Friday 23 December 2011

Tukaram Abhang-2

అభంగా:
పుణ్య పర ఉపకార పాప తే పరపీడా |
ఆణిక్ నహీ జోడా దుజా యాసీ || 

సత్య తోచీ ధర్మ్, అసత్య తే కర్మ్ |
ఆణిక్ హే వర్మ నాహి దుజే ||

గతి తేచి ముఖీ నామాచే స్మరణ్ |
అధోగతీ జాణ్ విన్ముఖతా ||

సంతాంచా సంగ్ తోచి స్వర్గ్‌వాస్ |
నరక్ తో ఉదాస్ అనర్గల్ ||

తుకా మ్హణే ఉఘడే ఆహే హిత్ ఘాత్ |
జయా జే ఉచిత్ కరా తైసే ||

భావం (ఇంచుమిచుగా):
పరోపకారం చెయ్యడం పుణ్యం, పరపీడనం - పాపం
ఫుణ్య పాపాల గూర్చి చెప్పడానికి ఇంతకంటే మెరుగైన పోలిక లేదు

సత్యంగా జీవించడం - ధర్మం, అసత్యం - కర్మను (పాపం) ప్రోగుజేసుకోవడం
ఇందులో ఎంతమాత్రము సందేహం లేదు

భగవంతుని చేరడానికి మార్గం - ఎల్లప్పుడూ నోటితో అయన నామం స్మరించడం
అట్లా చెయ్యకపోవడం - అయననుండి విన్ముఖం (దూరం) కావడం

మహాత్ముల సాంగత్యం -అసలైన స్వర్గవాసం
ఉద్దేశ్య పూర్వకంగా వారిపట్ల అమర్యాద - నరకంలో ఉండడమే

తుకారాం ఏది హితమో ఏది చెరుపో చెప్పాడు
ఆపై నీకు ఉచితము అనిపించింది చెయ్యి

No comments: