Master EK గారు, భక్తి ఉన్నవాడి లక్షణాలు గురించి చెబుతూ, మిగతా చాలా లక్షణాలతో పాటుగా వారు చెప్పిన ఒక లక్షణము: "భక్తి
కలిగిన వాళ్ళు వయస్సుచేత పెద్దవాళ్ళు అయినప్పటికీ, వాళ్ళు చేస్తున్నటువంటి
పనులు పిల్లలు చేస్తున్న సరదాతో, ఉత్సాహంతో, సంతోషంతో ఉంటాయి. అలా అని,
పిల్లలు చేస్తున్నటువంటి పాడు పనులు వాళ్ళు చెయ్యరు. చైల్డిష్ (childish)
కాదు, చైల్డ్-లైక్ (child-like)గా ఉంటారు." పిల్లల మనస్తత్వానికి,
చాలామంది పెద్దల మనస్తత్వానికిగల తేడాను, జి. కె. చెస్టర్‌సన్ అనే ఒక
ఇంగ్లీషు హాస్య రచయిత వ్రాసిన ఒక కధలోనుండి 4 ఉదాహరణలు తీసుకుని,
కృష్ణమాచార్యులుగారు వివరించారు.
ఆ ఆర్టికల్ పేరు: "On Running after One's Hat"; దానిని ఈ క్రింది లింకు వద్ద చదువవచ్చును:
http://www.catholic-forum.com/ saints/gkc16004.htm
http://www.catholic-forum.com/
కృష్ణమాచార్యులగారి మాటలలోనే చెస్టర్‌సన్‌గారి ఆర్టికల్‌లోనుండి రెండు ఉదాహరణలనుమాత్రం ఇక్కడ చూద్దాము:
(1) మనం వేరే ఊరుకి వెడుతున్నామనుకోండి. రైలు ఎప్పుడు వస్తుందో ఫోన్ చేసి కనుక్కుని, ఇంకో ఐదు నిముషాలలో వచ్చేస్తుందని చెప్పాకనే మనం స్టేషనుకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత, రైలు 5 నిముషాలలో రావడం లేదు, 150 నిముషాలలో వస్తుంది అన్నాడనుకోండి! ఇండియాలో అలాంటివి జరగడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు కదా! అయినప్పుడు, మన కుటుంబంలో ఉన్న ఐదారుగురం స్టేషన్లో కూర్చున్నాము. మామూలుగా ఎలా కూర్చుంటాం? శవ జాగరణ చేస్తున్నట్లు కూర్చుంటాం. "రైలు ఆలస్యమైతే ప్రయాణికుల మొహాలు", "శవం దగ్గర రాత్రి తెల్లవార్లు కూర్చుంటున్న వాళ్ళ మొహాలు", ఫొటోలు తీస్తే, రెండూ ఒక్కలాగే ఉంటాయి . ఆ కుటుంబంలోనే, ఏడేళ్ళ కుర్రవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఈ 150 నిముషాలు ఏం చేస్తూ ఉన్నాడు? స్టేషన్లో అటు నడుస్తాడు, ఇటు నడుస్తాడు. ఇంకా, "సిగ్నలిస్తునారు...., అదిగో అదిగో అక్కడ ఎర్ర లైటు వెలిగింది...., ఇపుడు పచ్చ లైటు వెలిగింది..... రైలు వచ్చేస్తోంది కూఊఊఊక్ " అని అరుస్తూ, గెంతుతో ఉంటాడు . అంటే, పెద్దవాళ్ళేమో ఈ 150 నిముషాలు ఏడుస్తూ వెయిట్ (wait) చేస్తున్నారు; ఆ పిల్లవాడేమో నవ్వుతూ వెయిట్ చేస్తున్నాడు. అంతేకదా తేడా! వెయిట్ చెయ్యడం ఎలాగూ తప్పదు. అలాంటప్పుడు ఏడుస్తూ వెయిట్ చెయ్యడం ఎందుకని? ఆ మొహాలు అలా చావగొట్టిన గాడిదలల్లే పెట్టి కూర్చోవడం ఎందుకని? ఈ పాయింట్ తట్టడానికి మనకి చాలా టైం పడుతుంది. ఫిజికల్‌గా వీడూ వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళూ వెయిట్ చేస్తున్నారుకానీ; కానీ పిల్లవాడు మెంటల్‌గా వెయిట్ చెయ్యడం లేదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంతే తేడా. ఇప్పుడు నేను చెప్పిన కధ "On Running after One's Hat" అన్న ఒక ఆర్టికల్‌లో, జి. కె. చెస్టర్‌సన్ అనే (బెర్నాడ్‌షాతో సాటి అయిన) ఒక మంచి హాస్య రచయిత వ్రాసాడు. వాళ్ళకి తడతాయి ఇలాంటివి, ఎలా తడతాయోగానీ! సీరియస్ మైండెడ్‌గా ఉండి, బైబిల్ చదువుకునేవాడు, వేదాలు చదువుకునేవాడు, ఉపనిషత్తులు చదువుకునేవాడు: వీళ్ళకి ఏమీ తట్టి చావవు, ఆ చదువుకుంటున్న పదాలు నాలుగు తప్ప! వాళ్ళకి తడతాయి ఎక్కడలేని డైమన్షన్సూను (దృష్టి కోణాలు).
(2)
చెస్టర్‌సన్‌గారి స్నేహితుడు ఒక అతను, అతని కళ్ళజోడు, తాళంచెవులు మొదలైనవి
ఒక డ్రాయరులో (సొరుగులో) పెట్టుకునేవాడు. ఆఫీసుకు వెళ్ళేముందు ఆ
వస్తువులు తీసుకోడానికి ఆ డ్రాయరు లాగితే అది ఎంతకూ వచ్చేదికాదు, అది బాగా
పాత డ్రాయరు. ఆఫీస్ టైము అయిపోతోంది, ఇది రాదు, రోజూ కోపము, ఏడుపు
వస్తుంది, బి.పి. పెరుగుతుంది. తర్వాత ఏదో గందరగోళమై, అటూ ఇటూ లాగటమై అది
తియ్యడం అవుతుంది. రోజూ ఇంత పని అవుతోందని ఈ చెస్టర్‌సన్‌గారితో చెప్పాడు.
అప్పుడు ఆయన ఏమన్నారంటే, "డ్రాయర్ రాదు, దాన్ని లాగుతున్నాము అనేటువంటి
దుర్భుద్ధితో నువ్వు లాగుతున్నావుగనుక, నువ్వు దానిని వంకరగా లాగుతున్నావు,
అందువల్ల అది రావడంలేదు. క్లబ్బులోకి వెళ్ళి ఆటలు ఆడుతునప్పుడు, ఒక తాడును
అవతల వాళ్ళు ఒక ప్రక్క, నువ్వు ఇంకో ప్రక్క పట్టుకుని లాగుతున్నప్పుడు,
మీ ఇంట్లో డ్రాయర్ లాగుతున్నట్లు ఇలా ఏడుస్తోనే లాగుతావా? అక్కడ నవ్వుతో
సరదాగా ఉత్సాహంగా లాగుతావుకదా; అలాగే ఇక్కడ కూడా సరదాగా లాగు! అప్పుడు అదే
వస్తుంది" అని చెప్పారు.
No comments:
Post a Comment