Showing posts with label Baba. Show all posts
Showing posts with label Baba. Show all posts

Sunday, 5 February 2012

Humor+Teaching-7


ఆవేశమెన్నడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో! ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగారు. అతను తనవద్ద పైకం లేదన్నాడు. అయినా ప్రతి 10, 15 ని||లకు అతనిని తిరిగి తిరిగి అడిగారు. చివరికతడు విసిగిపోయి, "నా వద్ద డబ్బు లేదంటూంటే!" అని గొంతు చించుకున్నాడు. సాయి కొంటెగా నవ్వి, "లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు. అదీగాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు?" అన్నారు.

Sai once repeatedly asked a sadhu for dakshina of Rs.5/-. The latter said, in a temper, “You know that I have no money. Why do you ask me still?” Sai smiled sportively and said, “You may have nothing to give, but why lose your composure?” What a practical method of teaching!

Sources:
http://saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx?page=45
http://www.saibharadwaja.org/books/saibabathemaster/saibabathemanandthemaster.aspx

Saturday, 4 February 2012

Humor+Teaching-6


I guess, "Humor+Love" is a more appropriate title for this leela!
 
అణ్ణా చించణీకర్ అను ఒక బాబా భక్తుడు ఉండేవాడు. అతను సరళుడు, మోటువాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాడు, ఎప్పటిది అప్పుడే తేల్చువాడు. బయటకు కఠినునివలే కనిపించేవాడుగానీ, నిజానికి అతడు చాలా మంచి హృదయము కలవాడు. అందుచే బాబా అతనిని ఎంతగానో ప్రేమించేవారు. ఒక మద్యాహ్నము అతడు బాబా ఎడమ చేతికి మర్ధనా చేయుచుండెను. బాబాకు కుడివైపున వేణుబాయి కౌజల్గి అను ఒక వృధ్ధురాలైన వితంతువు ఉన్నది. ఆమెను బాబా, 'అమ్మా' అని పిలిచేవారు; ఇతరులు 'మావిశీబాయి' అని పిలిచేవారు. ఆమెదీ స్వచ్చమైన హృదయము. ఆమెకూడా ఆ సమయంలో బాబాను సేవించుచుండెను. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన చేతి వేళ్ళతో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను. ఇంకొక ప్రక్క అణ్ణా మర్ధనా చేయుచుండెను. మావిశీబాయి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము ఆణ్ణా ముఖమునకు చాలా దగ్గరగా వచ్చెను. ఆమె హాస్యముగా మాట్లాడు స్వభావము కలిగియుండుటచే, అణ్ణాతో, "ఒహో, అణ్ణా చాలా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకోవడనికి ప్రయత్నిస్తున్నాడు. ఇంత ముసలివాడివి అయినా, జుట్టంతా నెరిసి పోయినా, నన్ను ముద్దు పెట్టుకోడానికి నీకు సిగ్గు లేదా?" అని అడిగెను. అణ్ణాకు కోపము వచ్చి, తన చొక్కా చేతులు పైకి మడుచుకుంటో, ఇట్లనెను: "నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావు. నేను వెఱ్ఱివాడినా? నువ్వే అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుచున్నావు."  అక్కడున్న వారందరూ ఈ ఇద్దరి ముసలివాళ్ళ దెబ్బలాటను చూచి నవ్వుకొనుచుండిరి. బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించువారుగనుక, ఇద్దరినీ ఓదార్చవలెనని తలచి, ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధాన పరిచిరి. బాబా ప్రేమతో, "ఓ అణ్ణా! ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? బిడ్డ తన తల్లిని ముద్దు పెట్టుకున్నచో దానిలో తప్పేమున్నది?" అనెను. బాబా మాటలు విని ఆ ఇద్దరూ సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు అక్కడి వారందరి హృదయములు ఎంతో ఆనందముతో నిండిపోయెను.


Hemadpant describes another witty incident, in which Baba played a peace-maker's part. There was one devotee by name Damodar Ghanashyama Babare alias Anna Chinchanikar. He was simple, rough and straightforward. He cared for nobody, always spoke plainly and carried all dealings in cash. Though he looked outwardly harsh and uncompromising, he was good natured and guileless. So Sai Baba loved him. One day, like others serving Baba in their own way, this Anna was, one noon standing prone and was massaging the left arm of Baba, which rested on the kathada (railing). On the right side, one old widow named Venubai Koujalgi whom Baba called mother and all others Mavsibai, was serving Baba in her own way. This Mavsibai was an elderly woman with pure heart. She clasped the fingers of both her hands round the trunk of Baba and was at this time kneading Baba's abdomen. She did this so forcibly that Baba's back and abdomen became flat (one) and Baba moved from side to side. Anna on the other side was steady, but Mavsibai's face moved up and down with her strokes. Once it so happened that her face came very close to Anna's. Being of a witty disposition she remarked - "Oh, this Anna is a lewd (bad) fellow, he wants to kiss me. Even being so old with grey hair he feels no shame in kissing me." These words enraged Anna and he pulled up his sleeves and said - "You say that I am an old bad fellow, am I quite a fool? It is you that have picked up a quarrel and are quarreling with me". All the persons, present there were enjoying this encounter between them. Baba Who loved both of them equally and wanted to pacify them, managed the affair very skillfully. Lovingly He said - "Oh Anna, why are you unnecessarily raising this hue and cry? I do not understand what harm or impropriety is there, when the mother is kissed?" Hearing these words of Baba, both of them were satisfied and all the persons laughed merrily and enjoyed Baba's wit to their heart's content.

Sources:

Thursday, 2 February 2012

Humor+Teaching-5


శిరిడీలో ప్రతీ ఆదివారమూ సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని సరుకులు అమ్ముతూ ఉండేవారు. ప్రతిరోజు మద్యాహ్నము 12 గంటలకు మసీదు భక్తులతో నిండిపోయేది. ముఖ్యముగా ఆదివారమునాడు క్రిక్కిరిసి ఉండేది. ఒక ఆదివారమునాడు హేమాద్‌పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములొత్తుచూ మనస్సునందు జపము చేసుకొనుచుండెను. బాబాకు ఎడమవైపున శ్యామా, కుడివైపున వామనరావు ఉండిరి. శ్రీమాన్ బూటీ, కాకా సాహెబుదీక్షిత్ మొదలగువారుకూడా నుండిరి. శ్యామా నవ్వుచూ అన్నాసాహెబ్‌తో (హేమాద్‌పంతుతో), "నీ కోటుకు శనగగింజలు అంటినట్లున్నవి చూడుము" అనెను. అట్లనుచు హేమాద్‌పంతు చొక్కా చేతులను తట్టగా, శనగ గింజలు నేలరాలెను. హేమాద్‌పంతు తన చొక్కా ఎడమచేతి ముందుభాగమును చాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి.

ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరు ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కాచేతిలో నెట్లు ప్రవేశించి యుండునో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి యచట నిలిచినవో హేమాద్‌పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికి సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనపుడు అందరునూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా, బాబా, "వీనికి (అన్నాసాహెబుకు) తానొక్కడే తిను దుర్గుణ మొకటి గలదు. ఈనాడు సంతరోజు; శనగలు తినుచూ ఇక్కడకు వచ్చినాడు. వాని స్వభావము నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో ఏమి ఆశ్చర్యమున్నది?" అనిరి.

హేమాద్‌పంతు - "బాబా, నేనెప్పుడూ ఒంటరిగా తిని యెరుగను. అయితే, ఈ దుర్గుణమును నాపై ఏల మోపెదవు? ఈనాటికి ఎన్నడునూ శిరిడీలోని సంత నేను చూచి యుండలేదు. ఈరోజు కూడా సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎలా కొనగలను? నేను కొననప్పుడు నేనెలా తినగలను? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమియూ తిని యెరుగను."

బాబా - "అవును అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరునూ దగ్గర లేనపుడు నీవుగానీ, నేనుగానీ ఏమి చేయగలము? కానీ, నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా?"


ఈ లీలనుండి నేర్చుకోవలిసిన బోధ (శ్రీ హేమాద్‌పంతుగారు వివరించినది):
మనము గురువుని స్మరించనిదే ఏ వస్తువును మన మనస్సు మరియు మన ఇంద్రియములతో అనుభవించరాదు. మనస్సునకు ఈ విధముగా శిక్షణను ఇచ్చినచో మనము ఎల్లప్పుడునూ బాబాను జ్ఞప్తియందు ఉంచుకొనగలము. బాబా ధ్యానము ఎన్నో రెట్లు వృధ్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో, అప్పుడు ప్రపంచ సుఖములందుగల అభిలాష క్రమముగా నశించి, మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును.


In Shirdi, bazar was held every Sunday, and people from the neighbouring villages came there, erected booths and stalls on the street, and sold their wares and commodities. Every noon, the Masjid was crowded more or less; but on Sunday, it was crowded to suffocation. On one such Sunday, Hemadpant sat in front of Baba, massaging His Legs and muttering God's name. Shama was on Baba's left, Vamanrao to His right - Shriman Booty and Kakasaheb Dixit and others were also present there. Then Shama laughed and said to Annasaheb - "See that some grains seem to have stuck to the sleeve of your coat". So saying he touched the sleeve and found that there were some grains. Hemadpant straightened his left fore-arm to see what the matter was, when to the the surprise of all, some grains of gram come rolling down and were picked up by the people who were sitting there.

This incident furnished a subject-matter for joke. Everybody present began to wonder and said something or other as to how the grains found their way into the sleeve of the coat and lodged there so long. Hemadpant also could not guess how they found an entrance and stayed there. When nobody could give any satisfactory explanation in this matter, and everybody was wondering about this mystery, Baba said as follows :-


Baba - "This fellow (Annasaheb) has got the bad habit of eating alone. Today is a bazar-day and he was here chewing grams. I know his habit and these grams are a proof of it. What wonder is there is this matter?"

Hemadpant - "Baba, I never know of eating things alone; then why do you thrust this bad habit on me? I have never yet seen Shirdi bazar. I never went to the bazar today, then how could I buy grams, and how could I eat them if I had not bought them? I never eat anything unless I share it with others present near me".

Baba - "It is true that you give to the persons present; but if none be near-by, what could you or I do But do you remember Me before eating? Am I not always with you? Then do you offer Me anything before you eat?"


Teaching from the Leela (explained by Sri Hemadpant):
We should not enjoy any object with our mind and senses without first remembering our Guru. When the mind is trained in this way, we will be always reminded of Baba, and our meditation on Baba will grow apace. The Saguna-form of Baba will ever be before our eyes. When Baba's Form is thus fixed before our mind, the attachment to worldly pleasures will gradually disappear and our mind shall attain peace and happiness.

Sources:

Wednesday, 25 January 2012

Humor+Teaching-4




ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామా పేరిట రూ. 2 మనియార్డరు పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలచి, శ్యామా ఆ కాసులు మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. ఆరు మాసాల తర్వాత, శ్యామా ఇంట దొంగలుపడి సర్వం దోచుకుపోయారు. అతడు బాబాతో మొర పెట్టుకుంటే ఆయన నవ్వుతూ, "నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి రూ. 2 పోయి 6 మాసాలైంది. నేనెవరికి చెప్పుకోను!" అన్నారు. "అంతచిన్న తప్పుకు, ఇంత పెద్ద శిక్షా?" అన్నాడు శ్యామా. "నీలాంటి ఉద్యోగికి అదెంతో, నాలాంటి ఫకీరుకి రూ. 2 అంతే" అన్నారు సాయి. ఈ లీలకు భరద్వాజ మాస్టారుగారు వ్రాసిన కామెంట్: "కర్మ సూత్రమెంత సూక్ష్మమో!" 

Many devotees from far and wide would write letters to Sai Baba of Shirdi. Shama was the one who read the letters aloud to Him and wrote a reply according to Sai Baba’s narration. Well, letters where not the only thing that were sent to Sai Baba through post. Many devotees would send money through post to Saibaba. Shama used to collect this money from the post office and hand it over to Sai Baba. Once it happened that a devotee had sent two Ruppes via post. Shama collected the money, on his way back somehow his intentions where changed. He did not return the money to Sai, instead he hide it over the door of huge room adjacent to Dwarkamai, where Ratha was accommodated, in a cervice of wall. One night there was a theft in Shama’s home. He was robbed of Rs. 250/-, quite a significant amount for a man like him in those days. Search was made for the lost money, police were reported, in vain. The thief or the money were not to be discovered. The depressed and angry Shama went straight to his Deva, and said, “Deva there was a theft in my house and two hundred and fifty Rupees, were stolen. Do you feel good about it? Poor man like me lost so much money. Deva, whom can I tell the tale of woe but You?" Sai Baba, who was calmly listening to the woes replied, “Arre Shamyaa, what is the matter? Because there was a theft, and you lost your money, you came to me with your complaint. But when My two Rupees were stolen, to whom should I complain?” Shama quick to understand the pointer of Sai Baba replied, “Arre Deva, so You caused this robbery to happen. You are great, because Your two rupees were stolen You caused two hundred and fifty rupees to be stolen from a poor man like me. What kind of punishment is this? I lost two hundred and fifty rupees, while You lost only two rupees. What kind of justice is this?”

Sai Baba replied, “The value of two hundred and fifty rupees for a poor man like you, has the same value of two rupees for a Fakir like Me.”
The comment added by Sri Bharadwaja Master garu for this leela is: "How subtle is the law of Karma!" 


Sources:
http://www.saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx
http://forum.spiritualindia.org/

Wednesday, 26 October 2011

Happy Diwali

గురు బంధువులందరికి దీపావళి శుభాకాంక్షలు
Diwali Best Wishes to all Guru Bandhus
Since Diwali is a festival of light and happiness, may we contemplate on what Sai said about: what is the way to achieve happiness???
 
ఆనందానికి సాయి చెప్పిన మార్గం:

ఎవరెవర్ని కోప్పడ్డా నన్ను చాలా బాధపెట్టిన వారవుతారు. ఒకరినొకరు దూషిస్తే నేను చాలా బాధ పడతాను. ఎవడు ధైర్యంగా ఈ నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఆనందం కలిగిస్తాడు. ఎవడైనా నిన్ను నిందించినా శిక్షించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే  ఒకటి రెండు మాటలతో ఓర్పుతో సమాధానం చెప్పు. లేకుంటే నామం స్మరిస్తో ఆ చోటు విడిచిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తియ్యవద్దు. నువ్వెవ్వరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరిగురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడితే చలించకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా! ఇతరులు చేసే పనులకు వారిమీదే ప్రభావముంటుంది. నువ్వు చేసే పనులకు నీపై ప్రభావముంటుంది. ఇదే ఆనందానికి మార్గం. తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు. దానిని లక్ష్యపెట్టక ఋజుమార్గంలో వెళ్ళు.
http://saibharadwaja.org/books/readbook.aspx?book=14&page=137

The Way Told by Sai for Happiness:
If anybody comes and abuses you or punishes you, do not quarrel with him. If you cannot endure it, speak a simple word or two, or else leave the place. But do not battle with him and give tit for a tat. I feel sick and disgusted when you quarrel with others … Do not fight with any; nor scandalise any. When one talks ill of you, pass on unperturbed. His words cannot pierce your body. Others acts will affect them only and not you. It is only your acts that will affect you. If others hate us, let us take to nama japa and avoid them … Do not bark at people; do not be pugnacious. Bear with other’s reproach … This is the way to happiness. Let others and the world turn topsy-turvy, but do not mind that; keep on to your own straight course.

http://saibharadwaja.org/books/saibabathemaster/sayingsofsaibaba.aspx

Tuesday, 24 May 2011

Hechi Dan Dega Deva


బూటీ 1914లో ప్రఖ్యాత గాయకుడైన ఖాన్ సాహెబ్ గాన కచేరి ఏర్పాటు చేసాడు.  అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుడిని మరాఠిలో భజనలు పాడమన్నారు బాబా. అతడు అయనకు నమస్కరించి, తుకారాం వ్రాసిన, "హేచి దాన్ దేగా దేవా!" ( "దేవా! ఒక మనవి వినుమా!" ) అనే పాట ఎంతో మధురంగా పాడాడు. సాయి మంత్ర ముగ్ధులైనట్లు కన్నులు మూసుకుని శ్రద్ధగా విని, "ఎంత చక్కగ పాడావు! ప్రసాదించకుండటం సాధ్యపడని దానినే కోరాడు తుకారాం". అన్నారు.

పూర్తి పాట:

హేచి దాన దేగ దేవ తుజా విసర న వ్హావ 
విసర న వ్హావ తుజా విసర న వ్హావ (1)

గుణ  గాయిన ఆవడి హేచి మాజి సర్వ జోడి
మాజి సర్వ జోడి హేచి మాజి సర్వ జోడి (2)

న లగే ముక్తి ఆణి సంపదా, న లగే ముక్తి ఆణి సంపదా 
సంత సంగ్ దేయీ సదా, సంత సంగ్ దేయీ సదా, సంత సంగ్ దేయీ సదా (3)

తుకాహ్మణే, తుకాహ్మణే గర్భవాసి సుఖే ఘలావే ఆహ్మసి
సుఖే ఘలావే ఆహ్మసి, సుఖే ఘలావే ఆహ్మసి (4)

గుణ గాయిన ఆవడి హేచి మాజి సర్వ జోడి
మాజి సర్వ జోడి హేచి మాజి సర్వ జోడి (5)

భావం:
ఓ దేవా, మిమ్మల్ని ఎన్నడునూ మరిచి పోకుండా ఉండే వరాన్ని నాకు దయతో ప్రసాదించండి.మిమ్మలను ఎన్నడునూ మరచి పోకుందును గాక. (1)

మీ యొక్క దివ్య గుణాలను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునే వరాన్ని నాకు ప్రసాదించండి. నాతో పాటు, అదే వరాన్ని, నా తోటి వారందరికి కూడా ప్రసాదించండి. (2)

నాకు ముక్తిని, భౌతికమైన సంపదలను ఇమ్మని మిమ్మల్ని అడగడం లేదు. కానీ నాకు ఎల్లప్పుడూ మహాత్ముల సన్నిధిని ప్రసాదించమని మాత్రం మిమ్మల్నికోరుకుంటున్నాను. (3)

పైన చెప్పినవి మాత్రమే నా షరతులు అని తుకారాం చెపుతున్నాడు. కావాలంటే, నన్ను మీరు జన్మ పరంపరలో పెట్టండి; పర్వాలేదు, అందుకు నేను ఏమి అనుకోను. (4)

మీ యొక్క దివ్య గుణాలను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునే వరాన్ని నాకు ప్రసాదించండి. నాతో పాటు, అదే వరాన్ని, నా తోటి వారందరికి కూడా ప్రసాదించండి. (5)

From the book "Sai LeelAmrutham" (Telugu): (Loose translation....)

In 1914, Booty (a devotee of Baba) arranged a concert of a famous singer named "Khan Saheb", before Sai Baba, at Shirdi. After all the people assembled near Baba's mosque, Baba asked him to sing Marathi Bhajans. Then he prostrated before Baba, and sang melodiously, the following Abhang written by Tukaram.  Baba listened to it intently, with closed eyes, as if spell bounded. After the completion of his singing, Baba told, "You sang very beautifully. Tukaram prayed for that which cannot be avoided from bestowing."

haechi daana daega daeva tujaa visara na vhaava 
visara na vhaava tujaa visara na vhaava (1)

guNa  gaayina aavaDi haechi maaji sarva jODi
maaji sarva jODi haechi maaji sarva jODi (2)

na lagae mukti aaNi saMpadaa, na lagae mukti aaNi saMpadaa 
saMta saMg^ daeyee sadaa, saMta saMg^ daeyee sadaa, saMta saMg^ daeyee sadaa (3)

tukaahmaNae, tukaahmaNae garbhavaasi sukhae ghalaavae aahmasi
sukhae ghalaavae aahmasi, sukhae ghalaavae aahmasi (4)

guNa gaayina aavaDi haechi maaji sarva jODi
maaji sarva jODi haechi maaji sarva jODi (5)


Meaning:
O lord, kindly bless me with the boon that I will never forget you. May I never forget you. (1)

Bless me with the boon that I will always remember your divine qualities. May all my fellow people are also blessed with the same boon. (2)

I do not ask you for salvation or wealth; rather, please bless me to be in the company of saints always. (3)

I ask you this much only. I don't mind even if you put me into the cycle of birth and death. (4)

Bless me with the boon that I will always remember your divine qualities. May all my fellow people are also blessed with the same boon. (5)

PS: Thanks to one of the Guru Bandhus in Sai Master Formus, for posting the lyrics of the song.

Sunday, 13 February 2011

మేలుకొలుపు

మహారాష్ట్రలో నామదేవుడు, తుకారాము, తులసీదాసులాంటి మహాభక్తులు ఎట్లానో, మన ఆంధ్రదేశంలో అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పోతనగారు అటువంటివారే అని అనిపిస్తుంది. నామదేవుడు, తుకారాము పాండురంగనిపై  అన్నో అభంగాలను వ్రాసిన విధంగానే, అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరునిపైన, రామదాసు, త్యాగయ్యగార్లు శ్రీ రామునిపైన మనకు అందించారు. తులసీదాసు గారు మరాఠీలో "రామచరిత మానసను", బమ్మెర పోతన గారు తెలుగులో అమూల్యమైన భాగవతాన్ని ఇచ్చారు.

షిరిడీ సాయినాధుని ఆరతులలోని చాలా పాటలు నామదేవుడు, తుకారాము, జనాభాయి వంటి మహాభక్తులు పాండురంగని స్తుతిస్తో వ్రాసిన అభంగాలు.

ఈ  పోస్టులో...
(i) నామదేవుడు  పాండురంగని మీల్కొల్పుతో వ్రాసిన చక్కటి మరాఠీ పాట (సాయినాథుని కాకడ ఆరతి నుండి), మరియు,
(ii) చిత్రంగా, ఇంచుమించు అలాంటి భావంతోనే, శ్రీ వేంకటేశ్వరుని మీల్కొల్పుతో, అచ్చ తెలుగు తేనె పదాలలో, అన్నమయ్య వ్రాసిన పాట.

 ఇక ఆస్వాదించండి!


(i) నామదేవుడు  పాండురంగని మీల్కొల్పే పాట:

ఉఠా పాండురంగా ఆతా దర్శన ద్యాసకళా
ఝాలా అరుణోదయ సరలీ నిద్రేచీ వేలా
(ఓ పాండురంగా! నిదురలేచి నీ దివ్య కళలతో దర్శనమిమ్ము. అరుణోదయమైనది. నిదుర లేచే సమయమైనది.)

సంత సాధు మునీ అవఘే ఝాలేతీ గోలా
సోడా సేజే సుఖే ఆతా బఘు ద్యా ముఖకమలా
(సాధు సంతుల బృందము వేచి యున్నది. నిద్ర సుఖము వీడి నీ దివ్య దర్శనమిమ్ము.)

రంగమండపీ మహాద్వారీ ఝాలీసే దాటీ
మన ఉతావీల రూప పహావయా దృష్టీ
(ద్వార మండపమున వున్న మా మనస్సులు మీ దర్శనానికై ఉవ్విళ్ళూరుచున్నవి.)

రాహీ రఖుమాబాయీ తుమ్హా యేఊ ద్యా దయా
సేజే హాలవునీ జాగే కరా దేవరాయా
(ఓ రాణీ రుక్మిణీ దేవీ!  నీవైనా దయతో రంగని మేల్కొల్పు. (రంగా!) నిద్రను పోగొట్టుకుని మేలుకో.)

గరుడ హనుమంత ఉభే పహాతీ వాట్
స్వర్గీచే సురవర ఘేఉని ఆలే బోభాట్
(దేవ రాజా! గరుడ హనుమంతులు నీ దర్శనానికై వేచియున్నారు. స్వర్గం లోని సురవరులు ఆరతి గొని వచ్చారు. )

ఝాలే ముక్తద్వార లాభ ఝాలా రోకడా
విష్ణుదాస నామా ఉభా ఘేఉని కాకడా
(విష్ణుదాసు నామదేవుడు కాకడ ఆరతి చేపట్టి నిలిచారు.)

అన్నమయ్య వేంకటేశ్వరుని మేల్కొల్పే పాట:

విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
(పన్నగము = పాము. ఇక్కడ, "పన్నగపు దోమతెర" అంటే, ఆదిశేషుడు విడిచిన పూసము యొక్క తెర ఏమో?)

తెల్లవారె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదిగోవారే
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా
(తమ్మి రేకులు = పద్మము యొక్క రేకులు, సారసము = పద్మము)

గరుడ కిన్నర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరునిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా

పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా
(పొంకపు = సొగసైన, పంకజభవాదులు = పద్మము నందు జన్మించిన బ్రహ్మ మొదలైనవారు,  అంకెలనున్నారు = బారు తీరి వున్నారు?) 


References:
Transliteration of Marathi song is based on::
https://www.shrisaibabasansthan.org/new/new_eng%20template_shirdi/miscellaneous/e-books/sgunopasana/part1.pdf
Meaning of Marathi Song is from Master gari book:
http://saibharadwaja.org/books/readbook.aspx?book=4
Annamayya kirthna & approx. meaning:
http://annamacharya-lyrics.blogspot.com/2006/10/36vinnapalu-vinavale-vinthavinthalu.html
and book: "Spiritual heritage of Annamacharya" by prof.Dr.M.Narasimhachary and Dr.Miss M.S.Ramesh