Sunday 13 February 2011

మేలుకొలుపు

మహారాష్ట్రలో నామదేవుడు, తుకారాము, తులసీదాసులాంటి మహాభక్తులు ఎట్లానో, మన ఆంధ్రదేశంలో అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పోతనగారు అటువంటివారే అని అనిపిస్తుంది. నామదేవుడు, తుకారాము పాండురంగనిపై  అన్నో అభంగాలను వ్రాసిన విధంగానే, అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరునిపైన, రామదాసు, త్యాగయ్యగార్లు శ్రీ రామునిపైన మనకు అందించారు. తులసీదాసు గారు మరాఠీలో "రామచరిత మానసను", బమ్మెర పోతన గారు తెలుగులో అమూల్యమైన భాగవతాన్ని ఇచ్చారు.

షిరిడీ సాయినాధుని ఆరతులలోని చాలా పాటలు నామదేవుడు, తుకారాము, జనాభాయి వంటి మహాభక్తులు పాండురంగని స్తుతిస్తో వ్రాసిన అభంగాలు.

ఈ  పోస్టులో...
(i) నామదేవుడు  పాండురంగని మీల్కొల్పుతో వ్రాసిన చక్కటి మరాఠీ పాట (సాయినాథుని కాకడ ఆరతి నుండి), మరియు,
(ii) చిత్రంగా, ఇంచుమించు అలాంటి భావంతోనే, శ్రీ వేంకటేశ్వరుని మీల్కొల్పుతో, అచ్చ తెలుగు తేనె పదాలలో, అన్నమయ్య వ్రాసిన పాట.

 ఇక ఆస్వాదించండి!


(i) నామదేవుడు  పాండురంగని మీల్కొల్పే పాట:

ఉఠా పాండురంగా ఆతా దర్శన ద్యాసకళా
ఝాలా అరుణోదయ సరలీ నిద్రేచీ వేలా
(ఓ పాండురంగా! నిదురలేచి నీ దివ్య కళలతో దర్శనమిమ్ము. అరుణోదయమైనది. నిదుర లేచే సమయమైనది.)

సంత సాధు మునీ అవఘే ఝాలేతీ గోలా
సోడా సేజే సుఖే ఆతా బఘు ద్యా ముఖకమలా
(సాధు సంతుల బృందము వేచి యున్నది. నిద్ర సుఖము వీడి నీ దివ్య దర్శనమిమ్ము.)

రంగమండపీ మహాద్వారీ ఝాలీసే దాటీ
మన ఉతావీల రూప పహావయా దృష్టీ
(ద్వార మండపమున వున్న మా మనస్సులు మీ దర్శనానికై ఉవ్విళ్ళూరుచున్నవి.)

రాహీ రఖుమాబాయీ తుమ్హా యేఊ ద్యా దయా
సేజే హాలవునీ జాగే కరా దేవరాయా
(ఓ రాణీ రుక్మిణీ దేవీ!  నీవైనా దయతో రంగని మేల్కొల్పు. (రంగా!) నిద్రను పోగొట్టుకుని మేలుకో.)

గరుడ హనుమంత ఉభే పహాతీ వాట్
స్వర్గీచే సురవర ఘేఉని ఆలే బోభాట్
(దేవ రాజా! గరుడ హనుమంతులు నీ దర్శనానికై వేచియున్నారు. స్వర్గం లోని సురవరులు ఆరతి గొని వచ్చారు. )

ఝాలే ముక్తద్వార లాభ ఝాలా రోకడా
విష్ణుదాస నామా ఉభా ఘేఉని కాకడా
(విష్ణుదాసు నామదేవుడు కాకడ ఆరతి చేపట్టి నిలిచారు.)

అన్నమయ్య వేంకటేశ్వరుని మేల్కొల్పే పాట:

విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
(పన్నగము = పాము. ఇక్కడ, "పన్నగపు దోమతెర" అంటే, ఆదిశేషుడు విడిచిన పూసము యొక్క తెర ఏమో?)

తెల్లవారె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదిగోవారే
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా
(తమ్మి రేకులు = పద్మము యొక్క రేకులు, సారసము = పద్మము)

గరుడ కిన్నర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరునిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా

పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా
(పొంకపు = సొగసైన, పంకజభవాదులు = పద్మము నందు జన్మించిన బ్రహ్మ మొదలైనవారు,  అంకెలనున్నారు = బారు తీరి వున్నారు?) 


References:
Transliteration of Marathi song is based on::
https://www.shrisaibabasansthan.org/new/new_eng%20template_shirdi/miscellaneous/e-books/sgunopasana/part1.pdf
Meaning of Marathi Song is from Master gari book:
http://saibharadwaja.org/books/readbook.aspx?book=4
Annamayya kirthna & approx. meaning:
http://annamacharya-lyrics.blogspot.com/2006/10/36vinnapalu-vinavale-vinthavinthalu.html
and book: "Spiritual heritage of Annamacharya" by prof.Dr.M.Narasimhachary and Dr.Miss M.S.Ramesh

No comments: