela!
 
అణ్ణా చించణీకర్ అను ఒక బాబా భక్తుడు ఉండేవాడు. అతను సరళుడు, మోటువాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాడు, ఎప్పటిది అప్పుడే తేల్చువాడు. బయటకు కఠినునివలే కనిపించేవాడుగానీ, నిజానికి అతడు చాలా మంచి హృదయము కలవాడు. అందుచే బాబా అతనిని ఎంతగానో ప్రేమించేవారు. ఒక మద్యాహ్నము అతడు బాబా ఎడమ చేతికి మర్ధనా చేయుచుండెను. బాబాకు కుడివైపున వేణుబాయి కౌజల్గి అను ఒక వృధ్ధురాలైన వితంతువు ఉన్నది. ఆమెను బాబా, 'అమ్మా' అని పిలిచేవారు; ఇతరులు 'మావిశీబాయి' అని పిలిచేవారు. ఆమెదీ స్వచ్చమైన హృదయము. ఆమెకూడా ఆ సమయంలో బాబాను సేవించుచుండెను. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన చేతి వేళ్ళతో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను. ఇంకొక ప్రక్క అణ్ణా మర్ధనా చేయుచుండెను. మావిశీబాయి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము ఆణ్ణా ముఖమునకు చాలా దగ్గరగా వచ్చెను. ఆమె హాస్యముగా మాట్లాడు స్వభావము కలిగియుండుటచే, అణ్ణాతో, "ఒహో, అణ్ణా చాలా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకోవడనికి ప్రయత్నిస్తున్నాడు. ఇంత ముసలివాడివి అయినా, జుట్టంతా నెరిసి పోయినా, నన్ను ముద్దు పెట్టుకోడానికి నీకు సిగ్గు లేదా?" అని అడిగెను. అణ్ణాకు కోపము వచ్చి, తన చొక్కా చేతులు పైకి మడుచుకుంటో, ఇట్లనెను: "నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావు. నేను వెఱ్ఱివాడినా? నువ్వే అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుచున్నావు."  అక్కడున్న వారందరూ ఈ ఇద్దరి ముసలివాళ్ళ దెబ్బలాటను చూచి నవ్వుకొనుచుండిరి. బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించువారుగనుక, ఇద్దరినీ ఓదార్చవలెనని తలచి, ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధాన పరిచిరి. బాబా ప్రేమతో, "ఓ అణ్ణా! ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? బిడ్డ తన తల్లిని ముద్దు పెట్టుకున్నచో దానిలో తప్పేమున్నది?" అనెను. బాబా మాటలు విని ఆ ఇద్దరూ సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు అక్కడి వారందరి హృదయములు ఎంతో ఆనందముతో నిండిపోయెను.


Hemadpant describes another witty incident, in which Baba played a peace-maker's part. There was one devotee by name Damodar Ghanashyama Babare alias Anna Chinchanikar. He was simple, rough and straightforward. He cared for nobody, always spoke plainly and carried all dealings in cash. Though he looked outwardly harsh and uncompromising, he was good natured and guileless. So Sai Baba loved him. One day, like others serving Baba in their own way, this Anna was, one noon standing prone and was massaging the left arm of Baba, which rested on the kathada (railing). On the right side, one old widow named Venubai Koujalgi whom Baba called mother and all others Mavsibai, was serving Baba in her own way. This Mavsibai was an elderly woman with pure heart. She clasped the fingers of both her hands round the trunk of Baba and was at this time kneading Baba's abdomen. She did this so forcibly that Baba's back and abdomen became flat (one) and Baba moved from side to side. Anna on the other side was steady, but Mavsibai's face moved up and down with her strokes. Once it so happened that her face came very close to Anna's. Being of a witty disposition she remarked - "Oh, this Anna is a lewd (bad) fellow, he wants to kiss me. Even being so old with grey hair he feels no shame in kissing me." These words enraged Anna and he pulled up his sleeves and said - "You say that I am an old bad fellow, am I quite a fool? It is you that have picked up a quarrel and are quarreling with me". All the persons, present there were enjoying this encounter between them. Baba Who loved both of them equally and wanted to pacify them, managed the affair very skillfully. Lovingly He said - "Oh Anna, why are you unnecessarily raising this hue and cry? I do not understand what harm or impropriety is there, when the mother is kissed?" Hearing these words of Baba, both of them were satisfied and all the persons laughed merrily and enjoyed Baba's wit to their heart's content.

Sources:

Thursday, 2 February 2012

Humor+Teaching-5


శిరిడీలో ప్రతీ ఆదివారమూ సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని సరుకులు అమ్ముతూ ఉండేవారు. ప్రతిరోజు మద్యాహ్నము 12 గంటలకు మసీదు భక్తులతో నిండిపోయేది. ముఖ్యముగా ఆదివారమునాడు క్రిక్కిరిసి ఉండేది. ఒక ఆదివారమునాడు హేమాద్‌పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములొత్తుచూ మనస్సునందు జపము చేసుకొనుచుండెను. బాబాకు ఎడమవైపు శ్యామా, కుడివైపున వామనరావు ఉండిరి. శ్రీమాన్ బూటీ, కాకా సాహెబుదీక్షిత్ మొదలగువారుకూడా నుండిరి. శ్యామా నవ్వుచూ అన్నాసాహెబ్‌తో (హేమాద్‌పంతుతో), "నీ కోటుకు శనగగింజలు అంటినట్లున్నవి చూడుము" అనెను. అట్లనుచు హేమాద్‌పంతు చొక్కా చేతులను తట్టగా, శనగ గింజలు నేలరాలెను. హేమాద్‌పంతు తన చొక్కా ఎడమచేతి ముందుభాగమును చాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి.

ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరు ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కాచేతిలో నెట్లు ప్రవేశించి యుండునో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి యచట నిలిచినవో హేమాద్‌పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికి సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనపుడు అందరునూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా, బాబా, "వీనికి (అన్నాసాహెబుకు) తానొక్కడే తిను దుర్గుణ మొకటి గలదు. ఈనాడు సంతరోజు; శనగలు తినుచూ ఇక్కడకు వచ్చినాడు. వాని స్వభావము నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో ఏమి ఆశ్చర్యమున్నది?" అనిరి.

హేమాద్‌పంతు - "బాబా, నేనెప్పుడూ ఒంటరిగా తిని యెరుగను. అయితే, ఈ దుర్గుణమును నాపై ఏల మోపెదవు? ఈనాటికి ఎన్నడునూ శిరిడీలోని సంత నేను చూచి యుండలేదు. ఈరోజు కూడా సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎలా కొనగలను? నేను కొననప్పుడు నేనెలా తినగలను? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమియూ తిని యెరుగను."

బాబా - "అవును అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరునూ దగ్గర లేనపుడు నీవుగానీ, నేనుగానీ ఏమి చేయగలము? కానీ, నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా?"


ఈ లీలనుండి నేర్చుకోవలిసిన బోధ (శ్రీ హేమాద్‌పంతుగారు వివరించినది):
మనము గురువుని స్మరించనిదే ఏ వస్తువును మన మనస్సు మరియు మన ఇంద్రియములతో అనుభవించరాదు. మనస్సునకు ఈ విధముగా శిక్షణను ఇచ్చినచో మనము ఎల్లప్పుడునూ బాబాను జ్ఞప్తియందు ఉంచుకొనగలము. బాబా ధ్యానము ఎన్నో రెట్లు వృధ్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో, అప్పుడు ప్రపంచ సుఖములందుగల అభిలాష క్రమముగా నశించి, మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును.


In Shirdi, bazar was held every Sunday, and people from the neighbouring villages came there, erected booths and stalls on the street, and sold their wares and commodities. Every noon, the Masjid was crowded more or less; but on Sunday, it was crowded to suffocation. On one such Sunday, Hemadpant sat in front of Baba, massaging His Legs and muttering God's name. Shama was on Baba's left, Vamanrao to His right - Shriman Booty and Kakasaheb Dixit and others were also present there. Then Shama laughed and said to Annasaheb - "See that some grains seem to have stuck to the sleeve of your coat". So saying he touched the sleeve and found that there were some grains. Hemadpant straightened his left fore-arm to see what the matter was, when to the the surprise of all, some grains of gram come rolling down and were picked up by the people who were sitting there.

This incident furnished a subject-matter for joke. Everybody present began to wonder and said something or other as to how the grains found their way into the sleeve of the coat and lodged there so long. Hemadpant also could not guess how they found an entrance and stayed there. When nobody could give any satisfactory explanation in this matter, and everybody was wondering about this mystery, Baba said as follows :-


Baba - "This fellow (Annasaheb) has got the bad habit of eating alone. Today is a bazar-day and he was here chewing grams. I know his habit and these grams are a proof of it. What wonder is there is this matter?"

Hemadpant - "Baba, I never know of eating things alone; then why do you thrust this bad habit on me? I have never yet seen Shirdi bazar. I never went to the bazar today, then how could I buy grams, and how could I eat them if I had not bought them? I never eat anything unless I share it with others present near me".

Baba - "It is true that you give to the persons present; but if none be near-by, what could you or I do But do you remember Me before eating? Am I not always with you? Then do you offer Me anything before you eat?"


Teaching from the Leela (explained by Sri Hemadpant):
We should not enjoy any object with our mind and senses without first remembering our Guru. When the mind is trained in this way, we will be always reminded of Baba, and our meditation on Baba will grow apace. The Saguna-form of Baba will ever be before our eyes. When Baba's Form is thus fixed before our mind, the attachment to worldly pleasures will gradually disappear and our mind shall attain peace and happiness.

Sources:

Wednesday, 25 January 2012

Humor+Teaching-4




ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామా పేరిట రూ. 2 మనియార్డరు పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలచి, శ్యామా ఆ కాసులు మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. ఆరు మాసాల తర్వాత, శ్యామా ఇంట దొంగలుపడి సర్వం దోచుకుపోయారు. అతడు బాబాతో మొర పెట్టుకుంటే ఆయన నవ్వుతూ, "నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి రూ. 2 పోయి 6 మాసాలైంది. నేనెవరికి చెప్పుకోను!" అన్నారు. "అంతచిన్న తప్పుకు, ఇంత పెద్ద శిక్షా?" అన్నాడు శ్యామా. "నీలాంటి ఉద్యోగికి అదెంతో, నాలాంటి ఫకీరుకి రూ. 2 అంతే" అన్నారు సాయి. ఈ లీలకు భరద్వాజ మాస్టారుగారు వ్రాసిన కామెంట్: "కర్మ సూత్రమెంత సూక్ష్మమో!" 

Many devotees from far and wide would write letters to Sai Baba of Shirdi. Shama was the one who read the letters aloud to Him and wrote a reply according to Sai Baba’s narration. Well, letters where not the only thing that were sent to Sai Baba through post. Many devotees would send money through post to Saibaba. Shama used to collect this money from the post office and hand it over to Sai Baba. Once it happened that a devotee had sent two Ruppes via post. Shama collected the money, on his way back somehow his intentions where changed. He did not return the money to Sai, instead he hide it over the door of huge room adjacent to Dwarkamai, where Ratha was accommodated, in a cervice of wall. One night there was a theft in Shama’s home. He was robbed of Rs. 250/-, quite a significant amount for a man like him in those days. Search was made for the lost money, police were reported, in vain. The thief or the money were not to be discovered. The depressed and angry Shama went straight to his Deva, and said, “Deva there was a theft in my house and two hundred and fifty Rupees, were stolen. Do you feel good about it? Poor man like me lost so much money. Deva, whom can I tell the tale of woe but You?" Sai Baba, who was calmly listening to the woes replied, “Arre Shamyaa, what is the matter? Because there was a theft, and you lost your money, you came to me with your complaint. But when My two Rupees were stolen, to whom should I complain?” Shama quick to understand the pointer of Sai Baba replied, “Arre Deva, so You caused this robbery to happen. You are great, because Your two rupees were stolen You caused two hundred and fifty rupees to be stolen from a poor man like me. What kind of punishment is this? I lost two hundred and fifty rupees, while You lost only two rupees. What kind of justice is this?”

Sai Baba replied, “The value of two hundred and fifty rupees for a poor man like you, has the same value of two rupees for a Fakir like Me.”
The comment added by Sri Bharadwaja Master garu for this leela is: "How subtle is the law of Karma!" 


Sources:
http://www.saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx
http://forum.spiritualindia.org/

Friday, 13 January 2012

Master Gurdjieff-2


Here are some of the quotes of Master Gurdjieff (I came to know about this Master from the speeches of Master EK). May we contemplate & dip deep into the sayings of great Masters, and be bestowed with a better understanding...

(1) Conscious faith is freedom. Emotional faith is slavery. Mechanical faith is foolishness.

(2) Remember your "self" always and everywhere.

(3) By teaching others, you will learn yourself.

(4) Patience is the mother of will.

(5) The highest aim and sense of human life is the striving to attain the welfare of one's neighbor... and, that this is possible only exclusively by the conscious renunciation of one's own.

(6) Remember, you come here having already understood the necessity of struggling with yourself — only with yourself. Therefore, thank everyone who gives you the opportunity.

(7) The worse the conditions of life, the more productive the work, always, provided, you remember the work.

(8) One of the best means for arousing the wish to work on your "self" is to realize that you may die at any moment. But first you must learn how to keep it in mind.

(9) Here we (Masters?) can only direct and create conditions, but not help.

(10) People cannot perceive reality in their current states because they do not possess consciousness but rather live in a state of a hypnotic "waking sleep."

(11) Free will is the function of the Master within us. Our 'will' is supremacy of one desire over another.

Thursday, 12 January 2012

Master Gurdjieff


కులపతి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులుగారు, తైత్తరీయ ఉపనిషత్తుపై (ఆనందవల్లిపై) చేసిన తమ ప్రవచనంలో, ఒక సందర్భంలో, గుర్జీఫ్ (1877-1949) అనే మహనీయునిగూర్చి చెప్పి, వారు చెప్పిన ఒక సూక్తికి చక్కటి వివరణను సోదాహరణంగా ఇచ్చారు. మాస్టర్ గుర్జీఫ్ గురించి కృష్ణమాచార్యులుగారు తెల్పిన విషయాలు వారి మాటలలోనే ఇక చదివి ఆనందిద్దాము !

ఎదటివాడు మనకు ఎప్పుడు అపకారం చెయ్యగలడంటే... గుర్జీఫ్ (Gurdjieff) అనే ఒక మాస్టర్ (ఆయననే కజేషియన్ (Caucasian) మాస్టర్ అని కూడా అంటారు) చాలా అద్భుతంగా చెప్పాడు: "Your enemies can harm you ONLY WHEN you have the immorality to care for them" అన్నాడు. అంటే, "వాళ్ళను గురించి నువ్వు భయపడేంత అవినీతి, దానికి కావలిసినంత కక్కుర్తి, నీలో ఉన్నరోజునే, వాడు నిన్నేమైనా చెయ్యగలడు." ఆయన వాక్యాలలో చాలా పరమ సత్యాలు ఉన్నవి.  నికల్సన్ (Nicoll?)  మొదలైన మహానుభావులైన శిష్యులు, ఆయన ఒక్కొక్క వాక్యానికి,  15-25 పేజీల వ్యాఖ్యానాలను, "కామెంటరీస్" అన్న పేరుతో volumes (పుస్తకాలు) వ్రాసారు;  జాగ్రత్తగా చదువుకోవాలి.


గుర్జీఫ్ అనేటువంటివాడు చాలా పెద్ద గురువుగారు. ఆయన శిష్యులు ఇప్పుడు పారిస్లో ఒక గ్రూప్ ఉన్నారు. అక్కడకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరినీ కలుస్తూ ఉంటాను (కృష్ణమాచార్యులుగారు చెబుతున్నారు); వాళ్ళందరూ చాలా ఉత్తములైనటువంటివారు. ఆశ్చర్యకరమైన విషయాలు గుర్జీఫ్ ఇంకా చాలా చెప్పారు: "Everyone, while speaking of others, speaks of HIMSELF" అనే ఒక వాక్యం ఇచ్చారు గుర్జీఫ్. అంటే, "ప్రతివాడూ ఇతరుల గురించి మాట్లాడుతున్నవన్నీ, తనగురించే!" ఇదొక పరమ సత్యం.


ఇట్లాంటివన్నీ, మరీ దబ్బనం పెట్టి గుండెకాయ మీద పొడిచినట్టు ఉంటాయి; అసలు చదువుకోకుండా ఉంటే బాగుంటుందనిపిస్తుంది మనకు! ఆయన జీవించి ఉన్నప్పుడుకూడా శిష్యులను అలాగే చెండుకు తిన్నాడు! కెన్నెత్ వాకర్ (Kenneth Walker) అనే ఒక సైకాలజిస్ట్ ఆయన శిష్యుడు; వాణ్ణి, 10  సంవత్సరాల శిష్యరికం ఐన తర్వాత, "నా దగ్గర ఉండడానికి పనికిరావు, నువ్వు తుచ్చుడివి, వెళ్ళిపో" అని వెళ్ళగొట్టాడు.  కొన్ని సంవత్సరాలు ఐన తర్వాత సడన్‌గా ఒక రోజు అతనికి కబురు పంపించాడు. "ఎలా ఉన్నావు? బాగున్నావా? నీకు జరగవలిసినటువంటి కొంత ట్రైనింగ్లో  నా దగ్గర ఉండకూడదు. అందుచేత నిన్ను దూరంగా పంపించేసాను. ఆ ట్రైనింగు పూర్తి అయ్యింది. అందుచేత నిన్ను చూడాలనిపించి పిలుస్తున్నాను,"  అని కబురు పంపించాడు. వాడు నిజమే అనుకుని, వచ్చి దర్శించుకున్నాడు. ఆతర్వాత, అదేరోజు సాయత్రం ఆయన (గుర్జీఫ్) శరీరం విడిచిపెట్టేసాడు. అలాంటివాడు ఈ గుర్జీఫ్ అనేటువంటి ఆయన. పై రెండు వాక్యాలుకూడా ఆయన చెప్పినటువంటివే.

కనుక, పరిస్తితులవలన మనకు భయము ఎప్పుడు కలుగుతుంది అంటే, "పరిస్తితులతో నీకు ఉన్న కక్కుర్తిని బట్టి నాయనా!" అన్నాడు. మా నాన్నగారు (శ్రీ ఎక్కిరాల అనంతాచార్యులుగారు) గుంటూరులో ఇంటర్-మీడియెట్ చదువుకుంటున్న రోజులలో సంగతి ఇది: ఒక సాధువుగారు ఆ ఊర్లో ఒకరి ఇంటిలోకి వచ్చి చేరి, అలా జపం చేసుకుంటో ఉన్నారు. ఒక రోజు ఆయన, ఆ ఇంట్లో వాళ్ళని పూజకోసం ఒక చిన్నంఎత్తు బంగారం ఇవ్వమని అడిగారు. జపం అయ్యిపోయాక, ఆ ఇంట్లో వాళ్ళకి రెండు చిన్నాల బంగారం తిరిగి ఇచ్చాడు. అప్పుడు ఆ ఇంటి ఆయన భార్య తన భర్తతో, "ఏమండీ, మరి కొంచం బంగారం ఇద్దాం" అంది. అసలు విషయం ఇక్కడ ఉంటుంది; అంటే వాడు మన నెత్తిన మేకు కొట్టడానికి, మేకున్నూ మరియు సుత్తె కూడా మనమే ఇస్తాం. అవి అవతలవాడి దగ్గర ఏమీ ఉండవు. ఇలా ఒక ఇరవై రోజులు గడిచేటప్పడికి, ఆ సాధువుగారు వాళ్ళచేతే ఓ కుండ తెప్పించి, వాళ్ళనేమి అడిగాడంటే, "మీ ఇంట్లో ఉన్న నగలన్నీ పట్రండి, మీరే అవి ఆ కుండలో పెట్టి మూత పెట్టండి. ఏడు రోజులపాటు ఈ కుండకి రాత్రింబగళ్ళు మూత తియ్యకుండా పూజ చేయ్యాలి. అది పూర్తయ్యేవరకూ మధ్యలో మూత తియ్యకూడదు. అప్పుడు ఆ కుండలో ఉన్న బంగారానికి రెండు రెట్లు వస్తుంది. మరి ఆ దీక్ష మొదలు పెడదామా?" అని అడిగాడు. అప్పుడు ఆ ఇంటావిడ, "మా చెల్లెలిని కూడా పిలిపిస్తాను అన్నది." ఆ సాధువుగారు, "సరే ఐతే, అలాగే పిలిపించండి" అన్నాడు. ఆవిడని పిలిపించారు. "మా అక్కయ్యను కూడా పిలిపిస్తానండి" అన్నది. ఆవిడని కూడా పిలించారు. ఇట్లాగ, 18 కుటుంబాలు (మహాభారతం 18 పర్వాలు అన్నట్లుగా!) దీనికి ఒప్పుకున్నారు, నమ్మారు, వచ్చి వాళ్ళ బంగారాలన్నీ ఆ కుండలో పెట్టారు. మిగతా కుటుంబాలవాళ్ళని ఇంకా కొంతమందిని పిలిచారుగానీ, వాళ్ళు మాకు అఖ్ఖరలేదు అన్నారు.

దీక్ష మొదలైంది; రెండు రోజులు ఐన తర్వాత, మూడవ రోజు ఇంక ఆ గురువుగారు కనిపించలేదు. దీక్షలో బంగారం పెడుతో ఆయన ఏంచెప్పాడు అంటే, "ఏడు రోజుల లోపులో గనుక మూత తీసినట్లైతే, ఈ కుండలో ఉన్న బంగారం మొత్తమంతా రాజరాజేశ్వరీ అమ్మవారి వద్దకు వెళ్ళిపోతుంది" అని చెప్పాడు. అందుకని, భయంతో ఏడుస్తో, ఏడు రోజులూ, మూత తియ్యకుండా అలానే ఉంచారు. ఏడు రోజులు ఐన తర్వాత మూత తీసి చూసేటప్పడికి, ఇంకేముంది, ఘటాకాశం ఫఠాకాశం అని శంకరాచార్యులవారు చెప్పింది అక్కడ సాక్షాత్కరించింది!


"చూసారా, సాధువుగారు ఎలా చేసారో?" అన్నారు. సాధువుగారు చెయ్యలేదు. ఒకవేళ సాధువుగారే గనుక కర్త అయ్యివుంటే, అందరినీ చేసి ఉండేవాడు కదా! మనలో ఉన్న అసాధు-లక్షణమే కర్త. "మన కక్కుర్తి వల్లనే ఎదటివాడు మన నెత్తిన మేకు కొడతాడు" అని పైన గుర్జీఫ్ చెప్పింది అందుకని మనం తెలుసుకోవాలి. ఎప్పుడూకూడా అక్షరాలా అదొక్కటే సత్యం. ప్రపంచంలో ఎవ్వడూ ఎవ్వడికీ అన్యాయం చెయ్యగలిగినటువంటి స్థితిగానీ, అవకాసంగానీ లేకుండా ప్రకృతి మేకులు బిగించి ఉంచింది. మనకి మనమే మన కక్కుర్తి వలన మేకులు తయారుచేసి ఎదటివాడికి ఇస్తాము!

Friday, 6 January 2012

Tukaram Abhang-4

దేహ దేవాచే మందిర్...

అభంగా మరియు (ఇంచుమిచుగా) భావం:

దేహ దేవాచే మందిర్, ఆత ఆత్మా పరమేశ్వర్
(దేహం దేవుని మందిరం, అందు ఆత్మస్వరూపుడై ఉన్నది సాక్షాత్తు పరమేశ్వరుడే)

జశీ ఉసాత హో సాఖర్, తసా దేహాత హో ఈశ్వర్
(చెరుకు - దాని తియ్యదనం ఎలానో, అలానే దేహము - ఈశ్వరుడు)

జసే దుగ్ధామధ్యే లోణీ, తసా దేహీ చక్రపాణీ
(పాలల్లో వెన్న ఏ రీతిన ఉంటుందో, అలానే శరీరంలో చక్రపాణి ఉన్నాడు)

దేవ్ దేహాత్ దేహాత్, కా హో జాతా దేవళాత్
(దేహంలోని దేవుని మరచి, దేవాలయాలకు పరుగెత్తడమెందుకు?)

తుకా సాంగే మూఢ జనా, దేహి దేవ కా పహానా
(ఇది తెలియని వారికి తుకారాం చెబుతున్నాడు:
దైవం నీలోనే ఉండగా, వేరే ఎక్కడో వెతుకుతావెందుకు?)

Sunday, 1 January 2012

Tukaram Abhang-3

New Year BEST Wishes to All


అభంగా:
జేథే జాతో తేథే తూ మాఝా సాంగాతీ |
చాలవిసీ హాతీ ధరూనియా ||

చాలో వాటే ఆమ్హీ తుఝాచి ఆధార్ |
చాలవిసీ భార్ సవే మాఝా ||

బోలో జాతా బరళ కరిశీ తే నీట |
నేలీ లాజ ధీట కేలో దేవా ||

తుకా మ్హణే ఆతా ఖేళతో కౌతుకే |
జాలే తుఝే సుఖ్ అంతర్బాహీ ||
భావం (ఇంచుమిచుగా):
నేను ఎక్కడకు వెళ్ళినా నీవు నాతోనే వున్నావు
ఈ జీవితంలో నువ్వే నన్ను నడిపిస్తున్నావు

నీ ఆధారంతోనే ఈ జీవిత ప్రయాణం చేస్తున్నాను
నువ్వే నా బరువు బాధ్యతలన్నింటినీ మోస్తున్నావు

నా అర్ధం లేని పలుకులకు పరమార్ధాన్ని ప్రసాదించేది నువ్వే
నా లజ్జను తొలగించి ధైర్యాన్ని ప్రసాదించేదీ నువ్వే దేవా

ఇప్పుడు కేవలం నీ అనుగ్రహమునందే క్రీడిస్తున్నానని తుకారాం చెబుతున్నాడు
బహిరంతరములు రెండింటియందునూ నీవు నాకు సుఖాన్ని ప్రసాదించావు

Tuesday, 22 November 2011

Peria PuraNam



భరద్వాజ మాష్టారు గారు, పారాయణా సాంప్రదాయం గురించి చెబుతో, "మహారాష్ట్ర దేశంలో శ్రీగురు చరిత్ర పారాయణ చేసుకునే సాంప్రదాయం ఉన్నట్లే, తమిళ దేశంలో పెరియ పురాణం పారాయణ చేసుకునే ఒక చక్కటి సాంప్రదాయం ఉన్నది." అని చెబుతారు. అలానే శ్రీ రమణ మహర్షి, పెరియ పురాణంలోని శివ భక్తుల చరిత్రలు తమను ఎంతగానో ప్రభావితం చేసాయని చెబుతారు. (I don't remember exactly, but both of them say something similar to this!)

పెరియ పురాణంలో 63 శైవ భక్తుల (నాయనార్ల) చరిత్రలు ఉంటాయి. ఈ నాయనార్ల జీవిత చరిత్రలకు తెలుగులో సరళమైన అనువాదం ఈ క్రింది వెబ్ పేజీలో చూడగలరు:
http://www.telugubhakti.com/telugupages/Nayanars/Nayanars.htm

వారి యొక్క ధృడ భక్తి, నిస్వార్థ ప్రేమలనుండి మనము కూడా స్పూర్తిని పొందగలమని ఆశిద్దాము.

Bharadwaja Master garu mentions something like this: "Similar to the tradition of Guru Charitra Parayana in Maharastra, in Tamilanadu, there is a good tradition of reading Peria PuraNam." Ramana Maharshi says that He is inspired by the stories of devotees in the Peria-PuraNam, which He happened read before leaving permanently to Arunachalam at the age of 16 years. Peria puraNam contains the life stories 63 devotees of Siva, who are also known as Nayanars.

These stories are available in English here.
You can find very nice pictorial illustrations for each story here.
May we take a leaf out of their unflinching-devotion and selfless-love towards the Lord!

Wednesday, 26 October 2011

Happy Diwali

గురు బంధువులందరికి దీపావళి శుభాకాంక్షలు
Diwali Best Wishes to all Guru Bandhus
Since Diwali is a festival of light and happiness, may we contemplate on what Sai said about: what is the way to achieve happiness???
 
ఆనందానికి సాయి చెప్పిన మార్గం:

ఎవరెవర్ని కోప్పడ్డా నన్ను చాలా బాధపెట్టిన వారవుతారు. ఒకరినొకరు దూషిస్తే నేను చాలా బాధ పడతాను. ఎవడు ధైర్యంగా ఈ నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఆనందం కలిగిస్తాడు. ఎవడైనా నిన్ను నిందించినా శిక్షించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే  ఒకటి రెండు మాటలతో ఓర్పుతో సమాధానం చెప్పు. లేకుంటే నామం స్మరిస్తో ఆ చోటు విడిచిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తియ్యవద్దు. నువ్వెవ్వరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరిగురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడితే చలించకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా! ఇతరులు చేసే పనులకు వారిమీదే ప్రభావముంటుంది. నువ్వు చేసే పనులకు నీపై ప్రభావముంటుంది. ఇదే ఆనందానికి మార్గం. తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు. దానిని లక్ష్యపెట్టక ఋజుమార్గంలో వెళ్ళు.
http://saibharadwaja.org/books/readbook.aspx?book=14&page=137

The Way Told by Sai for Happiness:
If anybody comes and abuses you or punishes you, do not quarrel with him. If you cannot endure it, speak a simple word or two, or else leave the place. But do not battle with him and give tit for a tat. I feel sick and disgusted when you quarrel with others … Do not fight with any; nor scandalise any. When one talks ill of you, pass on unperturbed. His words cannot pierce your body. Others acts will affect them only and not you. It is only your acts that will affect you. If others hate us, let us take to nama japa and avoid them … Do not bark at people; do not be pugnacious. Bear with other’s reproach … This is the way to happiness. Let others and the world turn topsy-turvy, but do not mind that; keep on to your own straight course.

http://saibharadwaja.org/books/saibabathemaster/sayingsofsaibaba.aspx

Tuesday, 11 October 2011

Quiz-1

క్విజ్-1
This image is from: http://www.saibharadwaja.org/


ఈ క్రింది ప్రశ్నలకు సంక్షిప్తమైన సమాధానాలు వ్రాసుకోండి (2 లేక 3 వాక్యాలకు మించకూడదు!, brief and to-the-point answers!)
సమాధానాలు వ్రాయడం పుర్తి అయిన తర్వాత, క్రింద ఇచ్చిన లింకు వద్ద వున్న శ్రీ భరద్వాజ మాష్టారుగారి ఉపన్యాసం విని, మీ సమాధానాలను కరక్ట్ చేసుకోండి.
 ఈ క్రింద ఇవ్వబడ్డ ప్రశ్నలన్నింటికీ మాష్టారుగారి ఆ ఒక్క ఉపన్యాసంలోనే డైరెక్ట్ గా ఆన్సర్స్ ఉన్నాయి!

ఈ క్విజ్లో మొత్తం 14 ప్రశ్నలు వుంటాయి.
ఫ్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయింపబడ్డాయి 
చివరి రెండు ప్రశ్నలకు మాత్రం (13, 14 వ ప్రశ్నలు) ఒక్కొక్క దానికి మూడేసి మార్కులు
కాబట్టి, మొత్తం 30 మార్కులకు ప్రశ్నాపత్రం.
చివరగా, మీరు యెన్ని మార్కులు స్కోర్ చేసారో లెక్క చూసుకోవడం మర్చిపోకండి

ALL THE BEST!!!
ఇక ప్రారంభిద్దామా?

(1) "ఆధ్యాత్మిక జీవితము", "లౌకిక జీవితము" ఈ రెండింటిలో యేది ఎక్కువ ముఖ్యమైనది? ఎందువల్ల?

(2) భార్య, భర్త, పిల్లలు, సంసారము మొదలైన ఈ లౌకికమైన బరువు బాధ్యతలనుండి తప్పించుకుని, ఆధ్యాత్మిక అనుభవాలను, అనందాన్ని పొందగలగడానికి షార్ట్-కట్ ఎమైనా వుందా? ఉంటే, అది ఏమిటి?

(3) అసలు, ఆధ్యాత్మిక జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?

(4) అటువంటి  ఆధ్యాత్మికత కుదరాలంటే మనం ఏమి చెయ్యాలి? ఆధ్యాత్మికత మనకు కొంతైనా వంట పట్టిందో లేదో తెలుసుకోగలగడానికి సూచన / నిదర్శనము ఏమిటి?

(5) "దేవతలు", "రాక్షసులు", "ఋషులు" ఈ ముగ్గురూ కూడా తపస్సు చేసి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది, వరాలను పొందిన కధలను మనం పురాణాలలో వింటాము.  ఐతే, ఆ వరాలద్వారా, చిట్ట చివరకు ఆ ముగ్గురిలో ఎవరెవరు ఏమేమి సాధించారు? ఎందువల్ల అలా జరిగింది?

(6) ఎవరికైనా జీవితంలో కష్టాలు తీవ్రంగా వుండి, ఇక వాటిని భరించడం తమ వల్ల కాదు అని అనిపించినప్పుడు, వారు అత్మహత్య చేసుకంటే అది తప్పా, రైటా? ఎందువల్ల? వారు ఆత్మహత్య ద్వారా, తమను తాము కష్టపెట్టుకుంటున్నారేగానీ మరే ఇతర జీవికీ కష్టం కలిగించడం లేదు కదా?

(7) ప్రేమకు, మమకారానికి భేదం ఏమిటి?

(8) ప్రేమ లేకుండా మమకారం మాత్రమే ఉంటే ఏమవుతుంది?

(9) మమకారం కాకుండా ప్రేమ ఉన్నప్పుడు యేమి జరుగుతుంది? ఒక ఉదాహరణ ఇవ్వండి?

(10) సకల ధర్మాలు తెలిసినవాడు, పరమ భక్తుడు ఐన భీష్ముడిని, శ్రీకృష్ణుడు అర్జునుని ద్వారా చంపించవలసి రావడానికి భీష్ముడు చేసిన అంత పెద్ద దోషం ఏమిటి?

(11) ధర్మం అంటే ఏమిటి? (ఏది ధర్మమో మనకు ఎలా తెలుస్తుంది?)

(12) ధర్మంగా ఉండడం ఎందుకు? అలా ఉండకపొతే ఏమవుతుందో ఒక ఉదాహరణ ఇవ్వండి?

మాష్టారు గారి "లౌకిక జీవితము - ఆధ్యాత్మికత" ఉపన్యాసం సరిగా గుర్తు లేకపోతే, ఆ ఉపన్యాసం ఇప్పుడు ఇంకోసారి విని, ఆ తర్వాత, ఈ క్రింది రెండు ప్రశ్నలను చదివి, సమాధానాలను వ్రాయడానికి ప్రయత్నించండి!!! ఆ ఉపన్యాసానికి లింకు క్రింద ఇవ్వబడినది.
 
(13) "ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష నడుస్తుంది" అన్నదానికి, మాష్టారుగారు, వార్తాలాపం అన్న గ్రంథంలోనుండి ఒక ఉదాహరణ, తమ జీవితంలోనుండి మరో రెండు సంఘటనలను ఉదాహరణగా చెప్పారు. ఆ మూడు సంఘటనలను క్లుప్తంగా మూడు వాక్యాలలో చెప్పండి?

(14) "ధర్మశాస్త్రం గురించి ఇంత కష్టపడి ఇప్పటివరకు మనం చర్చించినదాని సారం అంతా సాయినాథుని చరిత్రలో వస్తుంది", అని చెప్పి, మాష్టారుగారు ఆ సారాన్ని మూడు వాక్యాలలో చెప్పారు. ఆ సారం ఏమిటి?

"లౌకిక జీవితము - పరమార్థికత" అన్న ఉపన్యాసాన్ని వినడానికి ఈ క్రింది లింకు మీద క్లిక్ చెయ్యండి:
http://saibharadwaja.org/audiovideos/telugu/06.%20Loukika%20Jeevithamu%20-%20Parmarthika.mp3

ఓకవేళ ఆ ఉపన్యాసంలో యెక్కడైనా  ఆడియో క్లియర్ గా లేకపొతే, ఈ క్రింది లింకువద్ద వున్న PDF పుస్తకంలో చదువుకోండి:
http://saimastersevatrust.org/Books/Loukika.pdf

Sunday, 7 August 2011

Ordering the book Sannidhi



"సన్నిధి - శ్రీ పాకలపాటి గురువుగారి దివ్య చరిత్ర"  పుస్తక ప్రతులను ఈ క్రింది చోటునుండి పొందవచ్చు:
శ్రీ పాకలపాడు గురుదేవుల ఆశ్రమం,
బలిఘట్టం, ఉత్తరవాహిని తీరము,
నర్సీపట్నం, విశాఖపట్టణం జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్.


ఫోను నెం: 08932-286697
పుస్తకం వెల: రూ|| 35-00

This book can be also ordered online (using credit card) from the following site:
http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=9067

Please refer to my previous posting here for more details...
 
ఈ గ్రంథంలోనుండి,  మచ్చుకకు, మూడు మధుర ఘట్టాలను మాత్రం ఇచ్చట ముచ్చటించుకుందాము! తక్కిన వాటిని పై పుస్తకంలో చదువగలరు :-)

(1) ఉపదేము (పేజి: 118):

నర్సీపట్నం కరణంగారైన  రామకృష్ణా రావుగారు బాబుగారి భక్తులు; వారితో చనువు ఎక్కువ. ఒక రోజు బాబుగారితో, "వచ్చిన వారందరికీ భోజనం పెట్టి పంపించడానికి బదులు ఏ ఉపదేశమైనా ఇస్తే బాగుంటుంది కదా!" అని అన్నారు.

బాబుగారు, "నీకు ఉపదేశమిస్తాను తీసుకుంటావా?" అని అడిగారు. "తప్పకుండా తీసుకుంటాను" అన్నారు. అప్పుడు బాబుగారు ఎదురుగా వున్న మామిడి చెట్టును చూపించి, దాని క్రింద 20 నిముషాలు కూర్చుని రమ్మనగా 5 నిముషాలులోనే తిరిగి వచ్చేసారట. బాబుగారు కారణమేమని అడుగగా, ఆ ప్రదేశమంతా చీమల మయము, అందుకే వచ్చేసానని చెప్పారు. "చీమలకు భయపడిన వాడివి దీక్ష ఏమి చేస్తావు? అందుచే నేను అందరికీ కావలసిన భోజనము సమకూర్చుతాను. వారి వారి యోగ్యతలను బట్టి వారు నా నుండి నేర్చుకుంటారు" అని చెప్పగా రామకృష్ణా రావుగారు సిగ్గుతో తల వంచుకునిరి.

(2) విశ్వాసము (పేజి:134):

భూసుర్లకోట అనే గ్రామంలో ఒక చిన్న ఆశ్రమంలో గురువుగారు వుండగా ఈ సన్నివేశం జరిగింది: అక్కడికి 20-30 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం వున్నది. ఓ ఇల్లాలు భర్త కోసం గంపలో చల్ది అన్నం పెట్టుకుని పొలానికి వెళ్ళింది. దుక్కు చేస్తున్న భర్తను నాగు పాము కరిచింది. వాడు పడిపోయి నురగలు కక్కుతో దొర్లుతున్నాడు. అటువంటప్పుడు ఏ ఆడకూతురూ భర్తను విడిచి వెళ్ళదు. కానీ ఆమెకు శ్రీ బాబు గారంటే అపారమైన నమ్మకం. వెంటనే బయలుదేరి, గురువుగారు వున్న చోటుకు కొన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చింది. "మీ శిష్యుడు చనిపోయాడు బాబూ!" అని ఏడ్చుకుంటో చెప్పింది. ఉదయమనగా ఈ సంఘటన జరిగితే, సాయంత్రానికి (అంత దూరం నడచి) వచ్చి చెప్పింది. గురువుగారు లుంగీ పంచె కట్టుకుని ఉన్నారు. ఆ లుంగీ పంచె అంచు చింపి, మూడు ముళ్ళు వేసి, అది ఆమె చేతికిచ్చి, "అది ఆ తుప్పల మీద పడేసి రా" అన్నారు. ఆమె పడేసింది. ఇలాంటి సందర్భాలలో ఒక్కొక్కసారి  శ్రీవారు తమ యజ్ఞోపవీతాన్ని కూడా త్రెంపేసేవారు. ప్రమాదం గట్టెక్కగానే, నూతన యజ్ఞోపవితం వేసుకునేవారు. "చిన్న బాబూ! ఇప్పుడు టైం ఎంత అయ్యిందో నోట్ చెయ్యి" అన్నారు. నోట్ చేసారు. అంతే! ఆమె ఎంతో ఆనంద పడిపోయింది. భర్త చనిపోయాడన్న ధ్యాసే లేదు. (గిరిజనులు నమ్మితే అలా నమ్ముతారు. వారు అమాయకులు; అంటే తెలివి తక్కువ వారని కాదు, మాయ లేనివారు అని అర్ధము.) వెంటనే ఆమె స్నానం చేసి, బాబు గారిని పంచె అడిగింది; దాన్నే చీరలా కట్టుకుంది. చక్కగా భోజనం చేసి ఆ రాత్రి నిశ్చింతగా పడుకున్నది. ఉదయం లేచి "బాబూ! చిన్న విభూతి ఇవ్వు" అని అడిగి తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళింది.
నాలుగు రోజుల తర్వాత భార్యా భర్త లిద్దరూ బుట్ట నిండా కమలాలు పట్టుకుని వచ్చారు. "ఏం జరిగిందిరా?" అంటే "బాబూ.. నేను పడిపోవడమే నాకు తెలుసుగానీ, మిగిలిన విషయాలేమీ నాకు తెలియవు. ఊరిలోనికి  తీసుకు వెళ్లారు, ఫలానా సమయానికి తెలివి వచ్చింది బాబు" అని చెప్పాడు (అది చిన బాబుగారు నోట్ చేసుకున్న సమయానికి సరిగ్గా సరి పోయింది).

(3) ముక్తి  (పేజి: 144):

ఒక గిరిజన పల్లెలో బాలందొర అనే గిరిజనుడు ఉండేవాడు. భక్తుడు. పదహారు మంది సంతానం. అందరికీ సమానమైన భాగమిచ్చాడు. ఒక రోజు గురువుగారు అతనితో, "ఒరే, ఫలానా సంవత్సరం, ఫలానా అమావాస్యనుంచి  రెండు రోజుల తర్వాత రోజున నీవు కాలంచేస్తే చెయ్యొచ్చును రా" అన్నారు. ఇలా చాలా సంవత్సరాల ముందే చెప్పారు. ఈలోగా, తాను చెయ్యాల్సిన పనులన్నీ చక్కగా గురువు గారి అనుగ్రహం వల్ల నిరవేర్చాడు. 82 సంవత్సరాల వయస్సులో కూడా పిడుగులా ఉన్నాడు! అప్పుడు కూడా చేలోకి వెళ్లి దుక్కి చేసుకుంటున్నాడు. ఇంకా నాలుగు రోజుల్లో చనిపోతాడనగా, ఒక చెట్టు నీడన వట్టి గడ్డి పేర్పించి దానిమీద పడుకున్నాడు.  పిల్లలకు ఏమీ చెప్పలేదు. వానికేమీ జబ్బు లేదు. పిల్లల్లో ఎవరో వెళ్లి బాబుగారికి ఈ విషయం చెప్పారు. సరిగ్గా అతడు శరీరం విడుస్తాడనే రోజుకు వెళ్లారు బాబు. "యేమిరా ఇలా పడుక్కున్నావ్? నీకేం పోయే కాలమా?" అన్నారు బాబు. "పడుకోవలనిపించింది, పడుకున్నా" అన్నాడు ఆ అపర భీష్ముడు! మొత్తం కొడుకులను కూతుళ్ళను పిలిచాడు. వాడి చెయ్యి కూడా వేసాడు. అప్పటి వరకూ పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు. గురువుగారి చెయ్యి కూడా మధ్యలో పెట్టించి, అలా జరిగి, తన తల గురువుగారి తొడ మీద పెట్టుకుని, ఠక్కున చచ్చి పోయాడు. బాబుగారు స్నానం చేసి అగ్నిహొత్రం  పట్టుకుని కొంత దూరం నడిచారు. చినబాబుకి అగ్నిహొత్రమిచ్చి, శవానికి ఒక కొమ్ము కాసి, కొంత దూరం మోసారు. ఒక కడపటి జాతి (మన దృతరాష్ట-దృష్టిలో!) గిరిజనునికి బాబుగారు స్వయంగా అగ్ని సంస్కారం చేసారు. నర్సీపట్నం నుంచి సరుకులు తెప్పించి కొన్ని వేలమందికి సమారాధన చేయించారు. ఎప్పుడు చనిపోతామో తెలియకపోయినా, తామొకనాడు చనిపోతామన్న విషయం అందరికీ తెలుసు. కానీ బాలందొరలా ఏ కొందరో తమ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటారు. బాలందొర కేవలం మన్య జీవి కాడు, ధన్య జీవి.

Tuesday, 29 March 2011

Humor+Teaching-3

Not much humor is associated with this leela, but still wanted to post in the same thread .......

From: శ్రీ పూండి స్వామి వారి దివ్య చరిత్ర" పుస్తకం నుండి 

భగవంతుడు మననుండి కోరే మనస్సు, కాలము వారికి అర్పించకుండా, సిగరెట్లు, టీ లు మొదలగు అవసరాలెన్నో శ్రీ స్వామి వారికి సమపర్పించే జనం ఎక్కువగా దర్శించేవారు.

ప్రతి నిత్యం ఒక పాలవాడు పాలు, టీ, కాఫీ ఏమైనా కావాలేమోనని శ్రీ స్వామి వారిని అడిగేవాడు. ఏమీ వద్దని నిత్యం శ్రీ స్వామి వారు చెప్పేవారు. ఒక రోజు ఆ పాలవాని సైకిలుకు తగిలించి ఉన్న ఇరవై ఐదు లీటర్ల పల క్యాను తెమ్మన్నారు. తేగానే, ఆ క్యానులోని పాలన్నీ శ్రీ స్వామి వారు ఒక్కసారిగా త్రాగేసారు. ఆ పాలవాని సైకిలుకున్న మరొక ఆరు లీటర్ల పాల క్యాను తెమ్మని, ఆ పాలు కూడా త్రాగేసారు! ఈ రోజు ఖాతాదారులకు పాలు ఎలా పొయ్యాలి అనే ఆలోచనతో అతడు వెళ్ళిపోయాడు....

అతడు వెళ్ళగానే శ్రీ స్వామి వారు ఆ పాలన్నీ తిరిగి నేలపై కక్కేసారు. "ఈ పాలు ఎంత మంది తాగుతారు? వాళ్ళంతా ఏమైపోయాలి?" అని చెబుతో ఆ పాలల్లో ఉన్న బల్లిని, తేలును చూపించారు శ్రీ స్వామి వారు. తమిళనాడు ముఖ్య మంత్రి అన్నాదురై గారు మరణించడంతో, ఆ ముందటి రోజు అంగళ్ళన్నీ మూసేసారు. ఆ రోజు పాలు అమ్మే వీలు లేక, ఆ పాలను ఫ్రిజ్లో పెట్టి ఈ రోజు అంగళ్ళకు పోసేందుకు తీసుకుపోతున్నారు. అనుకోకుండా ఆ పాలల్లో బల్లి, తేలు పడి చచ్చి ఉన్నందున ఆ పాలన్నీ చెడిపోయాయి. ఈ విషయం మిగతా ఎవరూ గుర్తించక పోయినా, సర్వజ్ఞులైన ఆ కరుణామయులు  అంత మంది ప్రాణాలు కాపాడారు. మన ప్రార్ధనతో నిమిత్తము లేకుండానే భక్త రక్షణ చేసే కరుణామయులు శ్రీ స్వామి వారు.

God actually expects from us to offer Him our time and our mind. However, many people used to just visit Him offering neither time nor mind; rather they used to just offer Him apparent needs like Cigarettes, Tea etc.

A milk vendor used to ask Swami daily, whether he would like to have coffee, tea or milk!  Swami used to reject his offers all the time! However, once, Swami asked him to bring to him the 25-liters can of milk that was tied to his bicycle. As soon as he brought it, Swami drank the entire milk. After that, Swami asked to also bring the another 6-liters can tied to his bicycle, and drank that milk too!!! The vendor left the place worrying how to manage now with this regular customers......

After he left that place, Swami vomited the entire milk that he had drunk.  He showed a dead Lizard and a Scorpion in that milk and said, “How many people would have died if they had drunk this milk?”.
Here is what had actually happened: On the previous day, since the Tamilnadu Chief Minister Annadurai has died, all the shops were closed; Thus, there was no chance for the milk-vendor to sell the milk to tea-shops; so he kept the milk in fridge and was now going to sell it. Without his notice, a Lizard and a Scorpion fell into that the milk and died; the milk got poisoned. Whosoever drinks the milk, would have died! Though nobody was aware of that, omniscient Swami saved the lives of all those people. Swami is a personification of compassion saving the people without caring for whether they prayed to Him or not.

Sunday, 27 March 2011

Humor+Teaching-2


పూండి స్వామి వారి మరికొన్ని దివ్య లీలలు, " శ్రీ పూండి స్వామి వారి దివ్య చరిత్ర" పుస్తకం నుండి ( http://saimastersevatrust.org/Books/poondi%20swamy.pdf )......

నెల్లిమేడు శివరామ గోవిందు భార్య శ్రీ స్వామి వారికి మంచి భక్తురాలు. వాళ్ళ ఆవు సుఖంగా ఈనితే, శ్రీ స్వామి వారికి ఒక గ్లాసు నిండా పాలు ఇస్తానని  మ్రొక్కుకున్నది. ఆవు ఈనిన తర్వాత తన కుమార్తె ద్వారా శ్రీ స్వామి వారికి పాలు పంపుతోంటే, ఆ ఇంటి యజమాని, "పండ్లు తోముకోని ఆ స్వామికి పాలెందుకు ఇవ్వడం?" అని అన్నాడు; కానీ ఆ పాప పాలు తీసుకు వెళ్ళింది. ఆ పాపను చూస్తోనే శ్రీ స్వామి వారు, "ఆ పాలు మీ ఇంట్లో పండ్లు తోముకునే స్వామికి ఇవ్వు, నాకు వద్దు!" అన్నారు. ఆ పాప వెళ్లి ఆ మాట వాళ్ళ నాన్నకు చెప్పగానే, అయన పశ్చాత్తాపంతో పాలు తీసుకునివెళ్లి, శ్రీ స్వామి వారికి ఇచ్చి క్షమించమని వేడుకున్నాడు. కానీ శ్రీ స్వామి వారు, "నేను పళ్ళు తోముకున్నప్పుడు పాలు త్రాగుతాను, ఇప్పుడు వద్దు తీసుకుపో!" అని కసిరారు. ఈ విశ్వంలో అనుక్షణమూ ఎక్కడ ఏమి జరిగేది తనకు తెలుస్తుందని శ్రీ స్వామి వారు తెలియ జేస్తున్నారు.

అరణి నుండి ఒక భక్తురాలు శ్రీ స్వామి వారి దర్శనార్ధం వస్తూ, ఒక డజను అరటి పండ్లు తీసుకున్నది. వెంటనే ఒక కోతి వచ్చి సగం అరటి పండ్లు పెరుక్కు పోయింది. ఆమె చాలా బాధ పడింది; కానీ ఆ తర్వాత, ఆ కోతిలో కూడా ఆత్మ వుంది కదా అనుకుని సరిపెట్టుకున్నది. శ్రీ స్వామి వారిని దర్శించి, మిగిలిన అరటి పండ్లను వారికి సమర్పించేందుకు వెనుకడుతోంది. ఆప్పుడు శ్రీ స్వామి వారు తమను చూపించుకొంటో, "ఇందులో కూడా ఆత్మ ఉంది. ఈ ఆత్మ కూడా తింటాడు. ఆ అరటి పండ్లు ఇవ్వు!" అని అడిగి మరీ స్వీకరించారు.

Some more divine leelas of Sri Poondi Swami.....

Wife of Sivarama Govindu (Nellimedu) was a great devotee of Swami. She vowed to Swami that she would offer a glassful of milk if her cow yeaned safely. After her cow yeaned, she was going to send a glass of milk to Swami through her daughter. Then her husband told, “Why to offer milk to that Swami? He does not even brush his teeth.” But that girl took the milk to Swami. On seeing her, Swami told “Give that milk to the Swami in your house who brushes his teeth. I don’t want!”  When that girl told those words to her father, he realized Swami’s greatness and he himself took the milk and offered it to Swami with repentance. He begged for Swami’s excuse. But Sri Swami said, “I will drink the milk when I brush my teeth, not now, you take it back.” Thus he conveyed to him that He knows everything about the happenings anywhere in the world.

Once, a devotee was coming from Aarani, brought one dozen of bananas for Swami.  Soon, a monkey came and grabbed half of them.  She initially felt very sad; later she tried to convince herself with the feeling that even the monkey has Athma. Finally, she went for Swami’s darshan and was hesitating to offer the remaining fruits to Swami. Then Sri Swami, pointing to Himself, affectionately said, “Here also Athma is present, and it will also eat bananas; give them to me.” Swami thus lovingly took the remaining bananas from her and ate them.